Seven killed
-
ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. మంటలను గమనించిన స్థానికులు, షహీద్ సేవా దళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. -
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
-
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
‘నిమజ్జనం’లో ఏడుగురు బాలికలు మృత్యువాత
లతేహార్: పండుగ వేళ ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ‘కరం దాలి’ నిమజ్జనానికి చెరువులోకి దిగిన ఏడుగురు బాలికలు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బక్రు గ్రామంలో శనివారం జరిగింది. జార్ఖండ్ ముఖ్య పండుగల్లో ఒకటైన కర్మపూజ సందర్భంగా 10 మంది బాలికలు చెరువు వద్దకు వెళ్లారు. కదంబ కొమ్మ(కరం దాలి)ను నిమజ్జనం చేసే సమయంలో ఒక బాలిక నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో ఈతరాని మిగతా బాలికలు ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. వారి కేకలు విని గ్రామస్తులు పరుగెత్తుకుని వచ్చి అందరినీ వెలికితీశారు. వారిలో అప్పటికే నలుగురు చనిపోగా బాలూమఠ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. బాధితులంతా స్థానిక స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న 12 నుంచి 20 ఏళ్లలోపు వారే. ఘటనకు నిరసనగా స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు అధికారులు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. -
ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి
లండన్: యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు కనిపించలేదు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
హ్యూస్టన్: అమెరికాలోని మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారన్న కోపంతో ఓ వ్యక్తి శనివారం మధ్యాహ్నం తన చుట్టూ ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఏడుగురు మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి. ఒడెస్సా.. మిడ్‌ల్యాండ్ ప్రాంతాల్లో జరిగిన ఈ సంఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చివేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తికి సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందని.. కారులో వెళుతున్న అతడిని మధ్యాహ్నం 3 గంటలు (స్థానిక కాలమానం) సమయంలో రోడ్డు పక్కన నిలపాల్సిందిగా పోలీసు అధికారి కోరారని... దీంతో అతడు కాల్పులకు దిగాడని ఒడెస్సా పోలీస్ ఉన్నతాధికారి మైఖేల్ గెర్కే తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన దుండగుడు పోస్టల్ విభాగానికి చెందిన కారును హైజాక్ చేయగా.. వెంటాడి కాల్చేసినట్లు ఆయన చెప్పారు. అటార్నీ జనరల్ విలియం బార్ సంఘటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివరించినట్లు సమాచారం. కాల్పుల సంఘటనపై విచారణకు ఎఫ్‌బీఐ, ఇతర ఏజెన్సీలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు విలియం బార్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ సంఘటనను మతిలేని పిరికిపంద చర్యగా అభివర్ణించగా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటన చేశారు. నెల రోజుల క్రితమే పశ్చిమ టెక్సస్ నగరాల్లో వారం వ్యవధిలో రెండు కాల్పుల సంఘటనలు చోటు చేసుకోవడం.. ఇందులో సుమారు 22 మంది మరణించడం ఇక్కడ ప్రస్తావనార్హం. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిని మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీసులు అధికారి మెల్విన్ దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. తమిళనాడు యాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. -
గుడిలో తొక్కిసలాట
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. వండితురై కరుప్పుస్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే అన్నది భక్తుల నమ్మకం. ఆదివారం పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు. పూజల అనంతరం పిడి కాసుల కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38), పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నమ్మక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్న పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. దైవదర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల వాహనంను ఓ ట్యాంకరు ఢీకొట్టింది. మరణించిన వారందరు షోలాపూర్‌లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మరణించిన వారిని చిలువేరి రజనీ (35), చిలువేరి అపర్ణ (13), ఆడం వర్ష (12), శివకుమార్ పోబత్తి (40), నర్మదా పోబత్తి (35), నేతాజీ పోబత్తి (12), శ్రద్ద పోబత్తి (4), ఆడం లింగరాజ్ (12)లుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘాట్ ప్రాంతంలో శింథపులే గ్రామం వద్ద సోమవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటచేసుకుంది. షోలాపూర్ గోదుతాయి పెరుళేకర్ గృహ సముదాయంలో నివసించే గడ్డం, చిలువేరి, ఖ్యాతం, పోబత్తి కుటుంబాలు ఓమినీ కారు అద్దెకు తీసుకుని తుల్జాపూర్ దైవదర్శనానికి బయలుదేరారు. తుల్జాపూర్ ఘాట్‌లో శింథపలే గ్రామం వద్ద ఓ ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఓమినీ కారు నుజ్జు నుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఢిల్లీలో భవంతి కూలి ఏడుగురి దుర్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్‌లో బుధవారం ఐదంతస్తుల భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ భవంతిని గత నెల 16న పరిశీలించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణం ఉండగా, మొదటి అంతస్తు ఖాళీగా ఉంది. 2, 3, 4 అంతస్తుల్లో కుటుంబాలు నివాసముంటున్నాయి. -
