harish rao
-
ఇంకెన్నిసార్లు అప్లై చేయాలి?.. ‘ప్రజాపాలన’పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,సిద్దిపేట: పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం(జనవరి22) సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. పథకాల కోసం ప్రజాపాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘సంక్షేమ పథకాలకు ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తుల పేరుతో డబ్బులు వృథా అవుతున్నాయి. దరఖాస్తులతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోంది. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామన్నారు. ఇప్పుడు అందరికీ పంగ నామాలు పెడుతున్నారు. రుణమాఫీ అయిందని రేవంత్‌రెడ్డి హైదారాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే ఇక్కడికి రా చూపెడత ఎంతమందికి కాలేదనేది. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫి చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, అబద్ధాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి నేను కూడా వస్తా. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ రుణమాఫీ చెక్ ఇచ్చావు. రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప, నీతి నిజాయితీ లేదు. రుణమాఫీపై వైట్ పెపర్ రిలీజ్ చేయాలి. ఎప్పటి లోగా చేస్తారో ఎన్ని చేయాలో చెప్పాలి. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ద్రవ్యోల్బణం పెరిగినందున రేషన్ కార్డు ఇన్‌కం లిమిట్ పెంచాలి.కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే తిరుబాటు తప్పదు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలి. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఉన్న చోట ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఫోటోలు పెట్టడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు. -
ప్రజావాణి ప్రహసనం.. ప్రజాపాలన డొల్ల: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చిన ప్రజాపాలన డొల్లగా మారి, ప్రజాపీడన జరుగుతోందని, ప్రజావాణి ఉత్త ప్రహసనంగా తేలిపోయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతీరోజూ ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రకటించి, ప్రజావాణిగా పేరు మార్చారన్నారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్(Revanth Reddy) కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణికి హాజరై.. పది నిమిషాల పాటు పాల్గొన్నారన్నారు. గాం«దీభవన్‌కు వెళ్తున్న మంత్రులకు ప్రజావాణికి వచ్చే తీరిక లేదని ఎద్దేవా చేశారు. ప్రజావాణిపై ఆర్టీఐ చట్టం కింద సేకరించిన సమాచారంలో ఈ కార్యక్రమం ప్రహసనంగా మారిన వైనం బయటపడిందన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు(Harish Rao) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజావాణిని చివరకు ఔట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగులతో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రజావాణిలో దరఖాస్తుల సమర్పణ వృథా ప్రయాస అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ (సమస్యలు) కిందకు వస్తాయని మిగతావి వాటి పరిధిలోకి రావని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే పరిష్కారం అయినట్లుగా చెపుతున్న దరఖాస్తుల్లో చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి’అని పేర్కొన్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదని హరీ‹Ùరావు విమర్శించారు. -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
ఇక మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు వస్తా!
చార్మినార్ (హైదరాబాద్): ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడం కోసమే మూసీ ప్రస్తావన తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టంచేశారు. మూసీ నదిలో దుర్భర జీవనం గడుపుతున్న నిరుపేదలను కాపాడుతూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులను చేపట్టామన్నారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కమిటీ అధ్యక్షుడు, బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆధ్వర్యంలో శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన సద్భావన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, జీవో 111ను ఉల్లంఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు. అనుమతులున్న వారిని హైడ్రా ఏమీ చేయదన్నారు. మూసీ వద్దకు రావాలని సవాల్ విసిరిన వారి కోసమే తాను మూసీ (చార్మినార్) వద్దకే వచ్చానని.. ఇక మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు వస్తానని బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కబ్జాదారులను అరికట్టడానికి హైడ్రా అంకుశం తరహాలో పని చేస్తుందన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే అన్ని వర్గాల పేదలకు అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు భావించినందునే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారన్నారు.కొంతమంది సన్నాసులు కుటుంబ పాలన అంటున్నారని.. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ముందుండడమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. కేసీఆర్ కుబుంబపాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. వారి కుటుంబం దోపిడీ మాత్రమే చేసిందని ఎద్దేవాచేశారు. అడ్డం వస్తే.. బుల్డోజర్ సిద్ధంగా ఉంది...తాము పేదలను ఆదుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అడ్డం వస్తే తొలగించడానికి ఒక బుల్డోజర్ సిద్ధంగా ఉంచానన్నారు. ‘దొంగ నాటకాలాడుతున్న బావామరు దుల డ్రామాలన్నీ చూస్తున్నా.. చెప్పులు మోసేటో ళ్లూ మాట్లాడుతున్నారు.. మీ సంగతి నాకు తెలియదా.. మీలాగ దొంగతనాలు చేయలేదు.. చేతులు కట్టుకుని నా ముందు నిలబడిన రోజులు మర్చిపోయారా’ అంటూ వ్యాఖ్యానించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే... కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లను వారే స్వయంగా కూలగొట్టుకుని పేదల వద్దకు రావాలని.. మీవి అక్రమ కట్టడాలు కావా? అని పేర్కొన్నారు.మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నార న్నారు. అనంతరం రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కలిసి మాజీ మంత్రి జె.గీతారెడ్డికి సద్భావనా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదా రులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
ఖమ్మంకు విరాళంగా నెల జీతం
-
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
జీవో 33పై పోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్న జీవో 33పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయ పోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర విద్యార్థుల స్థానికత కోసం ప్రభుత్వం కొత్తగా సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో అత్యున్నత కమిటీ వేసి వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసానిచ్చారు. జీవో 33 వల్ల తమకు జరుగుతున్న అన్యాయంపై గురువా రం హరీశ్‌రావును ఆయన నివాసంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వివరించారు. జీవో 33 నిబంధనల మేరకు తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికేతరులుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన తమ పిల్లలు ఏపీలో చదవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానికేతరులుగా మారుతున్నారన్నారు. తమ పిల్లలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు హరీశ్‌రావును కోరారు.పంచాయతీలపై ఉన్నమాట అంటే ఉలుకెందుకు..?కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తా ము ఆధారాలు, గణాంకాలతో చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడు తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ అబ ద్ధాలు చెబుతోందంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు నయాపైసా చెల్లించలేదంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ.2100 కోట్లను కూడా పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించారని పేర్కొన్నారు. రెండు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు, ఎనిమిది నెలలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు ఇవ్వలేదని, ఈ వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయస్థాయి పోరు
సాక్షి, హైదరాబాద్: పార్టీ బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని బుధవారం కేసీఆర్‌తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. -
విద్యార్థి నేతలపై పోలీసుల అణచివేత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులపై పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఒక ప్రకటనలో తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ములాఖత్‌లు జరిపారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు.ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందని చెప్పారు. కానీ ప్రస్తుతం వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ పదేపదే చెబుతూ..నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ కేలండర్ తేదీల గడువు ఇప్పటికే తీరిపోయిందని తెలిపారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంతవరకు వదలం: హరీశ్‌రావు నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్లు సాధించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తి నిరంతర పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని నిర్బంధించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరిగే అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.అరెస్టులపై బీఆర్ఎస్ ఖండనఏడు నెలలుగా నిరుద్యోగ సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్‌పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందని నిరంజన్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ అందుబాటులో లేరని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?.. తమిళిసైపై హరీష్ రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి హరీష్‌రావు సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కూడా హరీష్ ఫైరయ్యారు. ద్వంద్వ నీతి కాదా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలైంది. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా?. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?. రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో… — Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2024 -
సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్ఎస్పై దాడికి దిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పక్షాన సీనియర్ సభ్యులు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. మొదట సీఎం దాడి.. సీఎం రేవంత్ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్ఎస్లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్మెంట్ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారు కేబినెట్ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్ వ్యాఖ్యానించగా.. కేటీఆర్ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు. దీంతో.. ‘‘గవర్నర్ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్ సెటైర్ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హరీశ్‌రావుకు మైక్ నిరాకరణపై నిరసన ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్‌కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్‌రావుకు మైక్ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్ఎస్ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు. -
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఖూనీ చేశారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ముగిసిన అనతంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ సత్య దూరమైనవేననన్నారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని చెప్పి మాకు మాట్లాడే అవకాశమెందుకు ఇవ్వలేదు. మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పీవీ నరసింహారావు చనిపోతే కాంగ్రెస్ పెద్దలు కనీసం నివాళులర్పించలేదు. గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు. మాజీ సీంఎ అంజయ్యనూ కాంగ్రెస్ పార్టీ అవమానించింది’ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ‘అమరులకు ప్రతి సారి నివాళులు అర్పించిన తర్వాతే కేసిఆర్ పనులు మొదలు పెడతారు. సచివాలయం ముందు అమరుల స్థూపం బీఆర్ఎస్ కట్టింది. జై తెలంగణ అంటే కాల్చేస్తా అని గన్ను పట్టుకుని వచ్చింది రేవంత్‌రెడ్డి. యాది రెడ్డి శవాన్ని కనీసం రేవంత్‌రెడ్డి చూడలేదు. అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి. కేసులే లేవని అసెంబ్లీలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదీచదవండి..సీఎం రేవంత్‌ది పేమెంట్ కోటా:కేటీఆర్ -
కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు
సిర్పూర్(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. బీఆర్ఎస్లోని పలువురు అభ్యర్థులను ఓడించేది కూడా కేసీఆరేనని అని తీవ్ర ఆరోపణలు చేశారు. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబుకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలిస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫాంహౌస్‌లో చేసింది రాజశ్యామల యాగం కాదని.. వశీకరణ పూజలు చేశారని ఆరోపించారు. బీసీని సీఎం చేస్తామంటే ఓర్వలేకపోతున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని బండి సంజయ్ అన్నారు. కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ బీసీలను అవమానిస్తున్నడని.. వాళ్లు సీఎం పదవికి పనికిరారా.. అని ప్రశ్నించారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణీరుద్రమ శుక్రవారం నామినేషన్ వేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్రంలో లేదని అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని.. కానీ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి అవకాశమిస్తే ఎలాంటి మచ్చ లేని పేద బీసీ నాయకుడు సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ది కీలక పాత్ర: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని చెప్పారు. ఇందిరాపార్క్‌లో ఆదివారం జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగల పై ప్రధాని మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని హరీశ్ చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందన్నారు. మాదిగల పై మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ రాష్ట్రంలో 33 దళితస్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎస్సీల్లో అర్హులకు రూ.10లక్షలిచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతోనే దళితబంధు ప్రారంభించినట్లు చెప్పారు. -
తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి కావాలో అందరివాడుగా పేరొంది నిత్యం అందుబాటులో ఉంటున్న చింతా ప్రభాకర్ కావాలో నియోజకవర్గ ప్రజలు తెల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి, జహీరాబాద్‌లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎన్నికల బూత్ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గతంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగ్గారెడ్డి గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఐదు సార్లు అయినా సంగారెడ్డికి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నికల హామీల్లో గల్లికో ఏటీఎం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయారన్నారు. తిరిగి డ్రామాలు చేయడానికి కల్లబొల్లి మాటలతో వస్తాడు! జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ మౌనం వీడి, మొహమాటం పక్కన పెట్టి రంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కలిసి పోతారన్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభలో ఉన్న దాని కంటే ఎక్కువ మంది కేవలం ముఖ్యకార్యకర్తల ఈ మీటింగ్‌లోనే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని చెప్పిన ఆయనకు సంగారెడ్డి ప్రజల ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా.. రేవంత్ లాంటి రాంగ్ లీడర్లకు మద్దతు ఇవ్వొదని ఉద్ఘాటించారు. మూడోసారి సైతం కేసీఆర్ సీఎం అవుతారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ సైతం 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. నాయకులు బాగా పని చేయాలి! ఈసారి కార్యకర్తలు, నాయకులు బాగా పని చేసి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్న విశ్రాంతి లేకుండా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన మంచి నాయకుడన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతే గోసపడేది ప్రజలేనన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. బీజేపీ డకౌటయితే కాంగ్రెస్ ఇట్ వికెట్ గా నిలిచిపోతుందని చెప్పారు. సంగారెడ్డికి రూ. 570 కోట్లతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లతో సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజలే నా బలం నా బలగం అన్నారు. తామే అభ్యర్థిగా భావించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్టీకి 75 పైగా సీట్లు వస్తాయని, అన్నీ సర్వేలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవి గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్ కట్ అవుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఇటీవల తాండూర్ సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారని, తెలంగాణలో 24 గంటల సరఫరా ఉందన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రైతు బంధు బంద్ చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు అడ్డా కూలీలని, బీరుబిర్యానీలకు అమ్ముడుపోతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానపరిచారన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎంత గర్వమో ప్రజలు ఆలోచించాలన్నారు. సమావేశాల్లో ఎంపీ.బీబీపాటిల్, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ పట్నం మాణిక్యం, డీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, విజేందర్‌రెడ్డి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేవిప్రసాద్, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్! -
ట్రిక్కులెన్ని చేసినా.. హ్యాట్రిక్ తప్పదు! : మంత్రి హరీశ్ రావు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ పార్టీ ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ తప్పదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని లక్ష్మీనగర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు మన భవిష్యత్‌కు ముఖ్యమైనవని, అందరూ కలసి పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో జిమ్మిక్కులు చేస్తాయని ఆగం కావొద్దన్నారు. హైదరాబాద్ నుంచి బెంజి కారుల్లో వచ్చే వారు మెదక్ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. రైతుబంధు భిక్షం వేస్తున్నామన్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ను గెలిపించాలని, మోసపోతే గోస పడతామన్నారు. పద్మాదేవెందర్రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ బేగరి యాదయ్య, 4వ వార్డు సభ్యుడు పుట్టి నర్సింలు, ఇతర నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు! నార్సింగ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. కాళేశ్వరం లేకపోతే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట తెలంగాణలో పండేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, నార్సింగ్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాల తరలింపు ఉత్తిమాటే.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల పరిధిలోని కూచన్‌పల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మేలు జరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు. మెదక్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారన్న ఆరోపణలు సరికాదన్నారు. మరో నాలుగు కార్యాలయాలను తీసుకువస్తాం తప్ప ఇక్కడి నుంచి కార్యాలయాలను తరలించడం లేదన్నారు. సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: 'పొరపాటు చేస్తే పదవికే ఎసరు?' తస్మాత్ జాగ్రత్త..! -
TS Election 2023: 'కార్యకర్తలను కాపాడుకుంటా..' : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, మెదక్: కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను, వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం నర్సాపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించేందుకు అందరూ కష్టపడి పని చేయాలని, ఎలాంటి అపోహలకు పోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. వారంతా సునీతారెడ్డిని గెలిపిస్తే తాను మదన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యతలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సునీతారెడ్డిని గెలిపిస్తే ఏడాదికి మూడు కోట్ల నిధులు వస్తాయని, మదన్‌రెడ్డికి ఎంపీ అవకాశం వస్తే ఏడాదికి మరో రూ.ఐదు కోట్ల ఎంపీల్యాడ్స్ ఉంటాయని అప్పుడు అభివృద్ధికి డోకా ఉండదని మంత్రి హరీశ్ చెప్పారు. అనంతరం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ, పెంచిన పింఛన్, సౌభాగ్యలక్ష్మి, సన్న బియ్యం పంపిణీ, బీమా పథకాల గురించి మంత్రి వివరించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని, బీఆర్ఎస్ చేసే అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి నమ్మాలని ఆయన కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరాంరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా మంత్రి హరీశ్‌రావును యాదవ సంఘం నాయకులు గొర్రె పిల్లతో సన్మానించారు. ఇవి చదవండి: 'కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి..' : ఎంపీ బండి సంజయ్ -
మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి : మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి: ‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులు.. ఎక్కడ ఉన్నా మీ గురించే ఆలోచన చేస్తుంటా.. ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది.. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపన.. ఎల్లప్పుడూ మీ ప్రేమ, ఆశీర్వాదం ఉండాలనే కోరుతుంటా..’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక కొండ భూదేవి గార్డెన్లో 400 మంది బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం రూ.లక్ష చెక్కులను, 400 మందికి గృహ లక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలను, చిన్నకోడూరు మండల జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు, కుల సంఘాలకు భవన నిర్మాణ నిధుల మంజూరు ప్రొసీడింగ్ లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడిచ్చిన శక్తిని మీ సేవ కోసం నిరంతరం ధారపోస్తానని అన్నారు. రోజూ18 గంటల పాటు శ్రమిస్తున్నానని, సిద్దిపేట ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడుతునట్లు తెలిపారు. ఒకప్పటి సిద్దిపేటకు ఇప్పుడు చూస్తున్న పట్టణానికి చాలా తేడా ఉందని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పారు. సిద్దిపేట రాష్టానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. మీరు ఇచ్చిన బలంతో సిద్దిపేట గౌరవాన్ని ఇనుమడింపజేసేలా చేసినట్లు చెప్పారు. అంతకుముందు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ అత్యధికంగా బీసీ రుణాలు అందించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాహబ్ సిద్దిపేట సిద్దిపేటను అన్ని క్రీడలకు నెలవుగా మార్చి క్రీడా హబ్‌గా చేసుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక స్టేడియంలో ఇండోర్ బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ కోర్టులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.11కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ ఆడి సందడి చేశారు. అనంతరం వాలీబాల్ అకాడమీ లో అడ్మిషన్లు పొందిన క్రీడాకారులకు పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సాయిరాం, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు -
వైద్య విద్యకు శ్రీకారం.. 30 ఎకరాల్లో.. రూ.180 కోట్లు
మెదక్: మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా త్వరలో వైద్య విద్యకు కేరాఫ్‌గా మారనుంది. స్పెషలిస్ట్‌లు లేక అత్యవసర వైద్యం కోసం ఇంతకాలం ఇతర ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజల కష్టాలు తప్పనున్నాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగా అందనుంది. గత నెలలో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావటంతో ఈ నెల 5న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కళాశాల పనులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 400 బెడ్స్ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, బెడ్స్, వైద్యుల నియామకం చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రస్తుతం మెదక్లోఉన్న మాతా, శిశు ఆస్పత్రి పక్కనే 30 ఎకరాల్లో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయించిన అధికారులు మెడికల్ కళాశాలతో పాటు వసతి గృహం పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం మెడికల్ కళాశాలకు భవనంతో పాటు 400 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌లో 150 బెడ్స్ ఉండగా క్రిటికల్ కేర్ కోసం మరో 100 పడకల ఆస్పత్రితో పాటు జిల్లా ఆస్పత్రిలో 250 బెడ్స్‌తో ఉండాలి. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా మరో 50 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటైతే అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటవుతున్న మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్ కృషితో.. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో మెడికల్ కళాశాల మంజూరైంది. వచ్చే ఏడాదిలో 100 మంది మెడికోలతో తరగతులు ప్రారంభిస్తాం. కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ అన్ని రకాల వైద్యసేవలు.. మెడికల్ కాళాశాల ఏర్పాటుతో అన్నిరకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుతాయి. వైద్యం రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. – చందూనాయక్, డీఎంహెచ్ఓ, మెదక్ -
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్‌రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
మన డాక్టర్లు.. దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏటా పది వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుందని.. ఇది భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి ఉండటానికి తెల్లరక్త కణాలు ఏ విధంగా పనిచేస్తయో.. తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశానికి రక్షగా నిలుస్తారని చెప్పారు. రాష్ట్ర వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచేలా పురోగమించడం మనకు గర్వకారణమన్నారు. శుక్రవారం కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కలిపి మొత్తం 9 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. రాష్ట్ర వైద్య రంగ చరిత్రలో చారిత్రక ఘట్టం ఇది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యానికి చేరువయ్యాం. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని ఎకసెక్కాలు పలికిన వారి సమయంలో తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 26కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మరో 8 వైద్య కాలేజీలను ప్రారంభించుకోనున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటాయి. వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఒక్క కాలేజీ కూడా లేని ఉమ్మడి నల్గొండలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేసి మెడికల్ కాలేజీలను స్థాపించుకున్నాం. హరీశ్‌రావు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డైనమిక్‌గా పనిచేస్తున్నారు. మంచి విజయాలు సాధించారు. ఏటా పది వేల మంది డాక్టర్లు.. తెలంగాణలో 2014లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 8,515కు చేరుకున్నాయి. ఇందులో 85శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు చేపట్టాం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి ఎదుగుతున్నాం. వారు రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ సేవలు అందిస్తారు. ప్రజలకు మంచి వైద్య సేవలు కూడా.. దేశంలోనే అత్యధికంగా ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రం మనదే. 34 వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే 34 పెద్దాస్పత్రులలో వేలాది పడకలతో పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు పెడుతున్నాం. 2014లో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 17వేల పడకలుంటే.. ఇప్పుడు 34 వేలకు పెరిగాయి. మరో 6 ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ బ్యానర్ కింద నాలుగు ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. నిమ్స్‌ను విస్తరిస్తున్నాం. మొత్తంగా బెడ్ల సంఖ్యను 50వేలకు పెంచుకుంటున్నాం. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు మొత్తం 50వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో మానవీయ పాలన తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతోంది. అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి గోండు గూడాలు, ఆదివాసీ, బంజారా తండాలు, మారుమూల ప్రాంతాల్లోని గర్భవతులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ప్రసవం అయ్యాక తిరిగి ఇంటివద్ద దింపుతున్నాం. తల్లీపిల్లల కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను అమలు చేస్తున్నాం. వైద్య వృత్తి పవిత్రమైనది. తెలంగాణ వైద్యులంటే గొప్ప పేరు రావాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి..’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే తొలిసారి: హరీశ్‌రావు ఒక రాష్ట్రం ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని.. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సుదినమని చెప్పారు. గత ఏడాది ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఈసారి మన రికార్డును మనమే అధిగమించామని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో ఒక్క తెలంగాణ వాటానే 43 శాతమని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కాగా.. సీఎం కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల్లో కాలేజీల వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ -
వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్
నిర్మల్: తెలంగాణ అంతటా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలున్నాయని.. భవిష్యత్‌లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో అరుదైన ఘట్టం.. జిల్లా వైద్యరంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్‌గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ చేతుల మీదుగానే నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలు.. జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. సంతోషంగా ఉంది.. మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్, నిర్మల్ అమ్మ కల నిజం చేస్తా.. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్.భానుతేజ, నిర్మల్ నేను చదువుకోలేకపోయినా.. నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్ కావాలన్నదే నా కోరిక. – విజయ్‌కుమార్, ఆదిలాబాద్, విద్యార్థి తండ్రి మంచి డాక్టర్‌గా ఎదుగుతా.. ఎంతో కష్టపడితేనే నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్‌గా ఎదుగుతా. – సమ్మిత్, ఆదిలాబాద్ సైకియాట్రిస్ట్‌ను అవుతా.. తెలంగాణలో మెడికల్ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్‌ను అవుతా. డాక్టర్ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్ చాలా దగ్గరగా ఉంది.. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనుకుంటున్నాను. – మహిన్, ఆర్మూర్ అక్కలాగే కావాలని.. మా అక్కయ్య వికారాబాద్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్, భైంసా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, నాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి, పాకాల రాంచందర్, అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
TS Election 2023: టికెట్ పోరు..‘నర్సాపూర్’పై కొనసాగుతున్న ఉత్కంఠ!
మెదక్: బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్ ఒకటెండ్రోజుల్లో వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం మెదక్‌లో ప్రగతి శంఖారావం బహిరంగ సభ జరిగిన మరుసటిరోజైన గురువారమే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్ తరలివెళ్లి హరీశ్‌రావును కలిశారు. టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలని మంత్రి నివాసం ముందు అనుచరులు బైఠాయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక శాఖ మంత్రి సముదాయించి పంపారు. ఇప్పటికే ఇద్దరితో మాట్లాడిన అధినేత మెదక్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభ వేదికపై కేసీఆర్, మదన్‌రెడ్డితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన అడిగిన వెంటనే నర్సాపూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి కూడా గురువారం మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశా రు. ఈనెల 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రక టించక ముందే వీరిద్దరితో నర్సాపూర్ టిక్కెట్ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పార్టీ వ్యవహారాలు.. ప్రగతి శంఖారావం బహిరంగ సభకు కార్యకర్తలు, అనుచరులను తరలించే ప్రక్రియను మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు చేపట్టారు. ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీరితో చర్చించారు. అయితే బహిరంగ సభకు ముందు.. ఈనెల 14న మెదక్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరూ హాజరుకావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడే అభ్యర్థిత్వంపై కొంతమేరకు సంకేతాలు అందడంతోనే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠ, రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. -
సిద్ధిపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన హరీశ్
-
కేసీఆర్‌ను తిట్టుడే పనిగా పెట్టుకున్నారా?: మంత్రి హరీష్ ఫైర్
సాక్షి, మెదక్: ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు సీరియస్ అయ్యారు. వీరంతా ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని తిడుతున్నారని విమర్శించారు. ఎవరు తెలంగాణకు వచ్చినా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి హరీష్ రావు శనివారం మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్‌ను తిడుతున్నారు. మొన్న రాహుల్ వచ్చినా, ఈరోజు మోదీ వచ్చినా తిట్టుడే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారు. మోదీ ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టింది. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతీ పథకం పేరును మార్చి కాపీ కొట్టారు. మేము మంచిగా పనిచేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు. కేసీఆర్ గొప్పతనం, పనితీరు వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అంటున్నారు. మీరు డబ్బులు ఇవ్వలేదు. మాకు రావాల్సిన నిధులు ఆపారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే.. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి. నీతి ఆయోగ్ చెప్పినా నిధులు ఇవ్వలేదు. బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని 21వేల కోట్లు ఆపింది మీరే. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మాపై బురదజల్లడం తప్ప మీరు చేసేందేమీ లేదు. ఏమన్నా అంటే ఈడీని ఉపయోగిస్తారు. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు. కానీ.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్ కొత్త నాటకాలు మొదలెట్టారు: ప్రధాని మోదీ -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
-
తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 13 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగానీ కేంద్రం రూపాయి ఇవ్వలేదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్ఎంసీ అటానమస్ బాడీ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు. -
నాకు ఎన్ని మార్కులు వేస్తారు అంటున్న హరీష్
-
తెలంగాణను నాశనం చేశారు..వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి.?
-
హరీష్‌పై మంత్రి కారుమూరి కౌంటర్.. మీరు ఏం చేశారో తెలియదా?
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. హరీష్ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని(తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు.. ఏపీకి రా ఏం జరుగుతుందో చూపిస్తాను. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్.. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. హరీష్ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలి అని హితవు పలికారు. ఇక, అంతకుముందు హరీష్ రావు.. ఏపీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. దీంతో, హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. -
Fasal Bima Yojana: బండిసంజయ్ వ్యాఖ్యలకు హరీశ్‌రావు గట్టి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హారీశ్ రావు.. అసలు ముందు ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా? అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..వాస్తవానికి దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమరే చెప్పారు. దీనిని బట్టే అర్థం కావాలి అసలు ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని.అయినా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు సుమారు రూ. 10 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్ మరోసారి రైతు బిడ్డనని నిరూపించుకున్నారు. కానీ బీజేపీ నేతలకు ఇది చాలా చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. అయినా దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్న ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ మండిపడ్డారు. అయినా బీజేపీ నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, అదాని ఆదాయాన్ని డబుల్ చేశారంటూ విరుచుకుపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ..నల్ల చట్టాలను తెచ్చి రైతులను బలి చేసిన చరిత్రే మీది అని విమర్శల గుప్పించారు. (చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు: కాంగ్రెస్ శ్రేణుల స్పందన.. నియంతృత్వ చర్యన్న ఖర్గే) -
కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ కీలక భేటీ
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, అనుసరించాల్సిన వ్యూహాల సమీక్ష రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులపై చర్చ జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ, ఇతర అంశాలపైనా సమాలోచనలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన మంత్రులు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులు తమ రోజువారీ కార్యకలాపాలను రద్దు చేసుకొని మరీ సీఎంతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కావడం గమనార్హం. హరీశ్‌రావు తన ఆదిలాబాద్ జిల్లా పర్యటనను రద్దు చేసుకొని ప్రగతిభవన్‌కు రాగా.. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అభివృద్ధి పనులు, ప్రచారంలో దూకుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల భేటీలో జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల తీరుతెన్నులపై చర్చించిన సీఎం కేసీఆర్.. విస్తృత ప్రచారం ద్వారా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించినట్టు సమాచారం. జిల్లాల్లో ఇంకా ప్రారంభంకాని కొత్త కలెక్టరేట్లకు ముహూర్తాలు పెట్టుకోవాలని, ఆయా నియోజకవర్గాల్లో పూర్తిచేసిన పనులపై విస్తృత ప్రచారం చేసుకునేలా ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయాలని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాల తీరును సమీక్షించి.. ఆయా చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్ధేశం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు చేపట్టిన కార్యక్రమాలపైనా ముగ్గురు నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను విస్తరించే క్రమంలో అనుసరిస్తున్న వ్యూహాలపైనా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చర్చించినట్టు తెలిసింది. ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను çపరిశీలించడంతోపాటు జాతీయ మీడియాతో సమావేశం అయ్యేందుకు ఒకట్రెండు రోజుల్లో సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ పనుల పరిశీలన కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలలో కలసి వచ్చే పారీ్టల నేతలతో సమావేశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. -
రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తా: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు కౌంటర్ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చి చూశారంటున్నారు కానీ.. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. విదేశీ వాళ్లకు అనుమతి ఇస్తారు కానీ మాకు అనుమతివ్వరని భట్టి మండిపడ్డారు. అసెంబ్లీలో తమ మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే.. మీరు మరొకటి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్ చేయించామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు బిడ్డలు ఎందుకు వలస పోయారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 7 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. పాలమూరు గోస తీర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 3 వేల 600 కోట్లు ఖర్చు పెట్టి 5 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. తాము కట్టిన ప్రజెక్టుల వల్లే నీళ్లు వచ్చాయన్నారు. చదవండి: ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్.. అసౌకర్యంపై స్పందన -
జేపీ నడ్డా అప్డేట్ కావాలి : మంత్రి హరీష్ రావు
-
దేశంలో ప్రతిపక్షాల్లేకుండా చేసే కుట్ర
నాంపల్లి: కేంద్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టి దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకుందని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రోబోటిక్ సహా 8 మాడ్యులర్ థియేటర్లు, అధునాతన దోబీ ఘాట్, కిచెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణితో బీజేపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, జార్ఖండ్‌లలో బీజేపీ నిర్వాహకాన్ని అందరూ చూశారన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనలను చూస్తుంటే నిఘా సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నీళ్లు పారించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంటే... మత కలహాలు సృష్టించి రక్తం పారించాలని బీజేపీ చూస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రూ.30 కోట్లతో మాడ్యులర్ థియేటర్లు... ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రూ.30 కోట్లతో ఏడు మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. పీజీ విద్యార్థుల కోసం రూ. 4 కోట్లతో మౌలికవసతులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. మరో 350 పడకలతో అధునాతన భవనం నిర్మాణ దశలో ఉందని.. ఈ నిర్మాణం పూర్తయితే మొత్తం 750 పడకల ఆసుపత్రిగా ఎంఎన్‌జే ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. అధునాతన బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. రూ. 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. దేశంలో తొలిసారి ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. -
పది జిల్లాలకు జల ప్రసాదం: మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక టౌన్: ‘దేశ చరిత్రలోనే లేనివిధంగా నదిలేని చోట నిర్మించిన పెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్. నదికే నడక నేర్పి తానే స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి డిజైన్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్..’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సహజంగా ప్రాజెక్టులు నదికి అడ్డంగా కడతారని.. కానీ నదిలేని చోట సముద్ర మట్టానికి 667 మీటర్ల ఎత్తులో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ నిర్మించిన కారణ జన్ముడు అని కొనియాడారు. మల్లన్నగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మండుటెండల్లోనూ మత్తడులు దునికించారు మల్లన్నదేవుడు పుట్టినరోజునే ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రాజెక్టు ఆపాలని కోర్టులో వేసిన కేసులు కొట్టివేయడం కూడా ఇదే తేదీన కావడం గమనార్హమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ నడిగడ్డపై మల్లన్నసాగర్ నిర్మించడంతో సగం తెలంగాణలో శాశ్వతంగా కరువు అనేదే ఉండదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వానాకాలం కూడా ఎండాకాలం లాగానే ఉండేదని, గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎండాకాలం కూడా వానా కాలమైందన్నారు. మండు టెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు మత్తడిలు దునికించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రసమయి బాలకిషన్, సతీష్ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, చిట్టి దేవేందర్‌రెడ్డి, ఈఎన్సీ హరేరాం, కలెక్టర్ హనుమంతరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ‘అధ్యయనాలు’ కీలకం
సనత్‌నగర్: ప్రజల సమగ్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పాలకులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోగతి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ప్రాంగణంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిరి్మంచనున్న బాలికల వసతి గృహం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఆర్థిక, సామాజిక అధ్యయనాలు లేకుండా రాష్ట్రాల పురోగతికి అడుగులు ముందుకుపడవన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఆ బడ్జెట్ రాష్ట్రాలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది.. రాష్ట్రాలు ఆ బడ్జెట్ నుంచి ఏవిధంగా నిధులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.. సామాజిక, ఆర్థిక అవసరాలకు ఏమేర నిధులను ఉపయోగించుకోవచ్చో సెస్ వేదికగా విశ్లేషణలు జరగాలన్నారు. ఆర్థిక, సామాజిక అంశాలపై విస్తృతంగా అధ్యయనాలు జరిపి పాలకులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న సెస్ మరింతగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యూనివర్సిటీతో కలిసి ఇక్కడ నిర్వహిస్తున్న పీహెచ్డీ కోర్సులో జాతీయ స్థాయిలో విద్యార్ధులు చేరుతున్నారని, ఈ నేపథ్యంలో వారు వసతికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రూ.5 కోట్లతో ఇక్కడ బాలికల వసతి గృహం ఏర్పాటుచేసుకోవడం జరుగుతుందన్నారు. సెస్ డైరెక్టర్ రేవతి మాట్లాడుతూ 2016 నుంచి ఇక్కడ పీహెచ్డీ కోర్సును నిర్వహిస్తున్నారన్నారు. -
సహజ ప్రసవాలు పెంచండి
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మహీంద్ర ఆధ్వర్యంలో రూ.1.05 కోట్లతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటివరకు 86 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కోసం నానాకష్టాలు పడాల్సి వచ్చిందని, ఇది గమనించిన సీఎం కేసీఆర్ 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించార న్నారు. ప్రస్తుతం 350 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నామని, మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజ న్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటుచేసేం దుకు అగ్రిమెంట్ చేసుకున్నా మన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోని 27 వేల పడక లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండబోదని చెప్పారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయని, ప్రస్తుతం 52 శాతం డెలివ రీలు జరుగుతున్నాయని, దీనిని 75 శాతానికి పెం చాలని వైద్యులకు సూచించారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంత రం హోతి(బి) గ్రామంలో మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ ఫాతిహా చాహేలుమ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు తన్వీర్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. -
Dalit Bandhu: దేశమంతా దళితబంధు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో దళితబంధుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై సన్నాహక సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను ఆదర్శంగా తీసుకున్న కేంద్రం.. హర్‌ఘర్ జల్, కిసాన్ సమ్మాన్ యోజన వంటి వాటిని తెచ్చిందని, అలాగే దళితబంధును కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. నిధులు తేలేరుగానీ.. విమర్శలా.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్‌తోపాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు కేంద్రం నుంచి నిధులు తేవడం చేతగాదుగానీ.. పేదల కోసం ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రం వచ్చని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీలకు చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి జిల్లాకొక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించాలని, ట్రైబల్, మైనింగ్ యూనివర్సిటీలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఎల్ఐసీ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిపై విమర్శలు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును కూడా హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీల కోసం పదేళ్లలో రూ.6,995 కోట్లు కేటాయిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 134 ఉంటే.. వాటిని 268కి పెంచామన్నారు. 53 ఎస్సీ రెసిడెన్షియల్ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేశామని వివరించారు. నిరుపేద చిన్నారులకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించేందుకు రూ.7,280 కోట్లతో మనఊరు–మనబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉలికిపాటుపడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొండాపురం శివకుమార్ పాల్గొన్నారు. -
Political Corridor: హుజురాబాద్‌లో నువ్వా నేనా అంటూ హాట్ హాట్ గా పాలిటిక్స్
-
కొడుకును సీఎం చేయడానికే నన్ను పక్కకు తోశారు: ఈటల
ఇల్లందకుంట / వీణవంక (హుజూరాబాద్): కొడుకు(కేటీఆర్)ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఉన్నవారికి దళితబంధు ఇవ్వబోమని అంటున్నారంటా.. మిస్టర్ సీఎం.. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు. చదవండి: బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు తెలంగాణ డబ్బులకు ఓనర్లు ప్రజలే.. అడ్డగోలుగా మాట్లాడితే ప్రళయం సృష్టిస్తం.. జాగ్రత్త’అని హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఖర్చు చేసిన డబ్బులు కేసీఆర్ కుటుంబం కూలీకి పోయి సంపాందించినవా అని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీణవంక మండలంలోని మల్లన్నపల్లిలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొర్ల మందల మీద పిచ్చి కుక్కలు, తోడేళ్లు దాడి చేసినట్లు.. తాను ఏ పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే. -
హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: హరీశ్ రావు
-
దళితబంధు అందరికీ ఇవ్వాలి
హుజూరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేస్తున్నారని.. ఒకేసారి అందరికీ వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఆందోళనలకు దిగారు. శనివారం పలుచోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. అధికార పార్టీకి చెందినవారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో హుజూరాబాద్ సహా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనలు విరమింపజేశారు. హుజూరాబాద్ పట్టణంలో.. దళితులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోతిరెడ్డిపేట, ఇప్పల్‌నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన దళితులు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందినవారు పరకాల క్రాస్‌రోడ్డు వద్ద.. కందుగుల గ్రామ ఎస్సీ కాలనీకి చెందినవారు పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. అనర్హులను ‘దళితబంధు’ పథకానికి ఎంపిక చేశారని మండిపడ్డారు. వారిని ఏ అర్హత ప్రకారం ఎంపిక చేశారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి వచ్చి ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దళితులు వెనక్కి తగ్గలేదు. అర్హులను వదిలేసి అనర్హులను ఏ విధంగా ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళనతో హుజూరాబాద్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. జమ్మికుంట, ఇల్లందకుంటల్లోనూ.. ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారికే పథ కం వచ్చేలా చేస్తున్నారంటూ తహసీల్దార్ సురేఖతో వాదన కు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఫోన్లో వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ఇక కనగర్తి గ్రామంలో దళితులు రోడ్డుపై బైఠాయించారు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలోనూ దళితులు ఆందోళన చేశారు. కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఫోన్.. దళితుల ఆందోళనల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కర్ణన్, రాజీవ్‌గాంధీ హనుమంతులతో ఫోన్లో మాట్లాడారు. పథకం కోసం ఎంపిక చేస్తున్న దళితుల వివరా లు, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా, అపోహలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని ఆదేశించారు. -
