చలిగాలులకు ఏడుగురి మృతి
వర్దా తుపాన్ నేపథ్యంలో పెరిగిన చలి తీవ్రతకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందాడు.వెంకటాచలం : తుపాను వల్ల చలిగాలులు వీచడంతో వెంకటాచలం మండలంలో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ యర్రగుంటకు చెందిన చెంబేటి చెంచయ్య (60) , నిడిగుంటపాళెం పంచాయతి చవటదళితవాడకు చెందిన చెంతాటి పోతయ్యకు(62) చలిగాలలకు తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోలను పంపి వివరాలు నమోదు చేయించారు.కాకుటూరులో యాచకుడుమండలంలోని కాకుటూరులో చలిగాలులకు తట్టుకోలేక యాచకుడు(70) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి యాచకుడు నిర్ధారించుకుని పంచాయతీకి అప్పగించారు.దుత్తలూరులో..దుత్తలూరు: దుత్తలూరుకు చెందిన గోబిదేశి సుబ్బమ్మ(73) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి భారీ వర్షానికి తోడు చలిగాలులు వీయడంతో అస్వస్థతకు గురై మృతి చెందింది.బాలాయపల్లిలో..బాలాయపల్లి : మండలంలోని అంబలపూడికి చెందిన పెరిమిడి పోలయ్య(65), నిండలి గ్రామానికి చెందిన బట్టేపాటి చెంగయ్య(45) మంగళవారం తెల్లవారు జామున చలిగాలకు మృతి చెందారు. చెంగయ్య కిడ్నీ వ్యాధితో బాధపతున్నాడు. పోలయ్య నెల రోజులు నుంచి మంచంలో ఉన్నాడు. పింఛను వస్తుందని ఎదురు చూశాడు. ఈ నెల పింఛను బ్యాంకులకు ప్రభుత్వం మార్చింది. పింఛను తీసుకోకుండానే మృతి చెందాడు.మల్లాంలో..చిట్టమూరు : మండలంలోని మల్లాం దళితవాడకు చెందిన వృద్ధురాలు కావలి చెంగమ్మ(80) చలిగాలులకు మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు.