కూలిన విమానం: ఏడుగురు మృతి | Seven killed in Plane crash in Colombia | Sakshi
Sakshi News home page

కూలిన విమానం: ఏడుగురు మృతి

Published Fri, Dec 26 2014 9:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

Seven killed in Plane crash in Colombia

బొగోటా: కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కొలంబియా ఈశాన్య రాష్ట్రమైన బుకారమంగ నుంచి విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ పౌర విమానయాన భద్రత కార్యదర్శి వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు మగవారు ఉన్నారని చెప్పారు.

విమాన శకలాలను పర్వత ప్రాంతంలో కనుగొన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పౌర విమానయాన భద్రత కార్యదర్శి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement