cheap country liquor
-
ఆ బార్ నాది కాదు: మల్లాది విష్ణు
-
కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
-
ఆ బార్ నాది కాదు: మల్లాది విష్ణు
కల్తీమద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన బార్ తనది కాదని, తన బంధువులదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ ఘటన వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వాటర్ కూలర్లో ఎవరో ఏదో కలిపారని అనుమానం ఉందని, ఆ నీళ్లు కలుపుకొని మద్యం తాగినవాళ్లే అస్వస్థతకు గురయ్యారని విష్ణు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ బార్‌ను సీజ్ చేశామని, మద్యం ఎక్కడినుంచి వచ్చిందో విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అంతకుముందు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. విజయవాడ స్వర్ణ బార్లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతి
విజయవాడ : విజయవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక కృష్ణలంక నెహ్రు నగర్ లోని స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. బార్ ను సీజ్ చేశామని, లిక్కర్ ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తెలిపారు. ఎక్సైజ్ అధికారులు మద్యం శాంపిల్స్‌ను సేకరించి బార్‌ను సీజ్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ...ప్రభుత్వ ఆస్పత్రిలో సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. మృతుల వివరాలు....1. ఆకుల విజయ్ (46), 2. మీసాల మహేశ్ (40), 3. మునగాల శంకర్ రావు (45), 4. పరస గోపీ (48), 5. మాదాసు నాంచారయ్య (60)