హరీష్‌రావుపై మరో కేసు నమోదు | Police Case Filed Against BRS Harish Rao | Sakshi
Sakshi News home page

హరీష్‌రావుపై మరో కేసు నమోదు

Published Fri, Feb 28 2025 1:26 PM | Last Updated on Fri, Feb 28 2025 4:03 PM

Police Case Filed Against BRS Harish Rao

సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుకు బిగ్‌ షాక్‌ తగిలింది. హరీష్‌రావుపై మరో కేసు నమోదైంది. చక్రధర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ీబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మరో కేసు నమోదైంది. హరీష్‌రావుపై  పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు. ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు, సంతోష్‌ కుమార్‌, పరశురాములు, వంశీకృష్ణపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ ప్రకారం.. హరీష్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా వంశీకృష్ణ, ఏ2గా హరీశ్‌రావు పేరును పోలీసులు చేర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement