సాక్షి, హైదరాబాద్: అంతా 20 ఏళ్లలోపు వాళ్లే. ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. సెలవుల్లో ఉన్నారు. సరదాగా రిసార్ట్ వెళ్లి వద్దామని బయటకు వచ్చారు. చిన్న వయస్సు కావటం.. కారు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవటం ఒకటి అయితే.. ఓవర్ స్పీడ్.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం నింపింది.
నగరంలోని నార్సింగ్‌లో ఈరోజు(శుక్రవారం, మే 19) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉండగా.. అందరూ 20 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. వీరంతా నిజాంపేట్ నుంచి ఓషెన్ పార్క్‌కు వెళ్తుండగా నార్సింగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కారు.. టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి మృతిచెందాడు. ప్రసాద్ అనే కుర్రాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. నితిన్, హర్షిత, అంకిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత అక్కా చెల్లెళ్లు. అయితే యాక్సిడెంట్‌లో బ్రెయిన్ బయటకు రావడంతో డ్రైవర్ ప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతురాలు హర్షిత తన తండ్రి కారును తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హుషారుగా బయటకు వెళ్లొస్తామంటూ చెప్పిన తమ బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రైట్ సైడ్ అక్కడికక్కడే..
ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కారు ముందు సీట్లో డ్రైవింగ్ చేసిన ప్రసాద్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు కూర్చున్నారు. కారు మధ్య సీట్లో ఐదుగురు, ఆ వెనుక సీట్లో మరో నలుగురు కూర్చున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ పొజిషన్‌కు రైట్ సైడ్ కూర్చున్న నలుగురు మృతి చెందారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా ఫలితం లేకుండా పోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారులోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. దీంతో ఆ ఇంట పెను విషాదం నెలకొంది. మిగతా వాళ్లకూ త్రీవ గాయాలు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment