
10 ఏళ్ల చిన్నారి ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి
అబూజా: 10 ఏళ్ల చిన్నారి జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం నైజిరీయా ఉత్తర ప్రాంతంలోని యోబ్ రాజధాని దమతురులో ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని... వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఆత్మాహుతి దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
క్షతగాత్రులకు వైద్య ఖర్చులను భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. జన సమర్థం అధికంగా ఉండే బస్టాండ్ లోకి ప్రవేశించిన చిన్నారి తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.