న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. జనజీవనం, రవాణ వ్యవస్థ స్తంభించిపోతోంది. మంగళవారం ఉత్తరాదిన 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో ఆరు రైళ్లను రద్దు చేశారు.
ఇస్లాంపూర్-న్యూఢిల్లీ మగధ్ ఎక్స్‌ప్రెస్ 48 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 22 గంటలు, భువనేశ్వర్-న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 38 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఏ విమానం కూడా రద్దు కాలేదు. కాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా వచ్చాయి.
రైళ్లు గంటల కొద్దీ ఆలస్యం
Published Tue, Dec 13 2016 10:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement