పిట్టల్లా రాలిపోతున్నారు..
►వడదెబ్బకు జిల్లాలో ఒకే రోజు ఏడుగురు మృతి
►బెంబేలెత్తిస్తున్న ఎండలు
జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. భానుడు తన ఉగ్రరూపం చూపిస్తుంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వణికిపోతున్నారు. ఒక్క సోమవారం రోజునే ఎండలకు తాళలేక ఏడుగురు మరణించారు. నెల్లిమర్లలో ముగ్గురు, సాలూరులో ఒకరు, వేపాడలో ఒకరు, చీపురుపల్లిలో ఇద్దరు వడదెబ్బ బారిన పడి మరణించిన వారిలో ఉన్నారు
వేపాడ (ఎస్‌కోట) : వేపాడ మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన దాసరి సత్యం (76) అనే వ్యక్తి ఆదివారం రాత్రి వడదెబ్బ బారిన పడి మరణించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు కమిటీ సభ్యులకు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నిర్ధారించారు. డీటీ కె ప్రసాదరావు, వైద్య, పోలీస్ శాఖాధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని వివరాలు వెల్లడించారు.
నెల్లిమర్ల నగర పంచాయతీలో ముగ్గురు..
నెల్లిమర్ల : ఎండదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎండ తీవ్రతకు తట్టుకోలేక నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణంలో నగర పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు చనిపోగా, జరజాపుపేటలో మరో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జలగడుగుల సత్తియ్య (55) రోజులాగే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. కానీ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. అస్వస్థతగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు.
జరజాపుపేటకు చెందిన సూరి ముత్యాలమ్మ (60), గంటా పెంటయ్య (63) కూడా ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇళ్లల్లోనే మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణానికి చెందిన నక్కాన వెంటకరావు (43) అనే వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందారు. మొత్తంగా ఈ వేసవిలో వడదెబ్బ బారిన పడి నెల్లిమర్ల నగర పంచాయతీ, మండల వ్యాప్తంగా 45 మంది మరణించారు. అధికారులు మాత్రం ఇద్దరినో, ముగ్గురినో మాత్రమే వడదెబ్బ మృతులుగా గుర్తించారు. సమాచారం అందించినా రెవెన్యూ అధికారులు రావడం లేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
బహర్భూమికని వెళ్లి..
సాలూరు : సాలూరు మండలం ఇద్దనవలస గ్రామానికి చెందిన దమరసింగు అప్పలస్వామి ( 65) సోమవారం ఉదయం గ్రామం సమీపంలో ఉన్న చెరువుకి బహిర్భూమికి వెళ్లి అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ముందురోజు బాగా ఎండలో పని చేసిన ఆయన ఉదయం లేచిన తర్వాత హఠాత్తుగా కుప్పకూలినట్లు భార్య సీతమ్మ, ఆయన ముగ్గురు కుమారులు పేర్కొన్నారు.
ఇద్దరు మహిళల మృతి
చీపురుపల్లి రూరల్/చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలో సోమవారం ఎండ దాటికి తాళలేక ఇద్దరు మహిళలు మృతి చెందారు. మండలంలోని అలజంగి పంచాయతీ పరధిలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవల్ల సత్యవతి (36) వడదెబ్బతో మరణించారు. దివ్యాంగురాలైన సత్యవతి ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చిన వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే చీపురుపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిటాల పుష్పలత (43) అనే మహిళ ఎండకు తట్టుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంతవరకు బాగానే ఉన్న పుష్పలత మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటిలోనే కుప్ప కూలిపోగా, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఎండకు తట్టుకోలేక..