
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు.
లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment