నెల రోజుల్లో 100 ఫ్లాట్ల విక్రయం!
‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు
♦ బాచుపల్లిలో ప్రణీత్ గ్రూప్ ప్రీమియం ప్రాజెక్ట్
♦ శరవేగంగా జెనిత్ నిర్మాణ పనులు
♦ త్వరలోనే ఇదే ప్రాంతంలో టైటానియం ప్రారంభం
♦ మల్లంపేట, బీరంగూడల్లో విల్లా ప్రాజెక్ట్‌లు కూడా..
ప్రతికూల వాతావరణంలో కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. నిర్మా ణం పూర్తయిన ఫ్లాట్లను విక్రయించాలంటేనే కష్టం. అందులోనూ నేటికీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తేరుకోని హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మరీనూ! అలాం టిది ప్రాజెక్ట్ అనుమతులొచ్చిన రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో వంద ఫ్లాట్లను విక్రయిం చడమంటే మాములు విషయం కాదు! అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉండ టం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా ఫ్లాట్ల అప్పగింత, నిర్మాణ సంస్థ మీద నమ్మకం ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అయితే పైన చెప్పినవన్నీ జెనీత్ ప్రాజెక్ట్‌తో సాధ్యమైందన్నారు ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు.
సాక్షి, హైదరాబాద్: ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లిలో ఇప్పటివరకు 6 విల్లా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. విల్లాల్లో పొందే వసతులు అపార్ట్‌మెంట్లలోనూ అందించాలని అది కూడా తక్కువ ధరలో అని జెనిత్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. 3.18 ఎకరాల్లో మొత్తం 265 ఫ్లాట్లొస్తాయి. 830 చ.అ. నుంచి 1,375 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. మొత్తం 5 బ్లాకుల్లో ఒక్కోటి ఐదంతస్తుల్లో ఉంటుంది. ధర చ.అ.కు రూ.2,900.
⇔ 2017 ముగింపు నాటికి ప్రణీత్ గ్రూప్ నుంచి పలు ప్రాజెక్ట్‌లు రానున్నాయి. బాచుపల్లిలో 8 ఎకరాల్లో టైటానియా ప్రాజెక్ట్ రానుంది. ఇందులో 600 ఫ్లాట్లొస్తాయి. మల్లంపేటలో 40 ఎకరాల్లో లీఫ్ ప్రాజెక్ట్ వస్తోంది. ఇందులో విల్లాలు, అపార్ట్‌మెంట్లుతో పాటూ పాఠశాలను కూడా నిర్మించనున్నాం. బీరంగూడలో 30 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్‌ను చేయనున్నాం.
తొమ్మిది వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెలూన్, క్రెచ్, లైబ్రరీ, ల్యాండ్ స్కేపింగ్, పైప్ గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్ వంటి అన్ని రకాల సదుపాయాలుంటాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి టవర్‌లోని 70 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. మిగిలిన టవర్లను ప్రతి రెండు నెలలకొకటి చొప్పున పూర్తి చేస్తాం. ఫ్లాట్ల బుకింగ్ కోసం సేల్స్ఃప్రణీత్.కామ్ లేదా ప్రణీత్.కామ్‌లో సంప్రదించవచ్చు.
కొనుగోలుకు 3 కారణాలు..
నగరంలో ఎన్నో నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లు.. ఇంతకంటే తక్కువ ధరకూ దొరుకుతున్నప్పుడు జెనీత్‌లోనే ఎందుకు కొనుగోలు చేయాలని ‘సాక్షి రియల్టీ’కి అడిగిన ప్రశ్నకు.. 3 కారణాలను చెప్పారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్. అవేంటంటే..
⇔ ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.6–18 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తొలిసారి గృహ కొనుగోలుదారులకు వడ్డీ రాయితీని ప్రకటించింది. ఈ పథకం జెనీత్ ప్రాజెక్ట్‌కూ వర్తిస్తుంది. అంటే రూ.9 లక్షల్లోపు గృహ రుణానికి ఏడాదికి 4 శాతం, రూ.12 లక్షల్లోపు రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తుంది.
⇔ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) జూన్–జూలై నెలల్లో అమలులోకి రానుంది. ఈ బిల్లులోని నిబంధనలను డెవలపర్లు తూచా తప్పకుండా పాటించాలంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా ధరలూ పెరుగుతాయి. 20–30 శాతం ధరలు పెరగొచ్చు. దీనర్థం సొంతింటి కొనుగోలుకు ఇదే సరైన సమయం.
⇔ బాచుపల్లి చుట్టూ 5–8 కి.మీ. పరిధిలో విద్యా, వైద్య, వినోద సంస్థలెన్నో ఉన్నాయి. సిల్వర్ ఓక్, క్రీక్, డీపీఎస్, ఓక్రిడ్ ఐన్‌స్టీన్, వీజేఐటీ, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం వంటి విద్యా సంస్థలున్నాయి. 4 కి.మీ దూరంలోని మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ), మియాపూర్ మెట్రో, 6 కి.మీ. దూరంలో నిజాంపేట క్రాస్ రోడ్‌లున్నాయి. 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లంపేట ఓఆర్‌ఆర్‌ను ఆధారం చేసుకొని మరిన్ని అభివృద్ధి కేంద్రాలు రానున్నాయి.