Fog: విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై నిలిచిన వాహనాలు | Severe Cold Wave In Telangana & Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పొగ మంచు ఎఫెక్ట్‌.. వాహనాల రాకపోకలకు బ్రేక్‌

Published Mon, Dec 25 2023 10:11 AM | Last Updated on Mon, Dec 25 2023 3:47 PM

Severe Cold Wave In Telangana Andhra pradesh - Sakshi

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయాన్నే నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు  ఇబ్బందులు పడుతున్నారు. 

పొగమంచు కారణంగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద భారీ పొగమంచు వల్ల వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. చెన్నై-కలకత్తా హైవేపై కూడా కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయాయి.  ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌తో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లితో పాటు పలు చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. 

ఇదీచదవండి..ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement