
ఆ బార్ నాది కాదు: మల్లాది విష్ణు
కల్తీమద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన బార్ తనది కాదని, తన బంధువులదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ ఘటన వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వాటర్ కూలర్‌లో ఎవరో ఏదో కలిపారని అనుమానం ఉందని, ఆ నీళ్లు కలుపుకొని మద్యం తాగినవాళ్లే అస్వస్థతకు గురయ్యారని విష్ణు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ఈ బార్‌ను సీజ్ చేశామని, మద్యం ఎక్కడినుంచి వచ్చిందో విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అంతకుముందు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.