గుంటూరు జిల్లాలో వర్షబీభత్సం, ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. సీతారపు మాధవి(35), కొండేపాటి వెంకట్రావు(50) పొలంలోని మిర్చి కల్లంలో పట్టలు కప్పుతుండగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఉరుముల శబ్దానికి తాడికొండ మండలంలో కశమ్ కుమారి(55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో పొలం నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపడి వేజెండ్ల రత్నకుమారి(40) చనిపోయారు. సత్తెనపల్లి మండలం, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి(26) పిడుగుపాటుకు మృతి. రాజుపాలెం గ్రామంలో గేదెల కాపరి జె.గోపి అనే పిల్లవాడిపై పిడుగు పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గంవ్యాప్తంగా ఈదురు గాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు పసుపులేటి శ్రీనివాసరావు, తోట అంకమ్మరావులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరి నియోజకవర్గంలో 450 ఎకరాల్లో అరటి పంట నేల కూలి 4.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో నీట మునిగిన మొక్కజొన్న 2కోట్ల మేర ఆస్తి నష్టం. మిర్చి యార్డులో సుమారు 1.50 మిర్చి బస్తాలు నీట మునిగాయి. -
కారును ఢీకొన్న బస్సు: ఏడుగురు మృతి
-
అతివేగం మింగేసింది
♦ మూడు కార్లు ఢీ ♦ ఏడుగురు మృతి ♦ మరో ఏడుగురి పరిస్థితి విషమం ♦ జాతీయ రహదారిపై ఘోరం అతి వేగం జాతీయ రహదారిని రక్తసిక్తం చేసింది. మోటారు సైకిలిస్టును తప్పించే క్రమంలో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో ఏడుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వేలూరు సమీపంలోని రత్నగిరి వద్ద ఆదివారం మూడు గంటల సమయంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు లగ్జరీ కార్లు ధ్వంసం అయ్యాయి.కార్లలో ఉన్న ఆరుగురు, మోటారు సైక్లిస్టు మరణించారు. మృతుల్లో బెంగళూరుకు చెందిన గోవిందరాజ్, కాంచీపురానికి చెందిన జ్ఞానరాజ్, రత్నగిరికి చెందిన మోటార్ సైక్లిస్టు రవికుమార్‌ను గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఏడుగురు బెంగళూరు వాసులే. సాక్షి, చెన్నై: అతివేగంగా దూసుకొచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి రత్నగిరి వద్ద చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చెన్నై–బెంగళూరు జాతీయరహదారి రత్నగిరి వద్ద ముందు వెళుతున్న బైక్‌ను తప్పించేందుకు వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ కారు వెనుక మరింత వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ వాహనాలు ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఢీకొన్నాయి. ముందుగా రెండు లగ్జరీ కార్లు, తదుపరి ఓ చిన్న కారు, చివర్లో లారీ ఢీకొట్టుకోవడంతో అప్పటికే జరగాల్సింత నష్టం జరిగిపోయింది. మోటారు సైకిలిస్టు గాల్లో ఎగిరిపడ్డాడు. లగ్జరీ కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అందులో ఉన్న వాళ్లు రక్త గాయాలతో కొట్టుమిట్టాడుతుండడంతో రత్నగిరి వాసులు పరుగులు తీశారు. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. సంఘటన స్థలంలోనే లగ్జరీ కార్లలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మోటారు సైక్లిస్టు మరణించాడు. లగ్జరీ కార్లలో ఉన్న మరో ఇద్దరు కూడా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. అడుకం పట్టి ఆస్పత్రిలో నలుగురు, వేలూరు సీఎంసీలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. లగ్జరీ కార్లలో ఉన్న వాళ్లులో ఎక్కువమంది బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. రెండు లగ్జరీ కార్లు కర్ణాటక రిజిస్ట్రేషన్లతో ఉండడంతో వాహన నంబర్లు, ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో రెండు గంటల పాటుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మోటారు సైకిలిస్టు రత్నగిరికి చెందిన రవిగా గుర్తించారు. అలాగే, మృతుల్లో ఒకరు బెంగళూరుకు చెందిన గోవిందరాజన్, కాంచీపురానికి చెందిన జ్ఞానరాజ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో గీతన్, ఇషాంత్, శరవణ కుమార్, ప్రమీద్, రూపాశ్రీ, గాయత్రి, మోహన్ ఉన్నారు. వీరంతా బెంగళూరుకు చెందిన వారే. మిగతా మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ఏడుగురు మృతిచెందారు. చివ్వెంల మండలంలో నలుగురు, భువనగిరిలో ఒకరు.. హాలియాలో ఒకరు, గుర్రంపోడు మండలంలో మరొకరు మృతిచెందగా .. పలువురు గాయపడ్డారు... చివ్వెంల(సూర్యాపేట): అప్పటి ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆనందంగా గడిపిన వారిని ఆగిఉన్న లారీ మృత్యువు రూపంలో కభళించింది. చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆగిఉన్న లారీని కారు వెనుకనుంచి ఢీ కొనడంతో ముగ్గురు దుర్మణం పాలై మరొకరు మృత్యువుతో పోరుడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండపాలెం ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్(26), అతని బావమరిది పాత గుంటూరుకు చెందిన తొర్రసాయి కోటేష్(24), కోటేష్ బావమరిది తెనాలి మండలం పినుపాలెం గ్రామానికి చెందిన మైలా పూర్ణచందర్రావు(21)తోపాటు పాత గుంటూరుకు చెందిన దాది సాయిభార్గవ్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్ చూసి తిరిగి కారులో వస్తుండగా.. చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామ శివారులో హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతిచెం దాడు. కోటేష్, పూర్ణచందర్, సాయిభార్గవ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి కోటేష్, పూర్ణచందర్ మృతి చెందారు. సాయిభార్గవ్ పరిస్థితి కూడా ఉందని వైద్యులు తెలిపారు. కాగా వీరిలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్నట్లు బంధువులు తెలిపారు. కోటేష్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. శ్రీకాంత్‌కు భార్య, కూతురు ఉన్నారు. పూర్ణచందర్ బీటెక్ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్ఐ బి.ప్రవీన్‌కుమార్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కోటేష్ తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కారు ఢీకొని మహిళ.. భువనగిరిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జమ్మాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మాపురం గ్రామానికి చెందిన గంగారపు ఆరోగ్యజ్యోతి(38), ఆమె అన్న కుమార్తె మేరిస్టేల్లాతో కలిసి స్కూటీ బస్‌షెల్టర్‌కు సమీపంలో ఉన్న తమ మామిడి తోటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో వీరి బైకును హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇరువురు రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆరోగ్యజ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. మేరిస్టేల్లాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరిలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యజ్యోతి అన్న గంగారపు మల్లయ్య రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. లారీ ఢీకొని ఒకరు.. గుర్రంపోడు(నాగార్జునసాగర్): బైక్‌ను లారీ ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ జి.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం ఎం.గౌరారం గ్రామానికి చెందిన మాడ్గుల కమలాకర్(24) పీఏపల్లి మండలకేంద్రానికి తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పాల్వాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కమలాకర్ తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీని తప్పించబోయి కానిస్టేబుల్.. చివ్వెంల(సూర్యాపేట): రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కుడకుడ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పబ్బతి శ్రీనాథ్(43) ఆదివారం విధులు ముగించుకుని ఆయన స్వగ్రామం నూతన్‌కల్‌కు బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలో మండల పరిధిలోని కుడకుడ గ్రామ శివారులో దంతాలపల్లి–సూర్యాపేట రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి.. కిండపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ పరిమళహన నూతన్, డీఎస్పీ సునీతామోహన్, సీఐ మొగిలయ్య, ఎస్ఐ బి.ప్రవీన్‌కుమార్ సందర్శించారు. శ్రీనాథ్‌కు భార్య మాధవి, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢీకొని ఒకరు.. హాలియా(నాగార్జునసాగర్): ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మదారిగూడెం గ్రామానికి చెందిన మద్దెల సైదులు(30) ఆదివారం పెద్దవూర మండలం తమ్మడపల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లి రాత్రి బైక్‌పై తిరిగి హాలియాకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఈశ్వర్‌నగర్ వద్ద బైక్ రాయిని ఎక్కి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న దేవరకొండ డిపోకు చెందిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు భార్య శ్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. సైదులుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
పిట్టల్లా రాలిపోతున్నారు..
►వడదెబ్బకు జిల్లాలో ఒకే రోజు ఏడుగురు మృతి ►బెంబేలెత్తిస్తున్న ఎండలు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. భానుడు తన ఉగ్రరూపం చూపిస్తుంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వణికిపోతున్నారు. ఒక్క సోమవారం రోజునే ఎండలకు తాళలేక ఏడుగురు మరణించారు. నెల్లిమర్లలో ముగ్గురు, సాలూరులో ఒకరు, వేపాడలో ఒకరు, చీపురుపల్లిలో ఇద్దరు వడదెబ్బ బారిన పడి మరణించిన వారిలో ఉన్నారు వేపాడ (ఎస్‌కోట) : వేపాడ మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన దాసరి సత్యం (76) అనే వ్యక్తి ఆదివారం రాత్రి వడదెబ్బ బారిన పడి మరణించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు కమిటీ సభ్యులకు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నిర్ధారించారు. డీటీ కె ప్రసాదరావు, వైద్య, పోలీస్ శాఖాధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని వివరాలు వెల్లడించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో ముగ్గురు.. నెల్లిమర్ల : ఎండదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎండ తీవ్రతకు తట్టుకోలేక నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణంలో నగర పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు చనిపోగా, జరజాపుపేటలో మరో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జలగడుగుల సత్తియ్య (55) రోజులాగే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. కానీ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. అస్వస్థతగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు. జరజాపుపేటకు చెందిన సూరి ముత్యాలమ్మ (60), గంటా పెంటయ్య (63) కూడా ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇళ్లల్లోనే మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణానికి చెందిన నక్కాన వెంటకరావు (43) అనే వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందారు. మొత్తంగా ఈ వేసవిలో వడదెబ్బ బారిన పడి నెల్లిమర్ల నగర పంచాయతీ, మండల వ్యాప్తంగా 45 మంది మరణించారు. అధికారులు మాత్రం ఇద్దరినో, ముగ్గురినో మాత్రమే వడదెబ్బ మృతులుగా గుర్తించారు. సమాచారం అందించినా రెవెన్యూ అధికారులు రావడం లేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బహర్భూమికని వెళ్లి.. సాలూరు : సాలూరు మండలం ఇద్దనవలస గ్రామానికి చెందిన దమరసింగు అప్పలస్వామి ( 65) సోమవారం ఉదయం గ్రామం సమీపంలో ఉన్న చెరువుకి బహిర్భూమికి వెళ్లి అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ముందురోజు బాగా ఎండలో పని చేసిన ఆయన ఉదయం లేచిన తర్వాత హఠాత్తుగా కుప్పకూలినట్లు భార్య సీతమ్మ, ఆయన ముగ్గురు కుమారులు పేర్కొన్నారు. ఇద్దరు మహిళల మృతి చీపురుపల్లి రూరల్/చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలో సోమవారం ఎండ దాటికి తాళలేక ఇద్దరు మహిళలు మృతి చెందారు. మండలంలోని అలజంగి పంచాయతీ పరధిలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవల్ల సత్యవతి (36) వడదెబ్బతో మరణించారు. దివ్యాంగురాలైన సత్యవతి ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చిన వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చీపురుపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిటాల పుష్పలత (43) అనే మహిళ ఎండకు తట్టుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంతవరకు బాగానే ఉన్న పుష్పలత మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటిలోనే కుప్ప కూలిపోగా, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎండకు తట్టుకోలేక.. వేపాడ (ఎస్‌కోట) : వేపాడ మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన దాసరి సత్యం (76) అనే వ్యక్తి ఆదివారం రాత్రి వడదెబ్బ బారిన పడి మరణించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు కమిటీ సభ్యులకు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నిర్ధారించారు. డీటీ కె ప్రసాదరావు, వైద్య, పోలీస్ శాఖాధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని వివరాలు వెల్లడించారు. ఇద్దరు మహిళల మృతి చీపురుపల్లి రూరల్/చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలో సోమవారం ఎండ దాటికి తాళలేక ఇద్దరు మహిళలు మృతి చెందారు. మండలంలోని అలజంగి పంచాయతీ పరధిలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవల్ల సత్యవతి (36) వడదెబ్బతో మరణించారు. దివ్యాంగురాలైన సత్యవతి ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చిన వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చీపురుపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిటాల పుష్పలత (43) అనే మహిళ ఎండకు తట్టుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంతవరకు బాగానే ఉన్న పుష్పలత మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటిలోనే కుప్ప కూలిపోగా, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
చివ్వెంల(సూర్యాపేట): అప్పటి ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆనందంగా గడిపిన వారిని ఆగిఉన్న లారీ మృత్యువు రూపంలో కభళించింది. చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆగిఉన్న లారీని కారు వెనుకనుంచి ఢీ కొనడంతో ముగ్గురు దుర్మణం పాలై మరొకరు మృత్యువుతో పోరుడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండపాలెం ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్(26), అతని బావమరిది పాత గుంటూరుకు చెందిన తొర్రసాయి కోటేష్(24), కోటేష్ బావమరిది తెనాలి మండలం పినుపాలెం గ్రామానికి చెందిన మైలా పూర్ణచందర్రావు(21)తోపాటు పాత గుంటూరుకు చెందిన దాది సాయిభార్గవ్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్ చూసి తిరిగి కారులో వస్తుండగా.. చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామ శివారులో హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతిచెం దాడు. కోటేష్, పూర్ణచందర్, సాయిభార్గవ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి కోటేష్, పూర్ణచందర్ మృతి చెందారు. సాయిభార్గవ్ పరిస్థితి కూడా ఉందని వైద్యులు తెలిపారు. కాగా వీరిలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్నట్లు బంధువులు తెలిపారు. కోటేష్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. శ్రీకాంత్‌కు భార్య, కూతురు ఉన్నారు. పూర్ణచందర్ బీటెక్ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్ఐ బి.ప్రవీన్‌కుమార్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కోటేష్ తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కారు ఢీకొని మహిళ.. భువనగిరిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జమ్మాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మాపురం గ్రామానికి చెందిన గంగారపు ఆరోగ్యజ్యోతి(38), ఆమె అన్న కుమార్తె మేరిస్టేల్లాతో కలిసి స్కూటీ బస్‌షెల్టర్‌కు సమీపంలో ఉన్న తమ మామిడి తోటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో వీరి బైకును హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇరువురు రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆరోగ్యజ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. మేరిస్టేల్లాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరిలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యజ్యోతి అన్న గంగారపు మల్లయ్య రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. లారీ ఢీకొని ఒకరు.. గుర్రంపోడు(నాగార్జునసాగర్): బైక్‌ను లారీ ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ జి.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం ఎం.గౌరారం గ్రామానికి చెందిన మాడ్గుల కమలాకర్(24) పీఏపల్లి మండలకేంద్రానికి తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పాల్వాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కమలాకర్ తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చలిగాలులకు ఏడుగురి మృతి
వర్దా తుపాన్ నేపథ్యంలో పెరిగిన చలి తీవ్రతకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందాడు. వెంకటాచలం : తుపాను వల్ల చలిగాలులు వీచడంతో వెంకటాచలం మండలంలో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ యర్రగుంటకు చెందిన చెంబేటి చెంచయ్య (60) , నిడిగుంటపాళెం పంచాయతి చవటదళితవాడకు చెందిన చెంతాటి పోతయ్యకు(62) చలిగాలలకు తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోలను పంపి వివరాలు నమోదు చేయించారు. కాకుటూరులో యాచకుడు మండలంలోని కాకుటూరులో చలిగాలులకు తట్టుకోలేక యాచకుడు(70) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి యాచకుడు నిర్ధారించుకుని పంచాయతీకి అప్పగించారు. దుత్తలూరులో.. దుత్తలూరు: దుత్తలూరుకు చెందిన గోబిదేశి సుబ్బమ్మ(73) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి భారీ వర్షానికి తోడు చలిగాలులు వీయడంతో అస్వస్థతకు గురై మృతి చెందింది. బాలాయపల్లిలో.. బాలాయపల్లి : మండలంలోని అంబలపూడికి చెందిన పెరిమిడి పోలయ్య(65), నిండలి గ్రామానికి చెందిన బట్టేపాటి చెంగయ్య(45) మంగళవారం తెల్లవారు జామున చలిగాలకు మృతి చెందారు. చెంగయ్య కిడ్నీ వ్యాధితో బాధపతున్నాడు. పోలయ్య నెల రోజులు నుంచి మంచంలో ఉన్నాడు. పింఛను వస్తుందని ఎదురు చూశాడు. ఈ నెల పింఛను బ్యాంకులకు ప్రభుత్వం మార్చింది. పింఛను తీసుకోకుండానే మృతి చెందాడు. మల్లాంలో.. చిట్టమూరు : మండలంలోని మల్లాం దళితవాడకు చెందిన వృద్ధురాలు కావలి చెంగమ్మ(80) చలిగాలులకు మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. -
ఇసుక లారీ, బస్సు ఢీ: ఏడుగురు మృతి
కోయంబత్తూరు(తమిళనాడు): కోయంబత్తూరులోని తోప్పూర్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ, బస్సు ఢీ కొన్న సంఘటనలో ఏడుగురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. ధర్మపురి వైపు వెళ్తున్న ఇసుక లారీ, అదే దారిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును తోపూర్లోని జాతీయ రహదారి మలుపు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దాటికి రహదారిపై ట్రాఫిక్‌కు గంటపాటూ అంతరాయం ఏర్పడింది. -
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
-
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం మళ్లీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నగర శివారులోని పలు కాలనీలు ఇప్పటికే జలమయమైనాయి. దీంతో శివారు ప్రాంతానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం వరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా... మరొకరు గల్లంతయ్యారు. అలాగే జిల్లాలోని రైల్వే ట్రాక్ ఏడు చోట్ల దెబ్బతింది. దీంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గుంటూరు - సికింద్రాబాద్ మధ్య రెండో రోజు కూడా రైళ్లు నడవని పరిస్థితి ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు మరమ్మతులు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగింది. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 66 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఓ వేళ వరద పోటెత్తితే రంగంలోకి దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని వర్షాలు, వరదల పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని కాకుమాను మండలం కొండపాటూరులో నల్లమడ వాగుకు గండి పడింది. గరికపాడు సమీపంలో కొమ్మమూరు కెనాల్‌కు గండి పడింది. దీంతో పంట పొలాల్లొకి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా : జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు కుంటలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజానగరం చెరువుకు గండిపడింది. కృష్ణా జిల్లా : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 70 గేట్లు ఎత్తి లక్షా 32 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా నందిగామ, వీరులపాడు, వత్సవాయి మండలాల్లో పొన్నేరు, కట్టలేరు, వైరా ఏరు ఉధృతిగా ప్రవహిస్తుంది. వీరులపాడు కూడలి వద్ద కాజ్వే పైకి భారీగా నీరు వచ్చి చేరింది. 25 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో వేగవతి, సువర్ణముఖి నదులకు వరద పోటెత్తింది. దీంతో మద్దివలస రిజర్వాయర్‌కు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తివేసి.. నీటికి దిగువకు విడుదల చేశారు. -
ఏపీలో వాన బీభత్సం..
-
ఏపీలో వాన బీభత్సం..
పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఏడుగురి మృతి సాక్షి నెట్వర్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. చెరువులు, కాలువలు నిండుకుండల్లా తయారయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెరువులు తెగి గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. భారీ పంట నష్టం జరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీలో రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. రోడ్డు, రైలు మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. వర్షబీభత్సానికి హైవేలపై భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్-గుంటూరు మార్గంలో అద్దంకి-నార్కట్‌పల్లి, రాజమండ్రి-విశాఖ హైవేలపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తూర్పుగోదావరి, విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రోడ్లు దెబ్బతిని, రాకపోకలు బంద్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచే వరద నీరు రోడ్లపైకి చేరడంతో అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా నకరేకల్లు మండలంలో అత్యధికంగా 24.14 సెం.మీ. వర్షం కురిసింది. పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు వరదల బారిన పడిన బాధితుల్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు. -
మధ్యప్రదేశ్‌లో ఇల్లు కూలి ఏడుగురు మృతి
-
యూపీలో ఘర్షణ.. 22 మంది మృతి
* మృతుల్లో ఎస్పీ స్థాయి అధికారి సహా ఇద్దరు పోలీసులు * అక్రమ కట్టడాల కూల్చివేత హింసాత్మకం మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ ఎస్పీస్థాయి అధికారితోపాటు మొత్తం 22 మంది మృతిచెందారు. 50 మందికి పైగా ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మధురలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం మథురలోని జవహార్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా ఆందోళనకారులు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఐజీ శర్మ తెలిపారు. ఈ ఆందోళనకారులంతా.. ‘ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 3 వేల మంది అక్రమ నిర్మాణదారులు పోలీసులపైకి రాళ్లు విసిరేశారని, అనంతరం కాల్పులు జరిపారని తెలిపారు. రెండేళ్ల క్రితం బాబా జై గురుదేవ్ వర్గం నుంచి విడిపోయిన మరో వర్గానికి చెందిన వారు వందలాది ఎకరాలను ఆక్రమించారు. కాగా ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. -
ఆ బార్ నాది కాదు: మల్లాది విష్ణు
-
ఆ బార్ నాది కాదు: మల్లాది విష్ణు
కల్తీమద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన బార్ తనది కాదని, తన బంధువులదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ ఘటన వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వాటర్ కూలర్లో ఎవరో ఏదో కలిపారని అనుమానం ఉందని, ఆ నీళ్లు కలుపుకొని మద్యం తాగినవాళ్లే అస్వస్థతకు గురయ్యారని విష్ణు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ బార్‌ను సీజ్ చేశామని, మద్యం ఎక్కడినుంచి వచ్చిందో విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అంతకుముందు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
హెలీకాప్టర్ కూలి ఏడుగురు మృతి
కశ్మీర్లో ఘటన మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన పైలట్ సుమిత జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా కట్రా వద్ద హెలీకాప్టర్ కూలి ఆరుగురు యాత్రికులు, హైదరాబాద్‌కు చెందిన మహిళా పైలట్ సుమిత విజయన్ మృతిచెందారు. హిమాలయన్ హెలీకి చెందిన హెలీకాప్టర్.. త్రికూట హిల్స్‌లోని సంజిచాట్ హెలీప్యాడ్ నుంచి వైష్ణోదేవీ ఆలయానికి యాత్రికులను తీసుకుని వస్తుండగా కత్రా కొత్త బస్టాండ్ వద్ద ప్రమాదం జరిగిందని జమ్మూ ఐజీపీ దినేశ్ రాణా తెలిపారు. ఆలయం వద్దకు వస్తున్నప్పుడు చాపర్‌కు పక్షి తగిలి మంటలు చెలరేగాయి. దీంతో చాపర్‌ను బస్టాండ్ వద్ద లాండ్ చేయడానికి యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట కూడా మృతిచెందింది. మృతులు అర్జున్ సింగ్, మహేశ్, వందన జమ్మూకు చెందిన వారు కాగా.. సచిన్, అక్షిత(5), అర్యన్జీత్ ఢిల్లీ నివాసులు. యాత్రికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉందని, అలాగే ఆలయ బోర్డు రూ.3లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి నట్లు వైష్ణోదేవి ఆలయ బోర్డు అదనపు సీఈవో అజిత్ కుమార్ తెలిపారు. కాగా, ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. వైష్ణోదేవీ ఆలయం వద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. -
హెలీకాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
వెల్లింగ్టన్: హెలీకాఫ్టర్ కూలిన ఘటనలో 7 మందికి పైగా వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన న్యూజీలాండ్ ఫాక్స్ లోయలో శనివారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హెలీకాఫ్టర్ కూలిన ఘటనలో పైలట్, ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారని తెలిపారు. లోయ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో రక్షణ బృందాలు అక్కడికి చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ఫాక్స్- ఫ్రాంజ్ హెలీకాఫ్టర్ వైజ్ఞానిక పనులకు సంబంధించినదని ఓ ఆపరేటర్ ఆల్ఫైన్ వెల్లడించాడు. మృతదేహాలను వెలికితీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హెలీకాఫ్టర్ క్రాష్ అవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతి
