ఈనెల 21న జెనిత్ మెగా టౌన్ షిప్ ప్రారంభం!
లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ నిర్మాణానికి పెట్టింది పేరైన ప్రణీత్ గ్రూప్ తొలిసారిగా బాచుపల్లిలో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టనుంది. 4 ఎకరాల్లో నిర్మించనున్న జెనిత్ ప్రాజెక్ట్‌ను ఈనెల 21న ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
♦ ఇప్పటివరకు బాచుపల్లి ప్రాంతంలో 6 విల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. వీటిలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు ఆనంద జీవనం గడుపుతున్నారు. అయితే విల్లాలో పొందే సౌకర్యాలు అపార్ట్‌మెంట్‌లోనూ అందించాలనే లక్ష్యంతో.. అది కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా జెనిత్ పేరుతో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టాం. వచ్చే 3-4 ఏళ్లలో రూ.1,000 కోట్లతో 100-150 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
♦ జెనిత్‌లో మొత్తం 300 ఫ్లాట్లొస్తాయి. 850-1,300 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ఫ్లాట్ ప్రారంభ ధర రూ.25 లక్షలు. 9 వేల చ.అ. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయిందులో. 2017 జూన్ నుంచి దశల వారీగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం.
♦ ఇదే ప్రాంతంలో 50 ఎకరాల్లో ఆంటిలియా పేరుతో విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో మొత్తం 600 లగ్జరీ విల్లాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. విల్లా విస్తీర్ణాలు 120-300 గజాల మధ్య ఉంటాయి. ప్రాజెక్ట్‌లో 5 ఎకరాల స్థలం కేవలం గ్రీనరీ కోసమే వినియోగించాం. 35 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే 350 విల్లాలను విక్రయించేశాం. ఆగస్టు నుంచి ఇంటీరియర్ పనులు ప్రారంభిస్తాం.