Praneeth Group
-
నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ విల్లాల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్.. మరొక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం జూబ్లీ్లహిల్స్లోని ప్రణీత్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ నైట్వుడ్స్. బీరంగూడలో 30 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 459 ప్రీమియం విల్లాలుంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు తెలిపారు. 150 నుంచి 213 గజాలలో, 1,800–2,441 చ.అ. బిల్టప్ ఏరియాలో విల్లా విస్తీర్ణాలు ఉంటాయి. ధర చ.అ.కు రూ.7,500. నైట్వుడ్స్ ప్రణీత్ గ్రూప్ నుంచి వస్తున్న 25వ ప్రాజెక్ట్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కేవీఎస్ నర్సింగరావు, పీ రామాంజనేయ రాజు, చంద్రశేఖర్ రెడ్డి బక్కిరెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి సప్పిడి, సందీప్‌రావ్ మాధవరంలు పాల్గొన్నారు. -
1,100 ఎకరాలు 19 ప్రాజెక్ట్‌లు
నిర్మాణంలో నాణ్యత, గడువులోగా కొనుగోలుదారులకు అప్పగింత.. ఇవే వ్యాపార లక్ష్యంగా చేసుకొని నివాస సముదాయాలను నిర్మిస్తోన్న ప్రణీత్ గ్రూప్... నగరం నలువైపులా విస్తరణకు ప్రణాళికలు చేపట్టింది. గతంలో బాచుపల్లి, బీరంగూడ వంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్థ... అన్ని ప్రధాన ప్రాంతాలలో ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. కొల్లూరు, దుండిగల్, పటాన్చెరు, అన్నోజిగూడ, బీఎన్ రెడ్డి నగర్, ఖాజాగూడ, మియాపూర్ వంటి ప్రాంతాలలో సుమారు 1,100 ఎకరాలలో 19 ప్రాజెక్ట్‌లను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. సాక్షి, హైదరాబాద్: ఇటీవలే 14 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రణీత్ గ్రూప్.. ఇప్పటివరకు 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 22 ప్రాజెక్ట్‌లలో సుమారు 5 వేల గృహాలను నిర్మించింది. ప్రస్తుతం 75 లక్షల చ.అ.లలో 8 ప్రాజెక్ట్‌లు, సుమారు 3,500 యూనిట్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో 1,600 గృహాలను డెలివరీ చేయడంతో పాటు సుమారు 5 వేల ఫ్లాట్లను ప్రారంభించనున్నాం. ►మల్లంపేటలో 30 ఎకరాలలో లీఫ్ ప్రాజెక్ట్‌ను నిర్మి స్తు న్నాం. 10 లక్షల చ.అ.లలో ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 502 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. విల్లాల డెలివరీ మొదలైంది. ఈ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ►బాచుపల్లిలో 6 ఎకరాలలో టౌన్‌స్క్వేర్ అపార్ట్మెం ట్. 7 లక్షల చ.అ.లలో మొత్తం 527 యూనిట్లుం టాయి. 2.5, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.5 వేలు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి అప్పగింత మొదలవుతుంది. ►బహుదూర్‌పల్లిలో 4.5 ఎకరాలలో ఫ్లోరా ప్రాజెక్ట్. 5 లక్షల చ.అ.లలో రెసిడెన్షియల్, కమర్షియల్ రెండు రకాల నిర్మాణాలుంటాయి. 2, 2.5, 3 బీహెచ్‌కే మొత్తం 392 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,200. ఇందులో 31 వేల చ.అ.లలో కమర్షియల్ స్పేస్ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి డెలివరీ మొదలవుతుంది. ►కొల్లూరులో 2.5 ఎకరాలలో ఎలైట్ ప్రాజెక్ట్. 2.65 లక్షల చ.అ.లలో మొత్తం 144 యూనిట్లుంటాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.4,800. ఈ ఏడాది డిసెంబర్ నుంచి డెలివరీ మొదలవుతుంది. ►బీరంగూడలో 30 ఎకరాలలో నైట్వుడ్స్ విల్లా ప్రాజెక్ట్. 