తెలంగాణకు కోటా పెంచుతాం!: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బుధవారం రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రగతిభవన్ నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా తొలివేవ్‌తో పోలిస్తే రెండో వేవ్ నాటికి రాష్ట్రంలో వైద్య సదుపాయాలను ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు. కరోనా చికిత్స బెడ్లను 18,232 నుంచి 53,775కు, ఆక్సిజన్ బెడ్లను 9,213 నుంచి 20,738కు, ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు పెంచామని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 27,039 బృందాలు ఇంటింటికీS తిరిగి సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. 60 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించామని, ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల రోగులను పరిగణనలోకి తీసుకోవాలి... తెలంగాణ మెడికల్ హబ్ కావడంతో చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి చికిత్స పొందుతుండటంతో కోవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తోందని హరీశ్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులకు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా కేసులను కలుపుకొని బెడ్ల సంఖ్య ఆధారంగా ఆక్సిజన్, మందులు, ఇతర కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మందుల కొరత పెరగడానికి లెక్కల్లో ఈ తేడాలే ప్రధాన కారణమన్నారు. ఆక్సిజన్ కేటాయింపులను 450 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా, దగ్గరలోని ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. కేసీఆర్ ఇప్పటికే కోరిన విధంగా 20 వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. టోసిలీ జుమాబ్ ఇంజెక్షన్లను 810 నుంచి 1,500కు పెంచాలని, రోజుకు 2లక్షల టెస్టింగ్ కిట్లను సరఫరా చేయాలని కోరారు. మొదటి డోస్ కోసం 96 లక్షల వ్యాక్సిన్లు, రెండో డోస్ పూర్తికి 33 లక్షల వ్యాక్సిన్లు కలిపి మొత్తం కోటి 29 లక్షల వ్యాక్సిన్లు అవసరమని తెలిపారు. ఈనెలాఖరులోగా 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 3 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కలిపి మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణంగా కావాలని, ఈ మేరకు రాష్ట్రానికి సరఫరా చేయాలన్నారు. 2వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి కావాలని, తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్ పాల్గొన్నారు. -
సిద్దిపేటలో ‘త్రీ టౌన్’
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రం సిద్దిపేటలో వన్ టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటకు ఈ స్టేషన్‌ను మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, సిద్దిపేట పరిధిలో పెరిగిన జనాభా దృష్ట్యా సిద్దిపేటకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత డిసెంబర్లో సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేట జనభా పెరగడం, కరీంనగర్ వైపు వెళ్లే రాజీవ్ రహదారిలో సుమారు 90 కిలోమీటర్ల మేర ఒక్క పోలీస్ స్టేషన్ లేదని, సిద్దిపేటకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని మంత్రి హరీశ్ సీఎం కేసీఆర్‌ను కోరారు. దీంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ ధన్యావాదాలు తెలిపారు. సుడా పరిధి దుద్దెడ వరకు ఉండటం, నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఐటీ టవర్, ఇండస్ట్రియల్ హబ్, రైల్వే స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో పట్టణ గ్రామాలు ఉండటం, దుద్దెడ గ్రామానికి చెందిన వారు కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, ఏసీపీని కలవడానికి గజ్వేల్‌కు వెళ్లడానికి ఇబ్బందులు పడేవారని, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ఆ బాధలన్నీ తప్పనున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పీఎస్‌లోకి వచ్చే గ్రామాలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న గ్రామాలు రంగదాంపల్లి, మిట్టపల్లి, ఎల్లుపల్లి, బక్రిచెప్యాల, నాంచారుపల్లి ఎన్సాన్పల్లి, పొన్నాల, కిష్టసాగర్, తడ్కపల్లి, బొగ్గులోనిబండ, రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్కటూర్ గ్రామం, కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్దెడ, దర్గా బందారం, అంకిరెడ్డిపల్లి, దోమలపల్లి, తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మంపల్లి, రాంపల్లి, సిరిసినగండ్ల, మర్పడగ గ్రామాలు, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, సురభి మెడికల్ కళాశాల ట్రీ టౌన్ పీస్ పరిధిలోకి రానున్నాయి. తాత్కాలిక భవనంలో ప్రారంభం నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పొన్నాల, బక్రిచెప్యాల మధ్యలో రాజీవ్ రహదారిపై తాత్కాలిక భవనంలో మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అదేవిధంగా పక్కా భవనం నిర్మించేలా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉండేవిధంగా స్థల సేకరణ చేపట్టాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మంత్రి ఆదేశించారు. 57 మంది సిబ్బంది నూతనంగా ఏర్పడనున్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్ఐలు, ఆ రుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్ల తో పాటు మొత్తం 57 మంది సిబ్బందితో ప్రజలు సేవలు అందించనున్నారు. దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, తొగుట, కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు సే వలు మరింత దగ్గరగా అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు మరింత రక్షణ సిద్దిపేటకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు కావడం సంతోషంగా ఉంది. ఇప్పటికే వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ప్రజలకు మరింత రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందనున్నాయి. – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి -
చిన్నాచితక పార్టీలు మాకు పోటీ కావు!
సాక్షి, వికారాబాద్ : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణి దేవిని అభ్యర్థిగా ప్రకటించటంతోటే తమ గెలుపు ఖాయమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులే పోటీ.. చిన్నాచితక పార్టీలు తమకు పోటీ కావని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వికారాబాద్‌లో బీజేపీ వాళ్లు ఎక్కువ, తక్కువ మాట్లాడితే.. బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటకలోని చించోళి చౌరస్తాలో చర్చపెట్టాలే. తెలంగాణ పథకాలు కేంద్ర మంత్రులు బాగున్నయంటే.. గల్లీ లీడర్లు బాలేవంటరు. కేవలం గ్లోబల్ ప్రచారం, బోగస్ ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నరు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లు తీసేయాలని చూస్తుంది. ప్రశ్నించే గొంతుక అంటుంటారు.. ఎవరిని ప్రశ్నిస్తారు? గ్యాస్, పెట్రోల్,డీజీల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?.. చూపించి మాట్లాడాలే. పార్టీ కన్నతల్లి లాంటిది... నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తల్లికి ద్రోహం చేసినట్లే. ఎంతో మంది గ్లాడియేటర్లను తయారు చేసిన ఘనత మన అభ్యర్థి వాణీ దేవిది. ఆమె దేశ ప్రధాని కూతురైనా సాధాసిదాగా జీవితం గడిపింది. వికారాబాద్ జిల్లా ఏర్పడడానికి కారణం కేసీఆర్. ఒకటో...రెండో సీట్లు ఓడిపోతే ఏదేదో మాట్లాడుతుండ్రు, పనైపోయిందంటుండ్రు.. మా పనైపోలే. కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడే ఏమీ చేయలే.. గిప్పుడేమి చేస్తారు’’ అని అన్నారు. చదవండి : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. తలసాని సవాల్ -
మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అభివద్ధి చూసి తాము ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు పేర్కొనడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకు నియోజకవర్గంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. జిల్లాలోని రాయపోలు మండలం దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామస్తులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మాణ పత్రాన్ని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మంత్రికి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయత జీవితంలో మర్చిపోను అన్నారు. వర్షంలో సైతం మహిళలు, వృద్ధులు, యువకులు అంతా కలిసి ఆదరించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నన్నారు. కేసీర్ కృషి వల్ల కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే సీఎం ధ్యేయమన్నారు. (చదవండి: రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్) 4 గంటలే ఉచితంగా కరెంట్ ఇస్తూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేద్దామని, వ్యవసాయానికి మీటరు పెట్టి బిల్లులు వసూలు చేసే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు రైతుబందు ద్వారా ఎకరాకు 5 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించి, రైతు భీమా ద్వారా అకాల మరణం చెందిన కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిందన్నారు. వితంతువులకు, వృద్దులకు, బీడీ కార్మికులకు, వివిధ రకాల కుల వృత్తుల వారికి కూడా పెన్షన్లు కలిపిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘కొండపోచమ్మ’ ప్రారంభానికి ప్రజలు రావొద్దు
సాక్షి, గజ్వేల్: కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ‘ఇది మనమందరం జరుపుకోవాల్సిన జలపండుగ. కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదు. శుక్రవారం ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు. తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చు’ అని తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రారంభోత్సవానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
‘ఆ అపవాదును తెలంగాణ చెరిపేసింది’
సాక్షి,సిద్ధిపేట: సిద్దిపేటను గోదావరి జలాలు ముద్దాడాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను శుక్రవారం మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ టన్నెల్ పంపు సెట్ స్వీచ్ ఆన్ చేసి రంగనాయక సాగర్‌లోకి నీళ్లను వదిలారు. రిజర్వాయర్‌లోకి నీళ్లు రాగానే మంత్రులు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ....‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత ఆనందపడ్డానో అంత ఆనందంగా ఉంది. సిద్దిపేటకు గోదావరి నీళ్లు అనేది దశాబ్దాల కల. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికి దారి చూపింది. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల నిర్మాణం అన్న దశ నుంచి రెండు, మూడు ఏళ్ళల్లోనే నిర్మించవచ్చని తెలంగాణ చూపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన కూలీలను మేము మర్చిపోలేం. ఈ ప్రాంతం ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, వలసల జిల్లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు పంటలు పండించుకోవచ్చు. నాడు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, నేడు గోదావరి జలాలతో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే మధురానుభూతి మరొకటి లేదు’ అని పేర్కొన్నారు. (‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’) అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణం చేపట్టాల్సిందిగా, ఐటి హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను హరీష్‌రావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘ఒక చిరస్మరనీయమైన ఘట్టంలో భాగస్వాములమయ్యే భాగ్యం మాకు లభించింది. సిద్దిపేట ప్రజలు ధన్యజీవులు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే దశాబ్దాల పాటు నిర్మించేవన్న అపవాదును పారద్రోలుతూ.. కాలంతో పోటీ పడుతూ నాలుగైదు ఏళ్లలోనే ప్రాజెక్టులు నిర్మించవచ్చని నిరూపించాం. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కాబోతుంది. దేశానికే ఆదర్శవంతమైన రెండో హరిత విప్లవం ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయాకట్టే కాకుండా యస్ఆర్యస్పీ కాలువను సైతం పరిపుష్టం చేయబోతున్నాం. సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రం అసూయ పడుతోంది. ఇక్కడికి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయి. ఐటి హబ్ కూడా వస్తుంది’ అని అన్నారు. అదేవిధంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల రైతాంగానికి డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణానికి ముందుకు రావాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భూనిర్వాసితుల బాధలు తమకు తెలిసినంతగా ఎవరికి తెలియవు అని కేటీఆర్ పేర్కొన్నారు. (నర్సమ్మ కోసం కేటీఆర్‌కు ట్వీట్!) -
లాక్డౌన్ పొడిగించే అవకాశం
సాక్షి సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంతా ప్రజల క్షేమం కోసమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. లాక్ డౌన్‌ను మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉందని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇదంతా మన మంచి కోసమేనని పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట, వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. నర్సరీలను పరిశీలించారు. ఆశ వర్కర్లకు శానిటైజర్లు, హెల్త్ కిట్స్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు స్వీయ గృహ నిర్బంధమే శరణ్యమని పేర్కొన్నారు. వైరస్ ప్రబలకుండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని చెప్పారు. వైరస్ నివారణకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ తదితర సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిజాముద్దీన్ సభకు హాజరైన వారిని గుర్తించామని, వారిలో పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉం డాలని ఆయన కోరారు. ప్రాణా ల కంటే ఎక్కువ ఏదీ కాదని, ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించాలని ప్రజలను కోరారు. ప్రజలకు ఇబ్బందుల్లేవ్.. ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వారితో పాటు వలస కూ లీలకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, నగదు అందించామన్నారు. రబీ ఉత్పత్తులు వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సిద్ధిపేట, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలను తరలిస్తున్నామన్నారు. -
ప్రయాణం చేసొచ్చాయి; జాగ్రత్త : మంత్రి హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుందని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆయన 200 మంది రైతులకు పాడి ఆవులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆవులు మంచి సెంటిమెంట్ అని ఏ పూజ చేసినా, పుణ్యకార్యం చేసినా గోపూజ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను తరలించామని, అలసిపోయుంటాయి కాబట్టి రైతులు వాటికి వేడి నీళ్లతో స్నానం చేయించాలని సూచించారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆవులకు తగిన ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఒక ప్రక్రియలా నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన నియోజకవర్గ రైతులను హరీష్‌రావు సన్మానించారు. -
హరీష్ రావు ఆ సంస్థలో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్ : గో హత్యలు, లవ్ జిహాద్, మత మార్పిడి వంటి వాటిని నిరోధించడానికి హిందూ వాహిని పనిచేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అందరినీ ఆదరించే హరీష్‌రావు హిందూ వాహిని కార్యకర్తల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. హిందూ వాహిని అంటే ఏమిటో తెలియాలంటే హరీష్‌రావు ఒకసారి హిందూ వాహినిలో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు ఏ కార్యక్రమం తలపెట్టినా పోలీసులు బెదిరించడం, అక్రమ కేసులు పెడతామని వేధించడం మానుకోవాలని కోరారు. హిందూ వాహిని చిన్న సంస్థ కాదని పెద్ద శక్తి అని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు హిందూ వాహిని కార్యకర్తనని రాజాసింగ్ వెల్లడించారు. హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడమే హిందూ వాహిని లక్ష్యమని స్పష్టం చేశారు. దేవీ నవరాత్రులు నిర్వహించే ప్రతీ మండపం వద్ద సనాతన ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలను ఆదేశించారు. యువకులు దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం పని చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. -
పుస్తకాలు, టవల్స్ ఇవ్వండి..: మంత్రి
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హరీశ్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చే అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పూలదండలు, బొకేలతో రావడంతో పూలదండలు, బొకేలకు బదులుగా నోట్‌పుస్తకాలు, శాలువాలకు బదులుగా టవల్స్ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురికి నచ్చేలా, నలుగురు మెచ్చేలా మంచి చేద్దామన్నారు. మీరిచ్చే నోట్‌బుక్కులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నేత కార్మికుడు నేసిన తువ్వాలలు తేవడం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అతిథులకు పూలబోకేలు ఇచ్చి ఆహ్వానించటం అనవాయితీగా ఉందని, కానీ అలాంటి అనవాయితీకి స్వస్తి పలకాలని హరీశ్‌రావు సూచించారు. మంత్రికి అభినందనలు తెలిపిన సీపీ సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌రావును బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ బాబురావు, ఏసీపీ రామేశ్వర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, టూటౌన్ సీఐ ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. -
మంత్రివర్గంలో హరీశ్.. గులాబీలో జోష్