ఒడిశా : ఒడిశాలోని గంజాం జిల్లా గోలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. రండా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలి పరారైయ్యాడు. మృతులంతా దినసరి కూలీలనీ పోలీసులు చెప్పారు. మృతుల్లో ఇద్దరు కూలీలు శ్రీకాకుళం జిల్లా వాసులని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే కొండచరియల ప్రమాదంలో 14 మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. వరణుడి దెబ్బకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వడదెబ్బతో ఏడుగురు మృతి
యాడికి /కొత్తచెరువు/ ధర్మవరం రూరల్/ ముదిగుబ్బ : జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆది,సోమవారాల్లో మరో ఏడుగురు మృతిచెందారు. యాడికి, కొత్తచెరువు, ధర్మవరం, ముదిగుబ్బ, పుట్లూరు, యల్లనూరు, పెద్దవడుగూరు మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. యాడికి మండలం రామరాజుపల్లికి చెందిన ముప్పగౌని మలిశెట్టి (65) తన బావమరిది కుమారుడి వివాహానికి ముహూర్తం కట్టుకోవడం కోసం ఆదివారం కూడేరుకు వెళ్లాడు. సాయంత్రం అక్కడే ఎండ తీవ్రత వల్ల వాంతులు, విరేచనాలయ్యాయి. స్థానికంగా ఉన్న వైద్యుడితో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి కూడేరులోనే మృతి చెందాడు. మృతదేహాన్నిసోమవారం రామరాజుపల్లికి తీసుకొచ్చారు. మలిశెట్టికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొత్తచెరువు మండలం నారప్పగారిపల్లికి చెందిన హరిజన గెంగన్న (68) గొర్రెల కాపరి. ఆదివారం గొర్రెలను మేతకు తోలుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. నీరసంగా ఉందని చెప్పి పడుకున్నాడు. రాత్రి నిద్రలోనే చనిపోయాడు. ఇతని మృతిపై సోమవారం తహశీల్దార్ మోహన్‌దాస్, వైద్యులు విచారణ చేశారు. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో సోమవారం గొర్రెల కాపరి కురుబ గంగన్న(60) వడదెబ్బతో మృతిచెందాడు. మేత కోసం గొర్రెలను తోలుకెళ్లాడు. ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామానికి చెందిన రైతు గంగరాజు (60) రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. పాడి పశువులను కూడా జీవనాధారంగా పెట్టుకున్నాడు. వీటి కోసం గడ్డి కోసేందుకు సోమవారం ఉదయం పొలంలోకి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరే చనాలు అధికమయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తహశీల్దార్ పీవీ రమణ, డాక్టర్ క్రిష్ణయ్య మృతుడి వివరాలు సేకరించారు. పుట్లూరు మండలంలోని బాలాపురం గ్రామానికి చెందిన చెరుకూరి తిరుపాలు(60) సోమవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం తోట వద్దకు వెళ్లాడు. ఎండ వేడిమి ఎక్కవ కావడంతో ఇంటికి తిరిగొచ్చాడు. తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి ఇంటిలోనే మృతి చెందాడు. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన రామగౌని సంజమ్మ(65) ఆదివారం వ్యవసాయ కూలి పనులకు వెళ్లింది. వడదెబ్బకు గురైంది. రాత్రి నుంచి విరేచనాలు అధికమయ్యాయి. సోమవారం పరిస్థి తి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. యల్లనూరులో సోమవారం చెంచులప్ప (45) అనే వ్యక్తి వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను కట్టెల కోసమని వెళ్లి సొమ్మసిల్లి పడిపోయాడు. వాంతులు, విరేచనాలు అధికమవడంతో అక్కడున్న కొందరు గమనించి పులివెందులకు తీసుకెళుతుం డగా మార్గమధ్యంలో మరణించాడు. -
10 ఏళ్ల చిన్నారి ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి
అబూజా: 10 ఏళ్ల చిన్నారి జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం నైజిరీయా ఉత్తర ప్రాంతంలోని యోబ్ రాజధాని దమతురులో ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని... వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఆత్మాహుతి దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. జన సమర్థం అధికంగా ఉండే బస్టాండ్ లోకి ప్రవేశించిన చిన్నారి తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
జలసమాధి
చెరువులో మునిగి ఏడుగురు మృతి మృతుల్లో నలుగురు యువతులు.. వీరంతా హైదరాబాద్‌వాసులు చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలో ఘటన ఆమనగల్లు: సరదా వారి పాలిట శాపంగా మారింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చెరువులోకి దిగిన ఏడుగురు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈతరాక పోవడంతో వారు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన వారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు.. ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్‌జుబేల్ కాలనీలో అహ్మద్‌బేగ్ కుటుంబానికి చెందిన 13 మంది టవేరా వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో తమ సమీప బంధువుల ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో స్నానాల కోసం వీరంతా దగ్గరలో ఉన్న చరికొండ గౌరమ్మ చెరువుకు చేరుకున్నారు. ముందుగా ముస్కాన్ (18) చెరువులోకి దిగింది. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె మునిగి పోయింది. దీంతో పక్కనే ఉన్న సల్మాన్ (30), రెహమాన్ (19), షేక్ బాసిత్(30), రొఖియా బేగం(28), మస్రత్ ఫాతిమా(19), మౌనాబేగం(18) కూడా చెరువులోకి దిగి ముస్కాన్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే పట్టు దొరకక వారు కూడా చెరువులో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే వారంతా ప్రాణాలు వదిలారు. మృతుల్లో సల్మాన్, రెహమాన్, మౌనబేగం, రుకియా బేగం, బాసిత్లు ఒకే కుటుంబానికి చెందిన వారు. సంఘటన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి తదితరులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేగ్ కుటుంబంలో విషాదం బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు గాను చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు ఒక పెద్ద కుమార్తె మాత్రమే మిగిలింది. బేగ్ భార్య మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె హైదరాబాద్‌కు రానుంది. కాగా ఆరు నెలల క్రితమే అస్మాతో బాసిత్ వివాహం జరిగింది. ప్రస్తుతం అస్మా గర్భణి కూడా. తన తండ్రే మళ్లీ పుడతాడని స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్న బాసిత్ అంతలోనే చెరువులో పడి మృతి చెందడం తలచుకొని బంధువులు, స్నేహితులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక మోనా సుల్తానాకు సల్మాన్‌తో నాలుగైదు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి ఏడుగురు వ్యక్తులు మరణించిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం బాధాకరమని, వేసవి సెలవులలో పిల్లల విహారాలు, సరదాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కె.చంద్రశేఖర్ రావు సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
టవేరా-ఇన్నోవా ఢీ,ఏడుగురు మృతి
-
కూలిన విమానం: ఏడుగురు మృతి
బొగోటా: కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కొలంబియా ఈశాన్య రాష్ట్రమైన బుకారమంగ నుంచి విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ పౌర విమానయాన భద్రత కార్యదర్శి వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు మగవారు ఉన్నారని చెప్పారు. విమాన శకలాలను పర్వత ప్రాంతంలో కనుగొన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పౌర విమానయాన భద్రత కార్యదర్శి తెలిపారు. -
పది మంది మృత్యువాత
రసాయనాలు రవాణా చేస్తున్న ట్రక్కులో ప్రయాణించిన ఏడుగురి మృతి అనంతపురం సంఘటనలో వోల్వో బస్సు ప్రయాణికుల దుర్మరణం విజయవాడ/వీరవల్లి/చిలమత్తూరు: కృష్ణా,అనంతపురం జిల్లా ల్లో శనివారం తెల్లవారు జామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవరం వద్ద జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం చేగూరుపాడు గ్రామానికి చెందిన వెల్లిపల్లి శ్రీనివాసరావు(45), వేగేశ్వరపురానికి కూనాల మరాఠీ(35), కూనాల మణికంఠ(12),వీరవల్లి మండలం అనంతపల్లికి చెందిన శ్రీకృష్ణ(6), తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలేనికి చెందిన పుట్టా నాగభూషణం(40), నాగమణి(35) దంపతులు, ఇదే మండలంలోని పెద్దిపాలెంకు చెందిన బంధం లోవరాజు(50) ఉన్నారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాగా ముగ్గురు పరిచయస్తులు ఉన్నారు. పోలీసుల కథనం మేరకు హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీప బుద్దివెల్లు వద్ద కూలి పనులు చేసుకుంటున్న శ్రీనివాసరావు కుటుంబీకులు, పరిచయస్తులతో కలసి తమ బంధువు పెద్ద కర్మలో పాల్గొనేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. వారు పటాన్చెరునుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు రసాయనాలు రవాణా చేస్తున్న ట్రక్కులో ఎల్బీనగర్ వద్ద శుక్రవారం రాత్రి ఎక్కారు. ట్రక్కులోని కెమికల్స్ పీపాల మధ్యలో కూర్చున్నారు. వాహనం వీరవల్లి సమీపానికి చేరుకున్నప్పుడు ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో వ్యాన్‌లోని డెఫైనాయల్ మిథైన్ పీపాలు పగిలి దట్టమైన పొగలు కమ్మాయి. నలుగురు అక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, చికిత్స పొందుతూ మరో ఇద్దరు విగతజీవులయ్యారు. ప్రాణాలను తీసిన వోల్వో... అనంతపురం జిల్లా చిలమత్తూరు సమీప 44వ నంబరు జాతీయ రహదారిపై సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు కథనం మేరకు... శుక్రవారం రాత్రి ఓ వోల్వో బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున కోడూరు తోపు- కొడికొండ చెక్‌పోస్టు మధ్యలో ఉన్న జువారి సీడ్స ఫ్యాక్టరీ సమీపంలో వెళ్తున్న సిమెంటు లారీని 15 మీటర్ల దూరంలో గుర్తించిన బస్సు డ్రైవర్ జలీల్‌ఖాన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందు సీట్లల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలడంతో తుళ్లుకుంటూ రోడ్డుపై పడిపోయారు.వారిపై నుంచి బస్సు దూసుకెళ్లి లారీని ఢీకొంది. రోడ్డున పడ్డవారు దుర్మరణం చెందారు. మరో ప్రయాణికుడు లారీ-బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. మృతుల్లో బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ (30), హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాబుపిళ్లై (34)తోపాటు మరొకరు (హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన మద్దిశెట్టి వీరశేఖర్‌గా అనుమానం) ఉన్నారు. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. -
ఆటో, లారీ ఢీ.. ఏడుగురి దుర్మరణం
మరో ఆరుగురికి గాయాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన సర్వే కోసం వచ్చి వెళ్తుండగా ఘోరం మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మంగళవారం జరిగిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు కావటం గమనార్హం. వివరాలివీ...జిల్లాలోని మక్తల్, మాగనూరు మండలాలకు చెందిన కొందరు ముంబై, హైదరాబాద్‌లో వలస జీవనం సాగిస్తున్నారు. సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. తిరిగి వెళ్లేందుకు బుధవారం 13 మంది ఆటోలో మక్తల్‌కు బయలుదేరారు. ఉదయం 11గంటలకు వారి ఆటోను మాగనూరు సమీపంలో రాయిచూర్‌కు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు. మరో ప్రమాదంలో.. తమిళ డెరైక్టర్‌కు గాయాలు ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం గాయపడగా.. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ముకళంజియం తన స్నేహితుని వివాహానికి రాజమండ్రి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
లారీ- జీపు ఢీ: ఏడుగురు మృతి
ఒడిశాలోని కేంద్రపడ జిల్లా చాందోల్ వద్ద గురువారం లారీ - జీపు ఢీ కొన్నాయి. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీహార్‌లో మావోయిస్టుల ఘతుకం