150–250 గజాల మధ్య మొత్తం 460 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ. 7 వేలు. 2023 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. 3 నెలల్లో ప్రారంభం.. ►హైదర్‌నగర్‌లో 5 ఎకరాలలో జైత్ర పేరిట జీ+14 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 12.2 లక్షల చ.అ.లో మొత్తం 576 యూనిట్లుంటాయి. 2024 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. ధర చ.అ. రూ.6,500. బాచుపల్లిలో 5 ఎకరాలలో సాలిటైర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 12 లక్షల చ.అ.లలో మొత్తం 668 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. బెంగళూరులో తొలి ప్రాజెక్ట్.. ►మల్లంపేట దగ్గర్లోని శంభీపూర్లో 4 ఎకరాలలో డఫోడిల్స్ ప్రాజెక్ట్. 4 లక్షల చ.అ.లలో మొత్తం 300 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,500. ►ఘట్కేసర్ దగ్గర్లోని అన్నోజిగూడలో 6.5 ఎకరాలలో, 12 లక్షల చ.అ.లలో హైరైజ్ అపార్ట్మెంట్ రానుంది. ఇందులో 700 యూనిట్లుంటాయి. చ.అ.కు రూ.4,500. ►కొల్లూరు దగ్గర్లోని వెలిమల ప్రాంతంలో 11 ఎకరాలలో నవనీత్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. మొత్తం 20 లక్షల చ.అ.లు కాగా.. ఫేజ్–1 కింద 12 లక్షల చ.అ.లలో 650 యూనిట్లను నిర్మించనున్నాం. ఫేజ్–2లో 8 లక్షల చ.అ.లను అభివృద్ధి చేస్తాం. ధర చ.అ.కు రూ.5 వేలు. ►వచ్చే ఏడాది బెంగళూరులో తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. సజ్జాపూర్ రోడ్లో 17 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్, ఐటీ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నాం. గ్రోవ్ పార్క్‌లో బోటింగ్ హైదరాబాద్‌లో తొలిసారిగా బోటింగ్ సౌకర్యంతో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. లగ్జరీ వసతులు, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ కొనుగోలుదారులకు సరికొత్త అనుభూతులను అందించే లా డిజైన్స్లను ఎంపిక చేస్తున్నాం. దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 1.5 కి.మీ దూరంలో గాగిళ్లపూర్లో గ్రోవ్పార్క్ పేరిట ఇంటిగ్రేటెడ్ గ్రూప్ హౌసింగ్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. వెంచర్ మధ్యలో సరస్సు కొలువై ఉండటం దీని ప్రత్యేకత. మొత్తం 78 ఎకరాల ప్రాజెక్ట్ కాగా.. ఇందులో 62 ఎకరాలలో మాత్రమే విల్లాలుంటాయి. 7 ఎకరాలలో లేక్ పోగా.. 9 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ స్కేపింగ్, ఇతరత్రా వసతులకు కేటాయించాం. లేక్ చుట్టూ గ్రీనరీ, బోటింగ్, ఇతరత్రా సౌకర్యాలతో పూర్తి గా పర్యావరణ హితమైన ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతాం. ♦ప్రాజెక్ట్‌లో మొత్తం 1,000 లగ్జరీ విల్లాలుంటాయి. 150 గజాలు, 400 గజాలలో ట్రిపులెక్స్ విల్లాలు... ఒక్కోటి 2 వేల చ.అ. నుంచి 5 వేల చ.అ. మధ్య విస్తీర్ణాలలో ఉంటుంది. ధర చ.అ.కు రూ.6,500. నిర్మాణ అనుమతులు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. మూడేళ్లలో పూర్తి చేస్తాం. ♦ఇందులో 70 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్, ఓపెన్ థియేటర్, ఫ్రాగ్రెన్స్ గార్డెన్, బటర్‌ఫ్లై గార్డెన్, ఓర్చిడ్ గార్డెన్, పెట్స్ పార్క్, పార్టీ లాన్స్ వంటివి అభివృద్ధి చేస్తాం. వీటితో పాటు టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్ట్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్కేటింగ్ రింక్, ఔట్‌డోర్ జిమ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
నెల రోజుల్లో 100 ఫ్లాట్ల విక్రయం!
‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ♦ బాచుపల్లిలో ప్రణీత్ గ్రూప్ ప్రీమియం ప్రాజెక్ట్ ♦ శరవేగంగా జెనిత్ నిర్మాణ పనులు ♦ త్వరలోనే ఇదే ప్రాంతంలో టైటానియం ప్రారంభం ♦ మల్లంపేట, బీరంగూడల్లో విల్లా ప్రాజెక్ట్‌లు కూడా.. ప్రతికూల వాతావరణంలో కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు.. నిర్మా ణం పూర్తయిన ఫ్లాట్లను విక్రయించాలంటేనే కష్టం. అందులోనూ నేటికీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తేరుకోని హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మరీనూ! అలాం టిది ప్రాజెక్ట్ అనుమతులొచ్చిన రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో వంద ఫ్లాట్లను విక్రయిం చడమంటే మాములు విషయం కాదు! అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉండ టం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా ఫ్లాట్ల అప్పగింత, నిర్మాణ సంస్థ మీద నమ్మకం ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అయితే పైన చెప్పినవన్నీ జెనీత్ ప్రాజెక్ట్‌తో సాధ్యమైందన్నారు ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు. సాక్షి, హైదరాబాద్: ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లిలో ఇప్పటివరకు 6 విల్లా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. విల్లాల్లో పొందే వసతులు అపార్ట్మెంట్లలోనూ అందించాలని అది కూడా తక్కువ ధరలో అని జెనిత్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. 3.18 ఎకరాల్లో మొత్తం 265 ఫ్లాట్లొస్తాయి. 830 చ.అ. నుంచి 1,375 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. మొత్తం 5 బ్లాకుల్లో ఒక్కోటి ఐదంతస్తుల్లో ఉంటుంది. ధర చ.అ.కు రూ.2,900. ⇔ 2017 ముగింపు నాటికి ప్రణీత్ గ్రూప్ నుంచి పలు ప్రాజెక్ట్‌లు రానున్నాయి. బాచుపల్లిలో 8 ఎకరాల్లో టైటానియా ప్రాజెక్ట్ రానుంది. ఇందులో 600 ఫ్లాట్లొస్తాయి. మల్లంపేటలో 40 ఎకరాల్లో లీఫ్ ప్రాజెక్ట్ వస్తోంది. ఇందులో విల్లాలు, అపార్ట్మెంట్లుతో పాటూ పాఠశాలను కూడా నిర్మించనున్నాం. బీరంగూడలో 30 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. తొమ్మిది వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెలూన్, క్రెచ్, లైబ్రరీ, ల్యాండ్ స్కేపింగ్, పైప్ గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్ వంటి అన్ని రకాల సదుపాయాలుంటాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి టవర్లోని 70 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. మిగిలిన టవర్లను ప్రతి రెండు నెలలకొకటి చొప్పున పూర్తి చేస్తాం. ఫ్లాట్ల బుకింగ్ కోసం సేల్స్ఃప్రణీత్.కామ్ లేదా ప్రణీత్.కామ్‌లో సంప్రదించవచ్చు. కొనుగోలుకు 3 కారణాలు.. నగరంలో ఎన్నో నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లు.. ఇంతకంటే తక్కువ ధరకూ దొరుకుతున్నప్పుడు జెనీత్లోనే ఎందుకు కొనుగోలు చేయాలని ‘సాక్షి రియల్టీ’కి అడిగిన ప్రశ్నకు.. 3 కారణాలను చెప్పారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్. అవేంటంటే.. ⇔ ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.6–18 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తొలిసారి గృహ కొనుగోలుదారులకు వడ్డీ రాయితీని ప్రకటించింది. ఈ పథకం జెనీత్ ప్రాజెక్ట్కూ వర్తిస్తుంది. అంటే రూ.9 లక్షల్లోపు గృహ రుణానికి ఏడాదికి 4 శాతం, రూ.12 లక్షల్లోపు రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తుంది. ⇔ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) జూన్–జూలై నెలల్లో అమలులోకి రానుంది. ఈ బిల్లులోని నిబంధనలను డెవలపర్లు తూచా తప్పకుండా పాటించాలంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా ధరలూ పెరుగుతాయి. 20–30 శాతం ధరలు పెరగొచ్చు. దీనర్థం సొంతింటి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ⇔ బాచుపల్లి చుట్టూ 5–8 కి.మీ. పరిధిలో విద్యా, వైద్య, వినోద సంస్థలెన్నో ఉన్నాయి. సిల్వర్ ఓక్, క్రీక్, డీపీఎస్, ఓక్రిడ్ ఐన్‌స్టీన్, వీజేఐటీ, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం వంటి విద్యా సంస్థలున్నాయి. 4 కి.మీ దూరంలోని మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ), మియాపూర్ మెట్రో, 6 కి.మీ. దూరంలో నిజాంపేట క్రాస్ రోడ్లున్నాయి. 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లంపేట ఓఆర్ఆర్ను ఆధారం చేసుకొని మరిన్ని అభివృద్ధి కేంద్రాలు రానున్నాయి. -
‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’
‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు • అందుబాటు ఇళ్లకు ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు • ఇప్పటికే 150 ఎకరాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి • మరో వంద ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో.. సాక్షి, హైదరాబాద్: ⇔ సొంతింటి కోసం చెప్పులరిగేలా తిరిగిన శ్రమ.. ఏకంగా స్థిరాస్తి సంస్థనే పెట్టేలా చేసింది. ⇔ పైసా పెట్టుబడి లేకుండా ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్ 20 రోజుల్లోనే హాట్‌కేక్‌లా పూర్తయి.. నెల రోజుల్లోనే కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. ⇔ 2007 జులైలో ప్రారంభమైన ప్రణీత్ గ్రూప్.. ఇప్పటివరకు 16 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకొని 2 వేలకు పైగా హ్యాపీ కుటుంబాలకు నిలయమైందని చెప్పుకొచ్చారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు. అందుబాటు ధరల్లో నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లు కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు తగ్గవని ‘సాక్షి రియల్టీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో చెప్పారాయన. ⇔ మాది కడప జిల్లాలోని చాపాడు గ్రామం. ఆరు గురి సంతానంలో చిన్నవాణ్ని. ఏడు వరకు సొంతూళ్లోనే చదివా. ఆపైన చదువు కోసం పెద్దన్న ప్రోద్బలం, ప్రోత్సాహంతో 1983లో హైదరాబాద్‌కొచ్చా. ఆర్ధికంగా కుటుంబం బలహీనం కావటంతో చిన్నప్పుటి నుంచే కష్టాలు తప్పలేదు. బడిచౌడిలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశా. ఇంజనీరింగ్ చేయాలనేది నా కోరిక. కానీ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిప్లొమాలో చేరాల్సి వచ్చింది. పంజగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. జీతం రూ.500. ఇదే నా తొలి సంపాదన. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ చేస్తున్న స్నేహితుల రూముల్లో ఉండేవాణ్ని. కోచింగ్ తీసుకుంటున్న ఫ్రెండ్స్‌కు ట్యూషన్స్ చెబుతూ నేనూ ఇంజనీరింగ్ రాశా. ఎవరికీ మంచి ర్యాంక్ రాలేదు. నాకు మాత్రం 119 ర్యాంక్ వచ్చింది. ⇔ అయితే నాకొచ్చిన ర్యాంక్‌కు మంచి కాలేజీలోనే సీటొచ్చేది కానీ, నాన్ లోకల్ కావటంతో అనంతపురంలోని జేఎన్టీయూలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఓవైపు ఇష్టం లేదు కానీ, ప్రకాశ్, మురళి ఇద్దరు ఫ్రెండ్స్ రెండో ఏడాది హైదరాబాద్ జేఎన్టీయూకు మార్చుకోవచ్చని సలహా ఇవ్వటంతో నేనూ సరేనని అనంతపురం వెళ్లా. అయితే తొలి ఏడాది టాప్ 5లో ఉన్న విద్యార్థులకు మాత్రమే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముంటుందనడంతో ఫస్ట్ ఇయర్ బాగా చదవా. రెండో ఏడాది మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టా. 78.5 ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఐటీలో పదేళ్లు: ప్రభుత్వ ఉద్యోగమైతే బిందాస్‌గా ఉండొచ్చనే ఉద్దేశంతో బాగా కష్టపడి చదివి ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే 1994లో దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్ జాబ్ కొట్టేశా. వేతనం రూ.5 వేలే అయినా.. పైపైన మాత్రం బాగానే వచ్చేది. కానీ, ఏదో Ðð లితి. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌కు దూరంగా ఏంటిదా అని? అప్పటికే కొంత మంది ఫ్రెండ్స్ ఐటీ ఉద్యోగం పేరిట విదేశాల్లో ఉంటే.. నాకూ అమెరికా వెళ్లాలనిపించింది. ఇంకేముంది సీ ++ కోర్సు కోసం బెంగళూరుకెళ్లా. 