సాక్షి, సిద్దిపేట: ఎనిమిది నెలల ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన శాఖను ఆయనకు కట్టబెట్టారు. రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై మంత్రిగా హరీశ్‌రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు జోష్‌లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణకు బాటలు వేయడంలో కీలక భూమిక పోషించిన హరీశ్‌రావుకు రెండో సారి ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎనిమిది నెలలుగా ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హరీశ్‌రావు అభిమానులు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఎవరి సేవలు ఎప్పుడు వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావుకు చోటు కల్పించారు. అందరూ ఊహించిన విధంగానే కీలక శాఖ దక్కింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రగతి భవన్‌కు తరలివెళ్లిన నాయకులు ఎనిమిది నెలల తర్వాత తమ నాయకుడికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే వార్త తెలియగానే సిద్దిపేటతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రగతి భవన్ బాటపట్టారు. ఉదయం నుంచి హరీశ్‌రావు వెంటనే ఉన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరెడ్డితోపాటు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, మాణిక్ రావు, క్రాంతికిరణ్ తోపాటు ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, సిద్దిపేట జిల్లా జెడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేలేటి రాధాకిష్ణ శర్మ, ఎస్సీకార్పొరేషన్ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవరుగు రాజనర్సు, ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షుడు ప్రగతి భవన్ చేరుకొని హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సన్నివేశాన్ని వీక్షించారు. అనంతరం అభినందనలు తెలిపారు. దీంతో ప్రగతి భవన్ అంతా కోలాహలంగా మారింది. అభిమానుల ఆనందం సిద్దిపేటజోన్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రిగా స్థానం కల్పించడంతో గులాబీకోట సిద్దిపేటలో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉదయం నుంచే పత్రికల్లో వచ్చిన ముందస్తు కేబినెట్ విస్తరణ కథనాలపై పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా గమనించారు. ఒక దశలో ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో హరీశ్‌రావు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్‌తో పాటు పట్టణం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపి, రాజ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంబురాలు హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆదివారం టీఆర్ఎస్వీ సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడు పెర్కబాబు ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రామ్మోహన్, సాయిప్రేమ్, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసగృహం వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాంచందర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కూర బాల్‌రెడ్డి, ముదిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి సంబురాలు నిర్వహించారు. నైట్ షెల్టర్‌లో పండ్ల పంపిణీ హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా స్థానిక 23వ వార్డులోని నైట్షెల్టర్లోని అభాగ్యులకు వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి లక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీఆర్ఎస్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పద్మారెడ్డి, షాదుల్, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు ప్రొఫైల్ పేరు: తన్నీరు హరీశ్‌రావు తండ్రి: సత్యనారాయణరావు తల్లి: లక్ష్మిబాయి పుట్టినతేది: 03 జూన్ 1972 విద్యార్హతలు : డిప్లామా ఇన్ ఇంజినీరింగ్ స్వగ్రామం : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి పుట్టిన ఊరు : చింతమడక (సిద్దిపేట మండలం) భార్య : శ్రీనితరావు పిల్లలు : కుమారుడు ఆర్చిస్మెన్, కుమార్తె వైష్ణవిత హబీలు: పుస్తక పఠనం రాజకీయ జీవితం : 2004లో జరిగిన సిద్దిపేట ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా హరీశ్‌రావు విజయం సాధించి రాజకీయ అరంగేట్రం చేశారు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో హరీశ్‌రావు రాష్ట్ర యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా కొంతకాలం పని చేశారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా శాసన సభ్యాత్వానికి రాజీనామ చేయడం, తిరిగి ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2010లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి సిద్దిపేట నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన జమిలీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి శాసనసభకు ఎన్నికైన కేసీఆర్ మంత్రి వర్గంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, భారీ నీటి పారుదలశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో గురువారం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు రావడంతో హరీశ్‌రావు 2018లో తన శాసన సభ్యాత్వాన్ని కోల్పోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో వరుసగా ఆరో సారి హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో లక్ష పైచిలుకు భారీ మెజార్టీని సాధించారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా నేడు రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. -
హరీశ్‌రావు సీఎం కావాలంటూ పూజలు
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం( అలంపూర్): తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా హరీశ్‌రావు కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ ఆలయం ముందు హరీశ్‌రావు అభిమానులు 1116 టెంకాయలు కొట్టారు. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ఆధ్వర్యంలో కొంతమంది ఆ గ్రామస్తులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి కావాలని, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావాలని అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కు సమర్పించారు. అమ్మవారి రాజగోపురం ముందు టెంకాయలు కొట్టి హరిశ్ సీఎం కావాలని నినదించారు. -
మీ జీవితాల్లో వెలుగులు రావాలి: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట : ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు రావాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో జరిగిన కో-ఆపరేటివ్ సొసైటి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని, అందుకే వారి కోసం కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లకు సమాజంలో గౌరవాన్ని పెంచేలా తోడ్పాటును అందిస్తామన్నారు. సిద్ధిపేట అన్నింటిలోనూ ఆదర్శంగా నిలుస్తోందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని అన్నారు. సిద్ధిపేట కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆటో డ్రైవర్లకు రుణాలు మంజూరు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు అప్పుల ఉచ్చులో పడకుండా కో ఆపరేటివ్ సొసైటి ద్వారా స్వయం సమృద్దిని సాధించాలని ఆయన సూచించారు. వచ్చే నెల రోజుల్లో డ్రైవర్లకు అత్యంత పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ ఈ సొసైటిలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ వ్యక్తిగతంగా శుభ్రత, డ్రైస్ కోడ్ పాటించాలని.. వృత్తిని నమ్ముకుని జీవించే వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నారు. సిద్ధిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం 300 గజాల స్థలం ఇప్పిస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారి కోసం రూ. 5 లక్షల బీమా అందించేలా చూస్తామన్నారు. -
ఉద్యమంలో కిషన్‌రెడ్డిది కీలకపాత్ర
సాక్షి, నర్సాపూర్: తండ్రిని ఎదిరించి టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ ఉద్యమంలో ముందున్న చిలుముల కిషన్‌రెడ్డి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో దివంగత టీఆర్ఎస్ నాయకుడు, కేంద్ర కార్మికశాఖ కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్ చిలుముల కిషన్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని భార్య సుహాసినిరెడ్డి, కొడుకు శేషసాయిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు రఘునందన్‌రావ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి సమాధివద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనిలేని లోటు తీరనిదని ఆత్మకు శాంతి కలగాలన్నారు. అతని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కిషన్‌రెడ్డి మృతి నియోజకవర్గానికి టీఆర్ఎస్కి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తన గెలుపుకోసం తమ్ముడు కిషన్‌రెడ్డి ఎంతగానో కృషిచేశాడని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ కిషన్‌రెడ్డి తన క్లాస్‌మెట్ అని అందరితో కలివిడిగా ఉండి ప్రజాసేవకు పాటుపడ్డ వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, నాయకులు నరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గోపి, స్థానిక ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ కవిత అమర్‌సింగ్, ఏఎంసీ చైర్మన్ హంసీబాయ్, మండల సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీరవీందర్రెడ్డి, కృష్ణగౌడ్, దుర్గాగౌడ్, శెట్టయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. స్వగృహంలో.. నర్సాపూర్: చిలుముల కిషన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సునీతారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్ర భాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుములమదన్‌రెడ్డి, పద్మ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్‌యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డి, తనయుడు చిలిపిచెడ్ జెడ్పీటీసీ సభ్యుడు చిలుముల శేషసాయిరెడ్డిలను పరామర్శించారు. కాగా పలువురు స్థానిక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు -
దేశానికే ఆదర్శం కావాలి- హరీష్‌రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: చింతమడకలో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమడక నుంచే ఆరోగ్య సూచిక నాంది పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతోనే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ 500 మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. త్వరలో రాష్ట్రమంతట ఆరోగ్య సూచికః చింతమడకలో ప్రారంభమైన ఆరోగ్య సూచిక త్వరలో రాష్ట్రం మొత్తం జరుగుతుందని చెప్పారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరుకు అందరికి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగానే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.40 ఏళ్లు దాటిన మహిళలు,పురుషులు, క్యాన్సర్,గుండె జబ్బు పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సర్జరీలు ఉంటే సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో కంటి, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆరోగ్య సూచిక సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే
సాక్షి, సిద్దిపేట: సభ ప్రారంభంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. చింతమడక నుంచి ఎల్లాపూర్, రాజక్కపేట, అంకంపేట నుంచి హసన్‌మీరాపూర్, దమ్మచెరువు నుంచి వడిగలగడ్డ వరకు రోడ్లు వేసేందుకు నిదులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా చింతమడక గ్రామంలో ఉన్న 98 ఎకరాల అటవీ భూమిని అభివృద్ధి చేయాలని కోరారు. యువజన సంఘాలకు భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, శ్మశాన వాటిక, డంప్‌యార్డు, రైతు బజారు మంజూరి కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రామాలయం పున:నిర్మాణం అవుతుందని, శివాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు. చింతమడకలో ప్రాథమిక ఆసుపత్రి, పశువుల దవాఖానా మంజూరు చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అయితే నియోజకవర్గంలోని నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, మండల కేంద్రాల అభివృద్ధికి రూ. కోటి చొప్పున మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 81 గ్రామాలకు ఒకొక్క గ్రామానికి రూ.25లక్షల చొప్పున మంజూరి చేయాలని ఈ సందర్భంగా కోరారు. సిద్దిపేట అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. మీరు అభివృద్ధి బాటలో నడిపించిన సిద్దిపేటకు తను ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉందని, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి సిద్దిపేటను అన్ని రంగల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలపుతామని చెప్పారు. -
దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
జిన్నారం(పటాన్చెరు): దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని, కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ఇక మెజార్టీని భారీగా అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామం నుంచి గుమ్మడిదల వరకు రోడ్ షో నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమైందని, 5లక్షల మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేసేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కేంద్రం నుంచి అధికంగా నిధులను పొందొచ్చన్నారు. దుండిగల్ నుంచి గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ వరకు రూ.436 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషి చాలా ఉందన్నారు. కాళేశ్వరం నీటిని జిన్నారం, గుమ్మడిదల మండల ప్రాంతాల్లోని రైతులకు అందిచేలా కృషి చేస్తున్నామన్నారు. మల్లన్నసాగర్ కెనాల్ కూడా గుమ్మడిదల మీదుగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిసే ప్రసక్తే లేదని, వారికి ఓటేస్తే బురదలో వేసినట్లేనన్నారు. స్థానికంగా గెలవలేరని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎంపీ రేసులో ఉండటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, నాయకులు చంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదిలో 10 సాధిస్తే 25 వేలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో 10/10 మార్కులు సాధించే విద్యార్థులకు ఆయన రూ.25 వేల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షలతో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. గతేడాది పదో తరగతిలో 92 శాతం ఫలితాలతో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలవాలని టీచర్లకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో, అభివృద్ధిలో చివరికి ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందని.. అదే స్ఫూర్తితో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకు సూచించారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు ఎంత మంది 10/10 ఫలితాలు తెచ్చుకుంటే అందరికీ రూ.25 వేల నజరానా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్లి టెన్త్ ఫలితాల్లో 10/10 సాధిస్తే రూ.25 వేలు బహుమానంగా ఇవ్వనున్నట్లు హరీశ్ తెలిపారు. తన ఛాలెం జ్ను స్వీకరించి 10/10 సాధించి నజరానా పొందాలని సవాల్ విసిరారు. దీనికి విద్యార్థులు సవాల్‌ను స్వీకరిస్తున్నామని విక్టరీ సంకేతంతో బదులిచ్చారు. -
రెండు జాతీయ పార్టీలతో అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం జరిగిన రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూడో పంట కోసం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని, కానీ కరువు కాటకాలతో నిరంతరం ఇబ్బందులు పడుతూ ఒక్క పంటకే గత్యంతరం లేని తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీ య హోదా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రానికి అన్యాయం చేశాయని విమర్శించారు. మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.4 వేల కోట్ల గ్రాంట్లు ఇచ్చిందన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ, మహారాష్ట్రలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటంతో సాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందువల్ల 17 ఎంపీ సీట్లూ టీఆర్ఎస్ గెలిస్తే కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించుకోవచ్చన్నారు. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. అన్ని ఎంపీ సీట్లూ గెలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా తదితర వ్యవసాయ పథకాలతో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 90 శాతం పైగా తగ్గాయని హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రైతుల పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. రోజూ పత్రికల్లో రైతు ఆత్మహత్యల సంఖ్యను చూసి బాధపడేవారమన్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందన్నా రు. దేశం మొత్తం మన పథకాలనే కాపీ కొడుతోం దని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే రైతే సీఎం కావడం వల్లే వ్యవసాయానికి ఆదరణ పెరిగిందన్నారు. ఒకవైపు తమిళనాడు, మరోవైపు మహారాష్ట్ర, ఇంకో వైపు ఢిల్లీలో రైతుల ఉద్యమాలు జరుగుతుంటే, మన రాష్ట్రంలో రైతు సంక్షేమం జరుగుతోందని చెప్పారు. మండలానికో గోదాం కట్టి ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. తెలంగాణలో చేపడుతున్న రైతు అనుకూల విధానాలను మెచ్చుకొని ప్రముఖ వ్యవసాయ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్వామినాథన్‌ను తిట్టిపోసిన ఘనత కాంగ్రెస్ నేతలదని, అందుకే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు, క్రాప్ కాలనీలు రావాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణకు జీడీపీలు ముఖ్యం కాదని, రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు ఉండటమే నిజమైన అభివృద్ధి అని సీఎం చెప్పారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు. దేశం తెలంగాణ వైపు చూస్తుంది: పోచారం దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్టంలో వ్యవసాయశాఖ ప్రత్యేక స్థానం సంపాదించడంలో కీలక భాగస్వామ్యం వ్యవసాయ శాఖ అధికారులదేనన్నారు. పేదలు, రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందన్నారు. రైతు చనిపోతే వారి కుటుంబీకుల ఖాతాల్లో మూడు రోజుల్లో రూ.5 లక్షలు జమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ధాన్యం ఎకరాకు పది బ్యాగులు అదనంగా ఈ ఏడాది వచ్చిందన్నారు. పదేళ్లలో దేశంలోనే ధనవంతులైన రైతులు తెలంగాణలోనే ఉంటారన్నారు. వచ్చే 15, 20 ఏళ్ల వరకు టీఆర్ఎస్, కేసీఆర్ మారరని జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 42 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. రైతు కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పారు. వరి నాటు యంత్రాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతే..
వలిగొండలో జన ప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, ఇక తేలాల్సింది ఎదుటి వారికి డిపాజిట్ వస్తుందో రాదోనన్న విషయమేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వలిగొండలో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తాయో ఓట్ల కాలం వచ్చిందంటే కాంగ్రెసోళ్లు అలాగే వస్తారని.. వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఓట్ల అనంతరం మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. కష్ట సుఖాల్లో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అని అన్నారు. సఖ్యత లేని కూటమి నేతలు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని విమర్శించారు. వలిగొండ (భువనగిరి) : వలిగొండలో జనప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి విజయం తథ్యమని తెలుస్తోందని.. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కష్టసుఖాల్లో శేఖర్‌రెడ్డి నియోజకవర్గం ప్రజలకు అండగా ఉండే వ్యక్త అని పేర్కొన్నారు. వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తాయో ఓట్ల కాలం వస్తే కాంగ్రెస్ వాళ్లు అలాగే వస్తారని, వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఎన్నికల అనంతరం మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. 2009లో 9 అంశాలతో ముందుకు వచ్చారని ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక 24గంటల విద్యుత్ ఇచ్చారా, 6కిలోల బియ్యం ఇచ్చారా, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారా అని అన్నారు. ఐక్యత లేనివారు రాష్ట్రాన్నిఎలా పాలిస్తారు.. మహాకూటమిలో ఉన్న కోదండరాం, చంద్రబాబు, చాడ వెంకట్‌రెడ్డిలు ఒకేమాటపై ఉండడం లేదని హరీశ్‌రావు అన్నారు. ఐక్యత లేని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని విమర్శించారు. భువనగిరి జిల్లా అయ్యిందంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం, శేఖర్‌రెడ్డి వల్లనేనని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే జిల్లా అయ్యేదా ఆలోచించాలన్నారు. యాదగిరిగుట్టను కోట్లాది రూపాయలతో మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదని వారికి అర్థమైందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మించకుండా చేస్తామంటున్నారు. మళ్లీ చీకట్లో ఉంచడానికా అన్నారు. మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఏనాడైనా పేదింటి ఆడపడుచుల పెళ్లికి కనీసం రూ.10వేలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తయితే వలిగొండలో30వేల ఎకరాలకు సాగునీరు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే వలిగొండ మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబు.. కాళేశ్వరం వద్దని ఢిల్లీకి ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ జతకట్టడం దారుణమమన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడోనని 11 రోజలు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు దగ్గరకు వెళ్లి వచ్చి కేసీఆర్ సాధించిన తెలంగాణను తిరిగి ఆంధ్రాపాలకుల చేతిలో పెట్టాలనుకోండం అవసరమా అని అన్నారు. చంద్రబాబు పంపించే నోట్లతో బతకమని, నీరుంటే బతుకుతామని అన్నారు. కాంగ్రెస్‌లో జిల్లానుంచి ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. కోటి ఎకరాలకు నీరందించడమే టీఆర్ఎస్ సంకల్పం : ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎంపీ బూరనర్సయ్య మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును ఐక్యరాజ్యసమితి అభినందించిందన్నారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీలు రాహు, కేతువులు లాంటివారన్నారు. భువనగిరిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ ఆస్పత్రి సాధించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ప్రాజెక్ట్‌లు, కాల్వలకు ప్రాణదాత హరీశ్‌రావు : పైళ్ల భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు కాల్వలకు, ప్రాజెక్ట్‌లకు ప్రాణదాతని అన్నారు. గత ప్రభుత్వాలు కాల్వలకు గండి పడితే చెంచాడు మట్టి పోశారనని అన్నారు. రూ.2కోట్లతో వలిగొండ చెరువు పనులు చేపట్టామన్నారు. రూ.6 కోట్లు 50 లక్షలతో భీమలింగం పనులు చేపట్టామన్నారు. ఎమ్మెల్యేగా తిరిగి గెలిపిస్తే ఐదారింతల అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం మాజీమంత్రి ఉమా మాధవరెడ్డి మాట్లాడుతూ భీమలింగం కాల్వను పొడిగించిన ఘనత దివంగత మంత్రి మాధవరెడ్డిదేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న పథకాలను చూసే టీఆర్ఎస్లో చేరానని అన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 55ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులలో జరిగిందన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించుకుని కారుగుర్తుకు ఓటేయాలన్నారు. అందెం లింగం యాదవ్ మాట్లాడుతూ గొల్లకురుమలకు సముచిత స్థానం కల్పించింది కేవలం టీఆర్ఎస్సే అన్నారు. ఈ సందర్భంగా మొగిలిపాకకు చెందిన ముద్దసాని కిరణ్‌రెడ్డి హరీశ్‌రావుకు నాగలిని బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొల్పుల అమరేందర్, గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిటిపాముల జ్యోతిసత్యనారాయణ, టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు బద్ధం భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పనుమటి మమతనరేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల ప్రభాకర్, కొమిరెల్లి సంజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తా..
సిద్దిపేట జోన్: ‘నియోజకవర్గంలోని ప్రతీ విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే నా లక్ష్యం. గడిచిన నాలుగున్నరేండ్లలో సిద్దిపేటను ఎడ్యుకేషనల్ హాబ్‌గా మార్చే ప్రయత్నం చేశాను. వైద్య కళాశాల కల సాకారం కావడం నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. నియోజవర్గంలోని ప్రతీ మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సిద్దిపేటలో పీజీ, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, వెటర్నరీ కళాశాలలు, మైనార్టీ గురుకులాలు, బీసీ, సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలను విస్తృతంగా ఏర్పాటుచేశాం. భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో విద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తా. విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన విద్యను అందించడమే నా లక్ష్యం.’ -
బాబుతో పొత్తు సిగ్గుచేటు.. హరీశ్ ద్వజం
సాక్షి, గద్వాల: గద్వాలలో జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్నవిగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనది ఇక్కడ తొలి అడుగు మాత్రమేనని.. కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించుకుని తన వెంట అసెంబ్లీలోకి తీసుకునే వెళ్తాననే ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గద్వాలలో డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తున్నారని.. డబ్బు అహంకారం ఇక నడవదని పేర్కొన్నారు. అలాగే, హరీశ్‌రావు ఇక్కడకు వచ్చాడని గుర్తించాలని సూచించారు. గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌లో డాక్టర్ అబ్రహం గెలుపు ఖాయమని అన్నారు. కంటికి రెప్పలాగా గద్వాల కార్యకర్తలను కాపాడుకుంటామని, ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా పార్టీ కోసం 19 ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలు మరో 19రోజులు గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో కొందరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని.. వారికి అధికారం, పదవులు తప్ప ప్రజాసంక్షేమం పట్టలేదని విమర్శించారు. టికెట్ వస్తే ఒక పార్టీ.. రాకపోతే మరో పార్టీ.. అంతిమ లక్ష్యం మాత్రం అదికారమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బాబుతో పొత్తు సిగ్గుచేటు తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలోనే మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మారిందన్నారు. పోతిరెడ్డిపాడుకు బొక్కకొట్టి మహబూబ్‌నగర్‌కు రావాల్సిన నీటిని ఆం«ధ్రాకు తరలించినప్పుడు డీ.కే.అరుణ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు. దీంతో ఎటు చూసినా చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. నెట్టెంపాడుకు 2004లో కొబ్బరికాయ కొడితే 2014వరకు పదేళ్లలో పట్టుమని 10వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లలో కాల్వలు పూర్తిచేసి రూ.వందల కోట్లు ఖర్చుతో 1.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఈ మధ్య కొబ్బరి కాయకొట్టే పాత ఫొటో పట్టుకొచ్చి తామే జీఓ తెచ్చామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు మంత్రిగా ఉండి గట్టు ఎత్తిపోతలకు తట్టెడు మట్టి తవ్వని వ్యవస్థ మీదైతే... రూ.552కోట్లు మంజూరు చేసిన, చేయించుకున్న ఘనత కేసీఆర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి దక్కుతుందని తెలిపారు. గట్టు ఎత్తిపోతల ద్వారా గట్టు మండలాన్ని సశ్యశ్యామలం చేస్తామని అన్నారు. గద్వాలకు 350 పడకల ఆస్పత్రి, గద్వాలకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు, ఆర్డీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.2కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గుర్రగడ్డ బ్రిడ్జికి రూ.10కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాలలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పథకాలు ప్రవేశపెట్టామని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటా.. 15ఏళ్లుగా ఓడినా, గెలిచినా వెన్నంటే ఉన్న కార్యకర్తల రుణం రుణం తీర్చుకుంటానని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టినా, ఇబ్బందులు వచ్చినా తన వెంట ఉన్న కార్యకర్తలను మరువలేనని అన్నారు. ఈసారి అవకాశం ఇచ్చి అందరి రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అచ్చంపేట రాములు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వినియోగదారుల కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, టీఎస్ టెక్నాలజీ ఛైర్మన్ రాకేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, జిల్లా గ్రం«థాలయ చైర్మన్ బీ.ఎస్. కేశవ్, టీఆర్ఎస్ నాయకులు పరుమాల నాగరాజు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేట..ఉద్యమాల కోట
ఉద్యమాల పురిటి గడ్డగా, ప్రజాచైతన్యానికి వేదికగా సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉప్పెనల ఎగిసింది. ఈ గడ్డపై పుట్టిన అనేక మంది కళాకారులు తమ ఆటా, పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. మలిదశ తెలంగాణ పోరాట రథ సారథి, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ సిద్దిపేట. తెలంగాణ ప్రజా సమితితో తొలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనంతుల మదన్మోహన్ రాజకీయ ప్రస్థానం సాగింది కూడా ఇక్కడి నుంచే. మదన్ మోహన్ అనంతరం కేసీఆర్, ప్రస్తుతం హరీశ్‌రావుకు వరుస విజయాలను అందించి ఆశీర్వదించారు ఇక్కడి ప్రజలు. 1970 నుంచి 2014 వరకు ఈ నియోజవర్గానికి జరిగిన 15 ఎన్నికల్లో ఈ ముగ్గురే విజేతలుగా నిలవడం విశేషం. రాజకీయ చైతన్యం తొనికిసలాడే సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక కథనం.. సాక్షి, సిద్దిపేటజోన్: నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అత్యధికంగా ఐదు సార్లు ఉప ఎన్నికలు జరగడం విశేషం. 1969లో తొలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో 1970 ఉప ఎన్నిక తర్వాత మలివిడత ఉద్యమంలో వరస రాజీనామాలతో 2001, 2004, 2008, 2010లో ఉప ఎన్నికలు జరిగడం విశేషం. తెలంగాణ ప్రజా సమితితో ఉద్యమానికి తొలివిడతలో తెరలెపిన అనంతుల మదన్‌మోహన్‌తో పాటు ఆయన వద్ద రాజకీయ శిష్యరికం పొందిన ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్‌రావుకే నియోజకవర్గ ప్రజలు వరసగా పట్టం కట్టారు. 1983లో గురువు మదన్మోహన్పై పోటి చేసి ఓటమి చెందిన కేసీఆర్ 1985నుంచి వరుసగా డబుల్ హట్రిక్ విజయాలు సాధించి రికార్డు నెలకొల్పారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు 2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసి వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించాడు. అందులో మూడు ఉప ఎన్నికలే కావడం విశేషం. సిద్దిపేట నియోజకవర్గ స్వరూపం నియోజకవర్గంలో సిద్దిపేట మున్సిపల్‌తో పాటు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలు ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఓటర్లు 1,97,920 మహిళలు 98,557, పురుషులు 99,337 ఇతరులు 26 మొత్తం పోలీంగ్ స్టేషన్లు 256 నియోజకవర్గంలోని గ్రామాలు 81 1952లో నియోజకవర్గం ఏర్పాటు.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆరుసార్లు టీఆర్ఎస్ని, నాలుగు సార్లు టీడీపీని, ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీని, ఒక్కోక్క సారి తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్), ప్రోగ్రెసివ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్), స్వతంత్రులకు పట్టంకట్టారు. నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచిన వారిలో అనంతుల మదన్మోహన్, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన్నీరు హరీష్‌రావు మంత్రులుగా పనిచేశారు. 1952లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి గురువారెడ్డి సమీప ప్రత్యర్ధి పీవి. రాజేశ్వరావుపై విజయం సాదించి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా రాజకీయ ముఖచిత్రంలో స్థానం సంపాదించుకున్నారు. 1957లో పీవీ రాజేశ్వర్‌రావు గురువారెడ్డిని ఓడించి ప్రతికారం తీర్చుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన సోమేశ్వర్రావు, కాంగ్రెస్ అ«భ్యర్థి వీబీ రాజేశ్వర్‌పై విజయం సాదించారు. 1967లో వీబీ. రాజు, సీపీఎం అభ్యర్థి నర్సింహరెడ్డిపై గెలుపొందారు. 1969లో తొలి విడత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వీబీ. రాజు రాజీనామా చేశారు. 1970లో జరిగిన నియోజకవర్గ తొలి ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పక్షాన అనంతుల మదన్మోహన్ విజయం సాదించారు. అక్కడి నుంచి ప్రారంభమైన మదన్మోహన్ రాజకీయ ప్రస్తానం 1985 వరకు కొనసాగింది. ఈ మద్య కాలంలో ఆయన పీవీ. నర్సింహరావు, చెన్నారెడ్డి, భవనం వెంకట్రావు, టి. అంజయ్య, కోట్ల విజయబాస్కర్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. 1983లో ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం 1983లో ఆవిర్భవించిన టీడీపీ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే రాజకీయ గురువు మదన్మోహన్ చేతిలో ఓటమి చెందిన కేసీఆర్ తర్వాత వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిఘటించిన కేసీఆర్ టీడీపీ సభ్యత్వానికి, శాసనసభకు, డిప్యూటీ స్పీకర్ పదవికి మూకుమ్మడి రాజీనామలు సమర్పించారు. 2001లో టీఆర్ఎస్ పక్షాన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్, అనంతరం 2004లో సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సమయంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే పదివికి రాజీనామా సమర్పించడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు నియోజకవర్గానికి 2004 ఉప ఎన్నికల ద్వారా ఆరగ్రేటం చేశారు. అప్పట్లోనే వైఎస్ మంత్రి వర్గంలో హరీశ్ యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవిని స్వీకరించి కొద్ది రోజులకే భారీ మెజార్టీతో సిద్దిపేట నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి 2014 వరకు ఐదు పర్యాయాలు విజయాన్ని సాదించారు. ఇటీవల ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో మరోసారి ఎన్నికలు అనివార్యంగా మారింది. ఇప్పటికే ఐదు సార్లు సిద్దిపేట నియోజకవర్గం నుండి విజయం సాధించిన హరీష్‌రావు డబుల్ హ్యట్రిక్ దిశగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. -
పోలీసు శాఖ అప్రమత్తం
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియల తొలికీలక ఘట్టం.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించారు. దీంతో పోలీసులు ముందస్తుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్యాలయం చుట్టూ పహారా.. వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం చుట్టూ పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. సబ్‌డివిజన్‌లోని పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ వెంకటరమణ స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిషత్ ఆవరణలోకి వస్తున్న వారిని ప్రశ్నిస్తూ వదిలిపెడుతున్నారు. 3 గంటల తర్వాత నోఎంట్రీ.. ఎన్నికల కార్యాలయమైన స్థానిక తహసీల్దార్ ఆఫీసులోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు మినహా మిగతా వారినెవ్వరినీ అనుమతించడం లేదు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చేవారిని పూర్తి వివరాలు అడిగి తెసుకుని నిర్ధారించుకున్నాకే లోనికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి కేవలం నామినేషన్ పత్రాలు సమర్పించే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు డీపీఆర్వో కార్యాలయం సిబ్బంది మీడియాకు అందజేస్తున్నారు. నేడు వేములవాడకు మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు వేములవాడకు వస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు తెలిపారు. ఉదయం 9 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30కు రుద్రంగిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి కథలాపూర్ మండలం సూరమ్మ చెరువును పరిశీలిస్తారు. తిరుగు పయనంలో చందుర్తి మండలం మల్యాలలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. -
ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే
సాక్షి, సిద్దిపేట: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..’ మీరు పెంచిన కేసీఆర్‌నే. మీ ఆశీస్సులతో.. మీ బిడ్డగా ఎదిగి అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్ర యుద్ధంలో గెలిచాం.. రాష్ట్రం సాధించుకున్నాం.. నాకు ఇచ్చిన సహకారమే హరీశ్‌కు కూడా అందించండి.. లక్ష మెజార్టీతో గెలిపించండి అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కేసీఆర్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం, తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలం గాణ చేయడం కోసం పని ఒత్తిడిలో మీకు దూరంగా ఉన్నానని అన్నారు. అనుబంధం, ఆత్మీయతగల మీకు దూరంగా ఉండడంలో బాధ ఉందని చెప్పారు. ఏ కార్యక్రమంచేపట్టినా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి, స్వామి వారి, ఇక్కడి ప్రజల దీవెలనతో పని మొదలు పెడతామని అన్నారు. ఇక్కడి నుండి ప్రారంభించిన ఏ యుద్ధంలో కూడా ఓటమి ఎరుగమని కేసీఆర్ వివరించారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళ్తూ స్వామి వారి దీవెనలు తీసుకునేందుకు వచ్చి మీ అందరిని కలవడం సంతోషంగా ఉందన్నారు. మీరే నా బలమని, మీ ఆశీస్సులు నన్ను విజయం వైపు నడిపిస్తాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేసుకొని ప్రజల ఇబ్బందులు తొలిగించామని చెప్పారు. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే మార్గం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మార్గం గజ్వేల్, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, కరీంనగర్ లైన్‌కు కలుపుతామని అన్నారు. ఒకటి రెండు సంవత్సరాల్లో సిద్దిపేటకు రైలు వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఒక్క విమానం తప్ప అన్ని సౌకర్యాలు సిద్దిపేట నియోజకవర్గంలో కల్పించామని చెప్పారు. లక్ష మెజార్టీతో హరీశ్‌ను గెలిపించాలి కోనాయిపల్లి నుండి ప్రారంభించిన ప్రతీ పనిలో విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. మీరు నాపై చూపించిన అభిమానమే నన్ను ముఖ్యమంత్రి పదవి వరకు తీసుకెళ్లిందని చెప్పారు. ఇప్పటి మాదిరిగానే స్వామి వారి దీవెనలు తీసుకొని ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. నాపై చూపించిన ప్రేమ, అభిమానం మీ నియోజకవర్గం అభ్యర్థి హరీశ్‌రావుపై కూడా చూపించాలని కోరారు. లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావును గెలిపించాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కేసీర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ బాబు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ కోర్డినేటర్ బూర విజయ, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సిద్దిపేట ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సోమిరెడ్డి, కొమరవెల్లి మల్లన్న దేవాలయం చైర్మన్ పంపత్, పూజారులు కలకుంట్ల నర్సింహాచారి, కలకుంట్ల కృష్ణమాచారి, వైద్యం కృష్ణమాచారి, పోడిశెట్టి రామకృష్ణమాచారి, చిలకమర్రి హరినాథాచారి, జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ తదితరులు ఉన్నారు. ఆలయం బాగుంది హరీశ్ నంగునూరు(సిద్దిపేట): కోనాయిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వేంకటేశ్వరాలయం బాగుందని సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావును అభినందించారు. బుధవారం వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ పాత ఆలయం వెనుక భాగంలో రూ. 1 కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న నూతన ఆలయాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న హరీశ్‌రావుతో మాట్లాడుతూ దేవాలయం బాగుంది.. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సమాధానం ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ నామినేషన్‌కు విరాళం సీఎం కేసీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం గ్రామ మాజీ సర్పంచ్ నిమ్మ బాల్‌రెడ్డి కేసీఆర్‌కు రూ. 11, 111 విరాళంగా అందజేశారు. సీఎం ప్రసంగం ముగియగానే వాహనంపై ఉన్న బాల్‌రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గజ్వేల్ నుంచి భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని జేబులో నుంచి డబ్బులు తీసి కేసీఆర్‌కు అందజేశారు. భారీ బందోబస్తు గజ్వేల్: ముందుగా ప్రకటించినట్లుగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గజ్వేల్‌లో నామినేషన్‌ను దాఖలు చేసేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి మధ్యాహ్నం 2:26గంటలకు చేరుకున్నారు. ముహూర్తం కోసం కొద్దిసేపు కార్యాలయంలో నిరీక్షించారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అ«ధికారి విజయేందర్‌రెడ్డికి అందజేశారు. ఈనెల 11న తన ఫామ్‌హౌస్‌లో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన నామినేషన్‌కు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేసిన సంగతి కూడా విదితమే. అయినా పార్టీ ముఖ్య నేతలు, పలువురు కార్యకర్తలు కేసీఆర్ నామినేషన్ ప్రక్రియను చూడడానికి వచ్చారు. వంద మీటర్ల దూరం అవతల ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో అంతా బారికేడ్ల ఇవతలి భాగంలోనే ఉండి దూరం నుంచి తిలకించారు. కేసీఆర్ వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ నామినేషన్ దాఖలు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే కాన్వాయ్ ఆగి ఉండగా... మూడు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి నామినేషన్ వేశారు. కేసీఆర్ నామినేషన్ వేస్తున్న సందర్భంలో బయట ఉన్న కార్యకర్తలు, నాయకులు జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్ నామినేషన్ వేసే సందర్భంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితరులు వంద మీటర్ల అవతల నిలబడ్డారు. -
నేడే ముహూర్తం
సాక్షి, సిద్దిపేట: గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి ఆదివారం బీ ఫారం అందుకున్న జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వే ల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థులు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సరిగ్గా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా తల్లిదండ్రులను, ఇష్ట దైవాలను కొలుచుకొని, పూజలు నిర్వహించి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్ కేంద్రాలకు వెళ్లనున్నారు. కోనాయిపల్లిలో కేసీఆర్, హరీశ్‌రావు పూజలు సెంటిమెంట్లకు, జాతకాలు, ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా కేసీఆర్ బీ ఫారంపై సంతకం పెడతారు. అనంతరం దానికి పూజారులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేరుగా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌తోపాటు, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లి తన బీ ఫారంకు పూజలు చేయిస్తారు. హరీశ్‌రావు మందుగా హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకొని, ఆ తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటారని ఆయన ఆనుచరులు చెబుతున్నారు. అనంతరం కోనాయిపల్లిలో పూజలు చేయించిన బీ ఫారం తీసుకొని నేరుగా సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడ అర్చకులు, పూజారులు, హిందూ మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అక్కడి నుండి గద్దెబొమ్మ సమీపంలోని పెద్ద మసీద్‌లోకి వెళ్లి హరీశ్‌రావు ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లీం పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయిస్తారు. అక్కడ క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇలా సర్వమత ప్రార్థనలు చేసిన తర్వాత సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఇంటి దైవాన్ని కొలిచిన తర్వాత సతీష్ నామినేషన్ హుస్నాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్‌కుమార్ తన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని కొలిచిన తర్వాత నామినేషన్ వేస్తారు. ముందుగా తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామమైన హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో వీరి పూర్వీకులు నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అట్నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి సతీష్‌కుమార్ నామినేషన్ వేయనున్నారు. సాదాసీదాగా సోలిపేట నామినేషన్ ఎప్పటి మాదిరిగానే దుబ్బాక నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సాదాసీదాగా బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మంచిరోజు ఉన్నదని అధినేత కేసీఆర్ చెప్పిన నేథప్యంలో అందరితోపాటు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూడవెల్లి ఆలయంలో పూజల అనంతరం ముఖ్య అనుచరులతో బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అధికారికి అందజేస్తారు. ఎల్లమ్మను మొక్కి ముత్తిరెడ్డి నామినేషన్ జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇష్ట దైవం ఎల్లమ్మ తల్లిని మొక్కి బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం యశ్వంతాపూర్ ఎల్లమ్మ తల్లి అంటే యాదగిరిరెడ్డికి భక్తి ఎక్కువ. అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ పూజలు నిర్వహించి పనిమొదలు పెట్టడం ఆనవాయితీ. అందులో భాగంగా బుధవారం ఉదయం యాదగిరిరెడ్డి కుటుంబసమేతంగా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. బీఫారం అక్కడ పెట్టి తల్లి దీవెనలు కోరుతారు. అక్కడి నుంచి జనగామ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందచేస్తారు. -
