adverse weather
-
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
‘విక్రమ్’ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా ప్రైవేట్‌రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది. నవంబర్ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు. -
ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. మామిడి ప్రియులకు చేదు వార్త
మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది. సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు ప్రతికూల వాతావరణంతోనే.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ధరలు ఫర్వాలేదు... రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే. – బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి ఎగుమతులపై ప్రభావం కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. -
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
-
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
నెల రోజుల్లో 100 ఫ్లాట్ల విక్రయం!
‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ♦ బాచుపల్లిలో ప్రణీత్ గ్రూప్ ప్రీమియం ప్రాజెక్ట్ ♦ శరవేగంగా జెనిత్ నిర్మాణ పనులు ♦ త్వరలోనే ఇదే ప్రాంతంలో టైటానియం ప్రారంభం ♦ మల్లంపేట, బీరంగూడల్లో విల్లా ప్రాజెక్ట్‌లు కూడా.. ప్రతికూల వాతావరణంలో కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. నిర్మా ణం పూర్తయిన ఫ్లాట్లను విక్రయించాలంటేనే కష్టం. అందులోనూ నేటికీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తేరుకోని హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మరీనూ! అలాం టిది ప్రాజెక్ట్ అనుమతులొచ్చిన రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో వంద ఫ్లాట్లను విక్రయిం చడమంటే మాములు విషయం కాదు! అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉండ టం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా ఫ్లాట్ల అప్పగింత, నిర్మాణ సంస్థ మీద నమ్మకం ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అయితే పైన చెప్పినవన్నీ జెనీత్ ప్రాజెక్ట్‌తో సాధ్యమైందన్నారు ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు. సాక్షి, హైదరాబాద్: ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లిలో ఇప్పటివరకు 6 విల్లా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. విల్లాల్లో పొందే వసతులు అపార్ట్మెంట్లలోనూ అందించాలని అది కూడా తక్కువ ధరలో అని జెనిత్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. 3.18 ఎకరాల్లో మొత్తం 265 ఫ్లాట్లొస్తాయి. 830 చ.అ. నుంచి 1,375 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. మొత్తం 5 బ్లాకుల్లో ఒక్కోటి ఐదంతస్తుల్లో ఉంటుంది. ధర చ.అ.కు రూ.2,900. ⇔ 2017 ముగింపు నాటికి ప్రణీత్ గ్రూప్ నుంచి పలు ప్రాజెక్ట్‌లు రానున్నాయి. బాచుపల్లిలో 8 ఎకరాల్లో టైటానియా ప్రాజెక్ట్ రానుంది. ఇందులో 600 ఫ్లాట్లొస్తాయి. మల్లంపేటలో 40 ఎకరాల్లో లీఫ్ ప్రాజెక్ట్ వస్తోంది. ఇందులో విల్లాలు, అపార్ట్మెంట్లుతో పాటూ పాఠశాలను కూడా నిర్మించనున్నాం. బీరంగూడలో 30 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. తొమ్మిది వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెలూన్, క్రెచ్, లైబ్రరీ, ల్యాండ్ స్కేపింగ్, పైప్ గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్ వంటి అన్ని రకాల సదుపాయాలుంటాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి టవర్లోని 70 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. మిగిలిన టవర్లను ప్రతి రెండు నెలలకొకటి చొప్పున పూర్తి చేస్తాం. ఫ్లాట్ల బుకింగ్ కోసం సేల్స్ఃప్రణీత్.కామ్ లేదా ప్రణీత్.కామ్‌లో సంప్రదించవచ్చు. కొనుగోలుకు 3 కారణాలు.. నగరంలో ఎన్నో నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లు.. ఇంతకంటే తక్కువ ధరకూ దొరుకుతున్నప్పుడు జెనీత్లోనే ఎందుకు కొనుగోలు చేయాలని ‘సాక్షి రియల్టీ’కి అడిగిన ప్రశ్నకు.. 3 కారణాలను చెప్పారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్. అవేంటంటే.. ⇔ ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.6–18 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తొలిసారి గృహ కొనుగోలుదారులకు వడ్డీ రాయితీని ప్రకటించింది. ఈ పథకం జెనీత్ ప్రాజెక్ట్కూ వర్తిస్తుంది. అంటే రూ.9 లక్షల్లోపు గృహ రుణానికి ఏడాదికి 4 శాతం, రూ.12 లక్షల్లోపు రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తుంది. ⇔ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) జూన్–జూలై నెలల్లో అమలులోకి రానుంది. ఈ బిల్లులోని నిబంధనలను డెవలపర్లు తూచా తప్పకుండా పాటించాలంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా ధరలూ పెరుగుతాయి. 20–30 శాతం ధరలు పెరగొచ్చు. దీనర్థం సొంతింటి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ⇔ బాచుపల్లి చుట్టూ 5–8 కి.మీ. పరిధిలో విద్యా, వైద్య, వినోద సంస్థలెన్నో ఉన్నాయి. సిల్వర్ ఓక్, క్రీక్, డీపీఎస్, ఓక్రిడ్ ఐన్‌స్టీన్, వీజేఐటీ, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం వంటి విద్యా సంస్థలున్నాయి. 4 కి.మీ దూరంలోని మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ), మియాపూర్ మెట్రో, 6 కి.మీ. దూరంలో నిజాంపేట క్రాస్ రోడ్లున్నాయి. 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లంపేట ఓఆర్ఆర్ను ఆధారం చేసుకొని మరిన్ని అభివృద్ధి కేంద్రాలు రానున్నాయి.