2 నెలల్లో ఐటీ జాబ్ వచ్చేసింది. టాటాతో మొదలైన నా ఐటీ ఉద్యోగం టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్ కంపెనీల్లో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశా. భారీ వేతనం, విదేశీ ఆఫర్స్ ఉన్నా సరే ఐటీలో వెలితనిపించేది. నా జీవితం భాగ్యనగరంతోనే ముడిపడి ఉందనిపించింది. అందుకే జాబ్‌కు టాటా చెప్పేశా. 3 నెలల్లో 6 వేల కి.మీ... చదువుకునే రోజుల్లో ఉన్న హైదరాబాద్‌కు ఇప్పుడున్న హైదరాబాద్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో అద్దె లేకుండా కేవలం కరెంట్, నీళ్ల బిల్లు కట్టి ఉండేవాన్ని. కానీ, ఇప్పుడేమో అద్దె కాదు కదా అసలు బతగ్గలనా అనిపించింత అభివృద్ధి చెందింది. అప్పటికే పెళ్లి కావటంతో అద్దెకుండటం కంటే సొంతిల్లు కొనుక్కోవటమే ఉత్తమమనిపించింది. ఇంకేముంది రోజూ పేపర్లలో యాడ్స్ చూసి భార్యతో కలిసి వెళ్లేవాణ్ని. ఎంతలా తిరిగానంటే బైక్ మీద 3 నెలల్లో 6 వేల కి.మీ. తిరిగేశాం. చివరికి నిజాంపేటలో ఇళ్లు ఫైనలైంది. రూ.10 లక్షలు రుణం, మిగిలిన దాంట్లో కొంత మా మామగారు సర్ది.. మొత్తం మీద గృహ ప్రవేశం పూర్తి చేశాం. అయితే ఇదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే.. ఇంటికోసం నేను పడిన శ్రమ, పరిశోధన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చర్చించేవాణ్ని. ఎక్కడ స్థలాలు కొంటే లాభమొస్తుందో చెప్పేవాణ్ని. చాలామంది కొని లబ్ది పొందారు కూడా. దీంతో నాకు తెలియకుండానే 200–300 మంది ఫాలోవర్స్ తయారయ్యారు. ఇదే నా పెట్టుబడిగా మారింది. అదే 2007 జూలైలో ప్రణీత్ గ్రూప్‌కు బీజం వేసింది. నెల రోజుల్లో కోటి సంపాదన.. తొలి ప్రాజెక్ట్ ప్రారంభం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. నిజాంపేటలో నేను కొన్న ఇళ్లు లీగల్ సమస్యల్లో ఉంటే ఆంజనేయులు గారు తీర్చారు. ఆయన స్థలంలోనే అంటే మల్లంపేటలో 3 ఎకరాల్లో 40 డూప్లెక్స్ హోమ్స్‌కు శ్రీకారం చుట్టా. ల్యాండ్ ఓనర్‌కు, నాకు సగం సగం. ఆశ్చర్యకరమైన విషయమేమీటంటే.. నా 20 ఇళ్లు కేవలం 2 వారాల్లో విక్రయించేశా. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నా అలా నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించా. అలా తొలి ఏడాది రూ.3 కోట్లకు చేరిన ప్రణీత్ గ్రూప్ టర్నోవర్ ప్రస్తుతం రూ.160 కోట్లకు చేరింది. ⇔ విల్లా, గేటెడ్ కమ్యూనిటీ అంటే కోట్ల రూపాయలు కావాలనుకుంటారు. కానీ, సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అది కూడా నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు జోరుగా ఉంటాయనడానికి ప్రణీత్ గ్రూపే నిదర్శనం. ఇప్పటివరకు 150 ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం. 2 వేలకు పైగా కుటుంబాలకు ఇంటి తాళాలందించాం. ప్రస్తుతం 100 ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో సుమారు 1,500 కుటుంబాలు రానున్నాయి. మరో 20 ఎకరాల స్థలాలను సమీకరించాం. సీఎస్ఆర్లోనూ ఉత్సాహంగానే.. ప్రస్తుతం ప్రణీత్ గ్రూప్‌లో 250 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఉద్యోగిని గౌరవిస్తాం. కంపెనీ వార్షికోత్సవం వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు కంపెనీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మా కంపెనీ ఇన్వెస్టర్ల కంటే సీరియస్ హోం సీకర్స్కే ప్రాధాన్యమెక్కువ. అందుకే వాళ్లు ఉండేందుకే ఇళ్లు కొంటారు. అందులోనే ఉంటారు కూడా. ఇన్వెస్టర్లను కస్టమర్లుగా చేర్చుకున్న ప్రాజెక్ట్‌లు సక్సెస్ కాలేవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలనూ ఉత్సాహంగా నిర్వహిస్తాం. బీరంగూడ, మల్లంపేటలో గుడి, బడి కట్టించాం. ప్రణీత్ ప్రాజెక్ట్‌లుండే చోట ఆయా పరిసరాల్లో సీఎస్ఆర్ కింద రోడ్లు, మురుగు నీటి శుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొంత నిధితో ఓ ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయాలనే భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. -
ఈనెల 21న జెనిత్ మెగా టౌన్ షిప్ ప్రారంభం!
లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ నిర్మాణానికి పెట్టింది పేరైన ప్రణీత్ గ్రూప్ తొలిసారిగా బాచుపల్లిలో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టనుంది. 4 ఎకరాల్లో నిర్మించనున్న జెనిత్ ప్రాజెక్ట్‌ను ఈనెల 21న ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ♦ ఇప్పటివరకు బాచుపల్లి ప్రాంతంలో 6 విల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. వీటిలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు ఆనంద జీవనం గడుపుతున్నారు. అయితే విల్లాలో పొందే సౌకర్యాలు అపార్ట్మెంట్లోనూ అందించాలనే లక్ష్యంతో.. అది కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా జెనిత్ పేరుతో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టాం. వచ్చే 3-4 ఏళ్లలో రూ.1,000 కోట్లతో 100-150 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ♦ జెనిత్‌లో మొత్తం 300 ఫ్లాట్లొస్తాయి. 850-1,300 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ఫ్లాట్ ప్రారంభ ధర రూ.25 లక్షలు. 9 వేల చ.అ. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయిందులో. 2017 జూన్ నుంచి దశల వారీగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ♦ ఇదే ప్రాంతంలో 50 ఎకరాల్లో ఆంటిలియా పేరుతో విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో మొత్తం 600 లగ్జరీ విల్లాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. విల్లా విస్తీర్ణాలు 120-300 గజాల మధ్య ఉంటాయి. ప్రాజెక్ట్‌లో 5 ఎకరాల స్థలం కేవలం గ్రీనరీ కోసమే వినియోగించాం. 35 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే 350 విల్లాలను విక్రయించేశాం. ఆగస్టు నుంచి ఇంటీరియర్ పనులు ప్రారంభిస్తాం. -
ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు ఆదరణ పెరుగుతోందని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇటీవల ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలను ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. బాచుపల్లి సమీపంలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. మొత్తం 600లకు పైగానే విల్లాలొస్తాయి. వీటి విస్తీర్ణాలు 120 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. రూ.60 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య వీటి ధరలున్నాయి. ఈనెల చివరి వరకు విల్లాను కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు హోమ్ ఆటోమేషన్‌ను ఉచితంగా ఇవ్వడంతో పాటు చ.అ. కు రూ.300 డిస్కౌంట్ ను అందుకోవచ్చు. 35 వేల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తుండమే కాకుండా మొత్తం విస్తీర్ణంలో 45 శాతం ఓపెన్ ప్లేస్‌కు, 13 శాతం పచ్చదనానికి కేటాయించాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే మరో 10 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌ను కూడా చేపడతాం. గోపన్‌పల్లిలో ఆరున్నర ఎకరాల్లో ప్రణవ్ ప్రైడ్‌ను నిర్మించనున్నాం. మొత్తం 60 విల్లాలు. ధరను రూ.1.8 కోట్ల నుంచి రూ.3 కోట్లుగా నిర్ణయించాం. బీరంగూడలో 35 ఎకరాల్లో ప్రణవ్ పనోరమా ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనున్నాం. మొత్తం 400 విల్లాలు. ధర రూ.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆదిభట్ల, వెలిమల, కొల్లూరుల్లో కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం.