న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్‌లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదీ చదవండి: హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
Comments
Please login to add a commentAdd a comment