Bachupalli
-
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
-
మేడ్చల్, బాచుపల్లి ZPHSలో లైబ్రరీ ప్రారంభం
-
మేడ్చల్: బాలికను బడిలోనే ఉంచి తాళం వేసుకెళ్లిన సిబ్బంది
సాక్షి, మేడ్చల్: రోజూ బడికి వెళ్లే ఆరేళ్ల కూతురు స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రమైనా ఇంటికి రాకపోతే..ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం.. ఎక్కడికెళ్లిందో.. ఏమో..ఎవరెత్తుకెళ్లారోనన్న ఆందోళన..! వెంటనే తెలిసిన వారందరినీ అడుగుతారు.. వారు తెలియదని సమాధానం చెబితే నరకం..!ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.. ఎక్కడని వెతకాలి..పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఈ టెన్షన్లో ఉన్న అమ్మానాన్నలకు వారి కూతురు పాఠశాలలోనే ఉందని తెలిస్తే వారి ఆనందం వర్ణనాతీతం.. అయితే ఆ బాలికను లోపలే ఉంచి తాళం వేసుకెళ్లారని చెబితే ఇంతకంటే దారుణం మరొకరటి ఉండదేమో. మరి.. ఇలాంటి సంఘటనే బాచుపల్లిలో చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది బాలికను పాఠశాలలోనే ఉంచి గమనించకుండా తాళం వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బాచుపలిలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి(6) అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ►రోజూ మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. ►మరోమారు పాఠశాల వద్ద వెతుకుతుండగా తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో తమ కుమార్తె తరగతి గదిలో ఉందని గ్రహంచిన సుబ్రహ్మణ్యం, ప్రభావతిలు చుట్టు పక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చిన్నారి రోదిస్తూ కనిపించింది. దీంతో తమ కుమార్తెను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ►పాఠశాల ఆయా తప్పిదం వల్లే తమ చిన్నారి తరగతి గదిలో ఉండి పోయిందని.. పాఠశాల ముగిసిన తరువాత తరగతి గదిలో చిన్నారులు బయటకు వెళ్లారో లేదో చూసుకోకుండా తాళం వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం...రోడ్డు గుంతలకు బలైన చిన్నారి
-
నార్సింగ్: అతివేగం.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం!
సాక్షి, హైదరాబాద్: అంతా 20 ఏళ్లలోపు వాళ్లే. ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. సెలవుల్లో ఉన్నారు. సరదాగా రిసార్ట్ వెళ్లి వద్దామని బయటకు వచ్చారు. చిన్న వయస్సు కావటం.. కారు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవటం ఒకటి అయితే.. ఓవర్ స్పీడ్.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం నింపింది. నగరంలోని నార్సింగ్‌లో ఈరోజు(శుక్రవారం, మే 19) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉండగా.. అందరూ 20 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. వీరంతా నిజాంపేట్ నుంచి ఓషెన్ పార్క్‌కు వెళ్తుండగా నార్సింగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కారు.. టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి మృతిచెందాడు. ప్రసాద్ అనే కుర్రాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. నితిన్, హర్షిత, అంకిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత అక్కా చెల్లెళ్లు. అయితే యాక్సిడెంట్లో బ్రెయిన్ బయటకు రావడంతో డ్రైవర్ ప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతురాలు హర్షిత తన తండ్రి కారును తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హుషారుగా బయటకు వెళ్లొస్తామంటూ చెప్పిన తమ బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైట్ సైడ్ అక్కడికక్కడే.. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కారు ముందు సీట్లో డ్రైవింగ్ చేసిన ప్రసాద్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు కూర్చున్నారు. కారు మధ్య సీట్లో ఐదుగురు, ఆ వెనుక సీట్లో మరో నలుగురు కూర్చున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ పొజిషన్‌కు రైట్ సైడ్ కూర్చున్న నలుగురు మృతి చెందారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా ఫలితం లేకుండా పోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారులోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. దీంతో ఆ ఇంట పెను విషాదం నెలకొంది. మిగతా వాళ్లకూ త్రీవ గాయాలు అయ్యాయి. -
పెళ్లైన నెలకే మెడ కోసి..
నిజాంపేట్(హైదరాబాద్)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్ సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లా ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్ రావాలని కిరణ్ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. రక్తం మడుగులో సుధారాణి... సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్ కు వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్రూమ్ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు. అపార్ట్మెంట్లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు. బంధువుల ఆందోళన భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. -
భూవివాదంలో ఏపీ పోలీసు అధికారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : భూవివాదంలో ఏపీ పోలీసు అధికారి నాగ దుర్గా ప్రసాద్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ భూమిని వేరే మహిళను తన భార్యగా చూపి విక్రయించిన కేసులో అసిస్టెంట్ కమాండెంట్ నాగ దుర్గా ప్రసాద్(డీఎస్పీ)ను అరెస్ట్ చేశారు. తిరుపతిలో దుర్గాప్రసాద్‌ను ఎస్ఐ నర్సింహ అరెస్ట్ చేసి బాచుపల్లికి తరలించారు. మహిళ భర్తపైనా దాడి చేసినట్టు నాగప్రసాద్‌పై ఆరోపణలున్నాయి. -
అరబిందో ఫార్మాలో కార్మికుడి మృతి
బొల్లారం: నగరంలోని బాచుపల్లి సమీపంలోని అరబిందో ఫార్మాలో ఓ కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. బ్రహ్మానందం (25) అనే కార్మికుడు కంటెయినర్ శుభ్రం చేస్తుండగా అందులో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఈనెల 21న జెనిత్ మెగా టౌన్ షిప్ ప్రారంభం!
లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ నిర్మాణానికి పెట్టింది పేరైన ప్రణీత్ గ్రూప్ తొలిసారిగా బాచుపల్లిలో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టనుంది. 4 ఎకరాల్లో నిర్మించనున్న జెనిత్ ప్రాజెక్ట్‌ను ఈనెల 21న ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ♦ ఇప్పటివరకు బాచుపల్లి ప్రాంతంలో 6 విల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. వీటిలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు ఆనంద జీవనం గడుపుతున్నారు. అయితే విల్లాలో పొందే సౌకర్యాలు అపార్ట్మెంట్లోనూ అందించాలనే లక్ష్యంతో.. అది కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా జెనిత్ పేరుతో మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టాం. వచ్చే 3-4 ఏళ్లలో రూ.1,000 కోట్లతో 100-150 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ♦ జెనిత్‌లో మొత్తం 300 ఫ్లాట్లొస్తాయి. 850-1,300 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ఫ్లాట్ ప్రారంభ ధర రూ.25 లక్షలు. 9 వేల చ.అ. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయిందులో. 2017 జూన్ నుంచి దశల వారీగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ♦ ఇదే ప్రాంతంలో 50 ఎకరాల్లో ఆంటిలియా పేరుతో విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో మొత్తం 600 లగ్జరీ విల్లాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. విల్లా విస్తీర్ణాలు 120-300 గజాల మధ్య ఉంటాయి. ప్రాజెక్ట్‌లో 5 ఎకరాల స్థలం కేవలం గ్రీనరీ కోసమే వినియోగించాం. 35 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే 350 విల్లాలను విక్రయించేశాం. ఆగస్టు నుంచి ఇంటీరియర్ పనులు ప్రారంభిస్తాం. -
పన్ను లక్ష్యం.. రూ.100 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర శివార్లు, మేజర్ పంచాయతీలకే పరిమితమైన ఆస్తి పన్నును మారు మూల పల్లెల్లో కూడా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేమి ప్రధాన కారణమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని భావిం చింది. ఇందులో భాగంగా పన్నులను రాబట్టేదిశగా కార్యాచరణ రూపొందిం చింది. ఈ క్రమంలోనే జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఆస్తిపన్ను వైపు కన్నెత్తి చూడని గ్రామాల్లో కూడా పన్ను వడ్డనకు సమాయత్తమైంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నామినేషన్లు దాఖలుచేసే అభ్యర్థులు మాత్రమే పన్ను చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న పాలకులు ఆస్తిపన్ను రాబట్టేందుకు సాహసించలేదు. నిధుల కొరత పీడిస్తుండడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారడంతో జిల్లా పంచాయతీ అధికారులు పన్నుల వడ్డనే శరణ్యమని భావించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నుల మదింపుపై దృష్టి సారించారు. టార్గెట్ పెద్ద మొత్తమే! నగరీకరణతో శివారు పంచాయతీల్లో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు వెలిశాయి. బహుళ అంతస్తు భవనాలు పుట్టగొడుగులా పుట్టకొచ్చాయి. వీటిలో చాలా భవనాలు అండర్ అసెస్, అన్ అసెస్లో ఉండడంతో వీటన్నింటిపై తాజాగా జిల్లా యంత్రాంగం కన్నేసింది. ముఖ్యంగా మణికొండ, బాచుపల్లి, నిజాంపేట్, ఫీర్జాదిగూడ, చంగిచర్ల, బండ్లగూడ, శంషాబాద్, పర్వతాపూర్ తదితర గ్రామాలు భారీ జనావాసాలతో మోస్తరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. ఈ పంచాయతీల్లో పన్నులను సక్రమంగా వసూలు చేస్తే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశమేలేదని అధికారులు చెబుతున్నారు. శివారు పంచాయతీలేకాకుండా ప్రతి పల్లెలోనూ పన్ను చెల్లించే విధానాన్ని అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో నిధుల సమస్య ఉత్పన్నంకాదని భావిస్తున్నారు. ఆస్తి పన్నుసహా నల్లా, ట్రేడ్ లెసైన్సుల ఫీజులను వసూలు చేయడం ద్వారా సుమారు రూ.100 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీపీఓ పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల రూపేణా రూ.18 కోట్లు మాత్రమే రాబట్టామని, వికారాబాద్ డివిజన్లో ఆస్తి పన్ను లెక్కించడంతో అదనంగా మరో రూ.12 కోట్లు పన్ను పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. మిగతా డివిజన్లలో కూడా పన్ను మదింపు ప్రక్రియ చకచకా సాగుతోందని, ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేస్తామని, వచ్చే నెల నుంచి కొత్త పన్నుల వసూలును ప్రారంభిస్తామని చెప్పారు. కేవలం కొత్తగా పన్నులేకాదు.. పాత బకాయిలను కూడా రాబట్టాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పంచాయతీల్లో పన్ను మోతకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను వడ్డించేందుకు పంచాయతీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేవలం ఇంటిపన్నులేకాకుండా నల్లా, ట్రేడ్ లెసైన్సులను కూడా క్రమబద్ధీకరించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటివరకు పన్ను పరిధిలోకి రాని ఆస్తులను మదింపు చేస్తున్న యంత్రాంగం.. వచ్చే నెల నుంచి పన్నుల మోత మోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికారాబాద్ డివిజన్లో ఇప్పటికే టాక్సులను నిర్ధారించిన అధికారులు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెలాఖరులోపు మిగతా డివిజన్లలో కూడా ఆస్తి, ఇతర పన్నుల గణన ను పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను నవంబర్ నుంచి చేపట్టేలా ప్రణాళిక తయారుచేసిన పంచాయతీ అధికారులు.. పన్నుల రూపేణా రూ.100 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి -
యాసిడ్ బాటిల్ పేలి విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలోని గాయత్రి కళాశాలలోని స్టోర్ రూమ్ లో ప్రమాదవశాత్తూ యాసిడ్ బాటిల్ పేలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.