Cold wave
-
వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో తగ్గిన విజిబిలిటీ
-
గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ
-
పలు రాష్ట్రాలకు కోల్డ్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్ -
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత
-
వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. చలిపులి పంజా (ఫొటోలు)
-
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 110 విమానాలు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో చలి బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో విపరీతంగా చలి పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశమంతటా చలిగాలులు వీస్తున్నాయి. #WATCH | Dense fog covers parts of national capital as cold wave continues. (Visuals from Dhaula Kuan area, shot at 6:15 am) pic.twitter.com/MneDB9QmJC — ANI (@ANI) December 27, 2023 పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో పొగమంచు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దడ పుట్టిస్తున్న చలి చలి తీవ్రత పెరగడంతో రాజధాని వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులపై బయటికి వెళ్లేవారు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తవ్రత పెరిగిన కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 110 విమాన రాకపోకలకు అంతరాయం పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులో దృశ్యమానత(విజిబిలిటీ) దాదాపు సున్నాకి పడిపోయింది. ఉదయం 10 గంటలకు కూడా రహదారులన్నీ పొగమంచుతో కమ్ముకున్నాయి. 'దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 110 విమాన రాకపోకలకు ఆలస్యం అవుతోంది' అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ పేర్కొంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని 25 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. తెలుగురాష్ట్రాలను కప్పేసిన మంచు తెలుగురాష్ట్రాలను కూడా పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలు అయినా పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అటు.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. రోడ్లు కనపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు -
Fog: విజయవాడ-హైదరాబాద్ హైవేపై నిలిచిన వాహనాలు
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయాన్నే నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద భారీ పొగమంచు వల్ల వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. చెన్నై-కలకత్తా హైవేపై కూడా కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌తో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లితో పాటు పలు చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇదీచదవండి..ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు.. -
Beijing Cold Wave: రికార్డులు బ్రేక్ !
బీజింగ్:చైనాను చలి గడ్డ కట్టిస్తోంది.1951లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించినప్పటి నుంచి బీజింగ్‌లో డిసెంబర్ నెలలో అతి ఎక్కువ రోజులు కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి జీరో దాటి మైనస్‌లోకి వెళ్లిన ఉష్ణోగ్రతలు ఆదివారం జీరో డిగ్రీకి చేరుకున్నాయి. మొత్తం చైనాను ఈ నెలలో కోల్డ్ వేవ్ కమ్మేసింది. దేశవ్యాప్తంగా హీటర్లు పనిచేస్తుండడంతో పవర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లు వాటి పూర్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. సామర్థ్యానికి మించి పని చేస్తుండటంతో సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్‌లో పలు పవర్ ప్లాంట్లు ఫెయిల్ అయ్యాయి. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాల్లో హీటర్లు పనిచేయడానికే మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీల్లో హీటర్లు నిలిపివేశారు. తీవ్రమైన మంచు కురవడం వల్ల బీజింగ్‌లో ఈ నెల మొదటి వారంలో రెండు మెట్రో రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న డజన్ల కొద్ది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర చైనాలోని గన్సు ప్రావిన్సులో ఇటీవల సంభవించిన భూకంప రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. ఇదీచదవండి..ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్ ! -
విశాఖ ఏజేన్సీలో చలి బీభత్సం
-
ఒకవైపు వణికిస్తున్న చలి.. మరొకవైపు కమ్మేస్తున్న పొగమంచు
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రం చలికి వణుకుతోంది. పశ్చిమ గాలుల ప్రభావంతోనే చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మింది. ఉత్తర భారతదేశంతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి గాలులు వీస్తుండటం వల్ల రాష్ట్రంలోనూ చలి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, డుంబ్రిగూడ, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురవడంతో పలు ప్రాంతాలలో మంచు గడ్డ కట్టింది. పాడేరుకు సమీపంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట నిలిపిన కారుపై మంచు పేరుకుపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పంట భూముల వద్ద మంచు పొరలు ఏర్పడ్డాయి. ఏజెన్సీలో మంచు గడ్డకట్టిన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలి ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పడిపోయాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ అరకు మాదిరిగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 6.3, ఆలూరు మండలం కమ్మరచేడులో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల, సత్యసాయి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 డిగ్రీలకంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో 3, 4 రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 1.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 2 డిగ్రీలు, కుంతలం, హుకుంపేటలో 2.3, జీకే వీధిలో 2.6, చింతపల్లిలో 2.8, అరకు, డుంబ్రిగూడలో 3.2, పాడేరులో 3.6, కొక్కిసలో 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 6.3, కమ్మరచేడులో 6.5, జి.శింగవరంలో 6.6, కె.నాగలాపురంలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో 11.6, తిరుపతిలో 14.7, విజయవాడ రూరల్ నున్నలో 14.9, విజయవాడ గుణదలలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
అబ్బా.. చలి చంపుతోంది!
సాక్షి, హైదరాబాద్/కోహీర్(జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. ఈశాన్యం వైపు నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. రాష్టంలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్(యు)లో 4.8 డిగ్రీలు రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి 5 డిగ్రీలతో మూడో స్థానంలో నిలిచాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో... కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ గజగజలాడుతోంది. సోమవారం తెల్లవారుజామున శివరాంపల్లిలో కనిష్టంగా 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా నగరం మొత్తంగా సరాసరిన 11.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 10దాటినా తొలగని మంచు పాల్వంచ రూరల్: కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల సమీపాన ఉండే గ్రామాల్లో ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటం, ఉదయం 10 గంటల వరకూ మంచు తెరలు వీడకపోవడంతో రాత్రంతా నెగడు (చలిమంటలు) వద్దే గడుపుతున్నారు. పడుకునే సమయాన కూడా పక్కన నెగడుకు తోడు దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చిరుతానిపాడులో, పెద్దకలశ, రాళ్లచెలక, బుసురాయి, ఎర్రబోరు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. -
అమ్మో చలి.. గజగజలాడిపోతున్నారు (ఫొటోలు)
-
AP Cold Waves: విశాఖ ఏజెన్సీ చరిత్రలో తొలిసారి!
దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్‌గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్‌వేవ్ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్‌గా పరిగణిస్తారు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్‌వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. -
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. స్కూళ్లకు సెలవులు
భోపాల్: భారత్‌లోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 కేసులు నమోదవ్వడంతో కోవిడ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా లాక్ విధిస్తారని, త్వరలో విద్యాసంస్థలు కూడ బంద్ చేస్తారనే వార్తలు కూడా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐడీ) కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నిజంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. అయితే కరోనా కారణంగా కాదు. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో స్కూళ్లను మూసేశారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు జోరుగా వీస్తున్నాయి. చలి తీవ్రరూపం దాల్చడంతో భోపాల్, ఇండోర్, విదిషా, ఉజ్జయినితో సహా కొన్ని జిల్లాలో 8వ తరగతి వరకు పాఠశాలలు మూసేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఛతర్పూర్ జిల్లాలోని నౌగాంగ్ పట్టణంలో శుక్రవారం ఉదయం అత్యల్పంగా 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారి హెచ్ఎస్ పాండే తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం పూట రోడ్లపై పొగమంచు ఏర్పడటం కారణంగా అసలు ప్రయాణికులే కనిపించడం లేదని పేర్కొన్నారు. విపరీతమైన చలిలో ప్రజలు భోగి మంటల చుట్టూ బారులు తీరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఐదవ రోజు 7 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా నమోదయ్యాయని ఆయన చెప్పారు గుణ, సత్నా, డాటియా, జబల్పూర్, సాగర్ మరియు ఛతర్పూర్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు, చల్లటి వాతావరణం నెలకొంది. గ్వాలియర్, రేవా, ఛతర్పూర్ జిల్లాలోని నౌగావ్ పట్టణంలో ఒక మోస్తరు పొగమంచు కమ్ముకుంది. భోపాల్, ఇండోర్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.3, 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. -
చలి తీవ్రతతో వణుకుతున్న వరంగల్ వాసులు
-
తెలంగాణను వణికిస్తున్న చలి.. అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో అతితక్కువగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ్‌పల్లిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31.6 డిగ్రీల సెల్సీయస్‌గా రికార్డయ్యింది. సాధారణంగా ఈ సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడురోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
హైదరాబాద్‌ను కప్పేసిన దట్టమైన పొగమంచు.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. మరోవైపుసాయంత్రం అయిదు గంటలకే కారుచీకట్లు అలుముకునేలా సర్పిలాకారంలో (స్పైరల్) కమ్మేసిన కారుమబ్బులు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ.. వెరసీ.. సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూ వాతావరణానికి తక్కువ ఎత్తులో.. కేవలం 0.9 కి. మీ ఎత్తులోనే దట్టమైన క్యుములో నింబస్మేఘాలు ఏర్పడడం వీటి నుంచి నింబోస్ట్రేటస్, అల్టోస్ట్రేటస్ అనే వాయువులు వెలువడడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ సమస్యలున్నవారు ఊపి రాడక విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: ‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు కాలుష్యం.. కారుమబ్బులు.. ► నగరంలో పీల్చే గాలిలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆయా కారకాలు దట్టమైన మేఘాల కారణంగా భూ ఉపరితల వాతావరణంలో పైకి వెళ్లలేక భూవాతావరణాన్ని ఆవహిస్తున్నాయి. మరోవైపు అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. సిటీజన్లు న్యుమోనియా, అస్తమా, ఓమిక్రాన్ తదితర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ► క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం)తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.ì గత మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. కాలుష్యం విషయానికి వస్తే..సిటీలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. చదవండి: HYD: మందుతాగి పోలీసులకు దొరికితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే! ►గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. పలు కూడళ్లలో సుమారు 90–100 మైక్రోగ్రాముల ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. అంతేకాదు ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త... ఉష్ణోగ్రతలు పడిపోతుండడం, పొగమంచు కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. చలినుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరని సూచిస్తున్నారు. -
ఢిల్లీని వణికిస్తున్న చలి
న్యూఢిల్లీ: ఉత్తరభారతం చలి దుప్పటి కప్పుకుంది. ఢిల్లీపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రాజధానిలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో మైనస్ 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత(ఆల్‌టైమ్ కనిష్ఠం) ఢిల్లీలో నమోదయింది. గతేడాది జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర ఢిల్లీలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలిపులి కారణంగా ఉదయం 6గంటల సమయంలో దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంది. దీంతో కనీసం మీటర్ దూరంలో వస్తువులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గత గురువారం ఢిల్లీలో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జనవరి 2 నుంచి 6 వరకు మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల(వెస్టర్న్ డిస్ట్రబెన్సెస్) కారణంగా ఉత్తర భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని ఐఎండీ అధిపతి కులదీప్ శ్రీవాస్తవ చెప్పారు. -
వణికిపోతున్న విశాఖ మన్యం
సాక్షి, పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడలేదు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
-56 డిగ్రీలు.. గడ్డకట్టి ప్రాణాలు విడిచాయి..
కజకిస్థాన్, మధ్య ఆసియా : మధ్య ఆసియా దేశాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. ఆర్కిటిక్ ఖండం స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మధ్య ఆసియా దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కజకిస్థాన్‌లో మంచు తీవ్రతకు జంతువులు గడ్డ కట్టి ప్రాణాలు విడిచాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మంచుదిబ్బలో కూరుకుపోయి గడ్డకట్టి మరణించిన కుక్క ఫెన్సింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కుందేలు అందులో ఇరుక్కుపోయి చలి తీవ్రతకు గడ్డకట్టి మరణించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన కుందేలును స్థానికులు ఫెన్సింగ్ నుంచి బయటకు తీశారు. అదే ప్రాంతంలో మంచు దిబ్బను దాటడానికి ప్రయత్నించిన శునకం కూడా దానిలో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది. ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశం ‘ఓమియాకాన్’ సైబీరియాలోనే ఉంది. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రత -67 డిగ్రీలకు పడిపోతుంది. -
చలిగాలులకు ఏడుగురి మృతి
వర్దా తుపాన్ నేపథ్యంలో పెరిగిన చలి తీవ్రతకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందాడు. వెంకటాచలం : తుపాను వల్ల చలిగాలులు వీచడంతో వెంకటాచలం మండలంలో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ యర్రగుంటకు చెందిన చెంబేటి చెంచయ్య (60) , నిడిగుంటపాళెం పంచాయతి చవటదళితవాడకు చెందిన చెంతాటి పోతయ్యకు(62) చలిగాలలకు తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోలను పంపి వివరాలు నమోదు చేయించారు. కాకుటూరులో యాచకుడు మండలంలోని కాకుటూరులో చలిగాలులకు తట్టుకోలేక యాచకుడు(70) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి యాచకుడు నిర్ధారించుకుని పంచాయతీకి అప్పగించారు. దుత్తలూరులో.. దుత్తలూరు: దుత్తలూరుకు చెందిన గోబిదేశి సుబ్బమ్మ(73) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి భారీ వర్షానికి తోడు చలిగాలులు వీయడంతో అస్వస్థతకు గురై మృతి చెందింది. బాలాయపల్లిలో.. బాలాయపల్లి : మండలంలోని అంబలపూడికి చెందిన పెరిమిడి పోలయ్య(65), నిండలి గ్రామానికి చెందిన బట్టేపాటి చెంగయ్య(45) మంగళవారం తెల్లవారు జామున చలిగాలకు మృతి చెందారు. చెంగయ్య కిడ్నీ వ్యాధితో బాధపతున్నాడు. పోలయ్య నెల రోజులు నుంచి మంచంలో ఉన్నాడు. పింఛను వస్తుందని ఎదురు చూశాడు. ఈ నెల పింఛను బ్యాంకులకు ప్రభుత్వం మార్చింది. పింఛను తీసుకోకుండానే మృతి చెందాడు. మల్లాంలో.. చిట్టమూరు : మండలంలోని మల్లాం దళితవాడకు చెందిన వృద్ధురాలు కావలి చెంగమ్మ(80) చలిగాలులకు మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. -
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి
-
ఆదిలాబాద్ @ 6 డిగ్రీలు
- రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి - మెదక్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు - నేడు రేపు చలి తీవ్రత.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం చలితో గజగజలాడుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అక్కడ పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మెదక్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో 12 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
వణికిస్తున్న చలిగాలులు