టీజేఎస్‌కు షాక్..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నాగేశ్ సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నాగేశ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయుడైన నాగేశ్ తెలంగాణ జన సమితి ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్‌తో పాటు సంగారెడ్డి టికెట్ ఆశించిన నాగేశ్.. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో పక్షం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరడం టీజేఎస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. టీజేఎస్ వర్గాల్లో నిరాశ కోదండరాం నేతృత్వంలోని టీజేఏసీతో పాటు, టీజేఎస్ ఆవిర్భావం నుంచి ఇతర జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా పరి«ధిలో పలు కార్యక్రమాలు జరిగాయి. టీఆర్ఎస్తో పాటు వివిధ సంఘాల్లో చురుగ్గా పనిచేసిన పలువురు నేతలు టీజేఎస్ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరారు. సంగారెడ్డి నుంచి బీరయ్య యాదవ్, ఆత్మకూరు నాగేశ్, జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి ఆశప్ప తదితరులు టికెట్ ఆశించారు. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీజేఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట స్థానాలను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజేఎస్ ఆశిస్తున్న స్థానాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. బీసీ కోటాలో ఏదో ఒక స్థానం నుంచి తనకు పోటీ అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ ఉన్నారు. టీఆర్ఎస్లో నాగేశ్ చేరిక నేపథ్యంలో పార్టీలోని మిగతా శ్రేణుల ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. -
ఎలాగైనా గెలవాల్సిందే...!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీఆర్ఎస్ గురిపెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. వివిధ సర్వేలు, అంతర్గత నివేదికల సమాచారాన్ని తెప్పించుకుని ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచార సరళి, ప్రజల నుంచి వస్తున్న స్పందనను పరిశీలిస్తూ గెలుపోటములను అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిలాలో కాస్త ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పార్టీకి ఇబ్బందికరంగా ఉన్న స్థానాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్ స్థానాలకు మంత్రి హరీశ్‌రావును ఇన్చార్జిగా వేశారు. ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. గతంలో కంటే ఎక్కవ స్థానాలపై.. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం అత్యంత సులువని అన్ని రాజకీయపార్టీలు భావిస్తాయి. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాలకు మెజారిటీ సీట్లు గెలుపొందేందుకు టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. దక్షిణ తెలంగాణలో.. అందులోనూ పాలమూరు ప్రాంతం కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉందనే సర్వే నివేదికల నేపథ్యంలో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల కంటే అదనంగా అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో 14 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఏడు చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఈసారి అదనంగా మరో నాలుగైదు సీట్లు గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. ఇన్చార్జిగా హరీశ్‌రావు పాలమూరు ప్రాంతంపై మంచి పట్టు ఉన్న మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సాగునీటి శాఖ మంత్రిగా హరీశ్‌రావు ప్రతీ నెల జిల్లాలో పర్యటిస్తూ.. ప్రజల నాడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పాలమూరు నుంచి అత్యధిక సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి.. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా నాలుగు స్థానాల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉందని ఆయన గుర్తించినట్లు సమాచారం. అందులో భాగంగా గద్వాల, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్ స్థానాలకు ఇన్చార్జిగా మంత్రి హరీశ్‌రావును నియమించారు. వీటిలో రెండు స్థానాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మరో రెండు స్థానాలు స్వపక్షానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల, ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగురాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే స్థానిక నేతలకు అండగా ఉండేలా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో సిద్ధహస్తుడైన హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో ఇది వరకే కొడంగల్ నియోజకవర్గ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా స్టడీ చేసినట్లు చేసినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తూ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. స్వపక్ష నేతలకు మద్దతుగా.. బలమైన విపక్షనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు.. స్వపక్షానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహించిన రెండు స్థానాలకు కూడా హరీశ్‌ను ఇన్చార్జిగా నియమించారు. మక్తల్‌లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి నియోజకవర్గంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలే వేరు కుంపటి పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో అక్కడ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాకు చెందిన ముఖ్యులకు బాధ్యతలు అప్పగించినా ఫలితం కానరాలేదు. దీంతో స్వయంగా మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించి... మక్తల్‌లో పార్టీ అభ్యర్థి గెలుపొందేలా చూడాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అలాగే అతి కీలకమైన మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ గెలిచి తీరాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని హరీశ్‌కు సూచించారు. -
బ్రహ్మాండంగా గెలవబోతున్నాం: హరీశ్‌రావు
జగదేవ్‌పూర్(గజ్వేల్): ‘గజ్వేల్ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్ మాత్రం గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తం గజ్వేల్ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకుపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. గజ్వేల్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. 25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ సిద్ధాంతాలను బాబు తుంగలోతొక్కారు
-
అభివృద్ధే మంత్రం
‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లలో మేం అభివృద్ధిని చేసి చూపాం. మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేసేందుకు కంకణబద్ధులమై పనిచేస్తాం. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను సాధించి తీరుతాం. ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం లేని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడినా సాధించేదేమీ ఉండదు. అవకాశవాద రాజకీయ కూటమికి ప్రజలే తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తారు.’ ఇదీ ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు మనోగతం. ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల సమరాంగణంలో టీఆర్ఎస్ శ్రేణులను అంతా తానై నడిపిస్తున్న హరీశ్‌రావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర శాసన సభ రద్దు చేసి సరిగ్గా నెలన్నర కావస్తోంది. మరో నెలన్నరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? హరీశ్: సెప్టెంబర్ 6న రాష్ట్ర శాసన సభను రద్దు చేసిన వెంటనే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. అందోలు మినహా మిగతా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే, తిరిగి పార్టీ అభ్యర్థులుగా మరోమారు బరిలోకి దిగారు. సీఎం కేసీఆర్ మరోసారి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని కారణాలతో అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. సాక్షి: డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరగనుంది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. మీరు ప్రచారంలో మునిగి తేలుతున్నారు? హరీశ్: నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఎన్నికల తేదీతో సంబంధం లేకుండా, అసెంబ్లీ రద్దు ఆ వెంటనే అభ్యర్థులను ప్రకటించాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాదాపు తొలి విడత ప్రచారం పూర్తయింది. కార్యకర్తల సమావేశాలు, ర్యాలీలు, గ్రామాల వారీగా సమావేశాలు.. వెళ్లిన ప్రతీ చోటా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నేను కూడా మెదక్ మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికే ఒక విడత చుట్టి వచ్చా. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. సాక్షి: మీరు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతున్న ఎజెండా ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు? హరీశ్: గత ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను దాదాపు ఆచరణలోకి తీసుకు వచ్చాం. మేనిఫెస్టోలో లేని అనేక అంశాలను కూడా ప్రజలకు మేలు చేకూర్చే రీతిలో ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు.. ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో లేని అంశాలను చాలా అమలు చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు వంటి విప్లవాత్మకమైన పథకాలు మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేశాం. దీంతో పాటు నియోజకవర్గాల్లో స్థానికంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించాం. సాక్షి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో అభివృద్ధి కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు పరిమితమైందనే విమర్శ ఉంది? హరీశ్: ఇది పూర్తిగా సత్యదూరమైన విమర్శ. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమ ప్రాధాన్యతతోనే అభివృద్ధి సాధించాం. మనోహరాబాద్–కొత్తపల్లి, మెదక్ అక్కన్నపేట రైలు మార్గంతో పాటు సంగారెడ్డి–నాందేడ్ 161, మెదక్–ఎల్కతుర్తి, ప్రాంతీయ రింగు రోడ్డు వంటి జాతీయ రహదారులు టీఆర్ఎస్ పాలనలో సాకారమయ్యాయి. కాలువల ద్వారా సింగూరు జలాలు, ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమయ్యాయి. ఇక వివిధ ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షి: వచ్చే ఎన్నికల్లో మహా కూటమి ప్రభావం జిల్లాలో ఎంత మేర ఉంటుంది? హరీశ్: ఏనాడు ప్రజల బాగోగుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహా కూటమి పేరిట అనైతిక పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు ఫక్తు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంలోనే కాంగ్రెస్ డొల్లతనం బయట పడుతోంది. చంద్రబాబు నాయకత్వాన్ని పరోక్షంగా తెలంగాణ ప్రజల మీద రుద్దేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. జిల్లాలో కాంగ్రెస్ బలమేంటో 2016 నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంతో తేలిపోయింది. ఎంత మందితో కలిసి ఎన్ని కూటములు ఏర్పడినా జిల్లాలో వారి ప్రభావం శూన్యం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి అసెంబ్లీ స్థానాలూ మావే. సాక్షి: టికెట్ల కేటాయింపు తర్వాత పార్టీలో అక్కడక్కడా అసంతృప్తి ఉన్నట్లుంది? హరీశ్: పార్టీలో ఉన్న అందరికీ రాజకీయంగా అవకాశాలు రాకపోవచ్చు. వారి సేవలను గుర్తించి ఏదో ఒక రూపంలో సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. అవకాశం రాని కొందరు అక్కడక్కడా ఆవేదనతో ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు. పార్టీ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు బయటకు వెళ్తే వెళ్లొచ్చు. మెజారిటీ నాయకులు, కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. జిల్లాలో పార్టీ ఏకతాటిపై అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. సాక్షి: సిద్దిపేట, గజ్వేల్‌లో ఏమైనా ప్రత్యేక ప్రచార వ్యూహం ఉందా? హరీశ్: సీఎం స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గజ్వేల్ నియోజకవర్గంలో వందేండ్ల అభివృద్ధి కేవలం నాలుగేండ్లలో సాధ్యమైంది. ఉద్యమ కేంద్రంగా ఉన్న సిద్దిపేట అభివృద్ధిలోనూ మేటిగా ఉంది. ఈసారి సిద్దిపేటలో లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తామనే మాట ఓటర్ల నుంచే వినిపిస్తోంది. ప్రజల ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే. సాక్షి: ఎన్నికల్లో ఏదైనా ప్రత్యేక నినాదంతో వెళ్లే ఆలోచన ఉందా? హరీశ్: టీఆర్ఎస్ చెప్పేదే చేస్తుంది. ఉద్యమ పార్టీగా ప్రజలకు ఏది అవసరమో మాకంటే ఎక్కువ ఇతరులకు ఎవరికీ తెలియదు. డబుల బెడ్రూం, దళితులకు భూ పంపిణీ అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాలతో అనుకున్న వేగంతో ముందుకు సాగలేదు. మేం ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోకు మంచి స్పందన లభిస్తోంది. ఒకటి మాత్రం చెప్పదల్చుకున్నాం. ‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి’. ప్రజలకు ఎళ్లవేలలా అందుబాటులో ఉంటాం. ఆశీర్వదించడని కోరుతున్నాం. -
తెలంగాణ వ్యతిరేకితో పొత్తా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తుపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని సాగునీటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి దూరమైన పార్టీలతో కోదండరాం ఎలా కలసి పని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలసి హరీశ్‌రావు మంగళవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబునాయుడుతో మీది షరతులతో కూడిన పొత్తా.. బేషరతు పొత్తా.. అధికారం కోసమే పెట్టుకునే పొత్తా? స్పష్టం చేయాలి. చంద్రబాబు సమైక్య నినాదాన్ని పక్కనపెట్టి తెలంగాణ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు ఏఐసీసీ చెప్పిన తర్వాతే 2004లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశాం. అప్పటి మా పొత్తులు వందకు వంద శాతం షరతులతో కూడినవే. ఈ షరతులు ఉల్లంఘించగానే ఆ పార్టీలతో తెగతెంపులు చేసుకున్నాం. తెలంగాణ కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు టీడీపీతో ఇలాగే షరతులు పెట్టారా? మీ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసమా, మీ రాజకీయ ప్రయోజనాల కోసమా స్పష్టం చేయాలి. సీఎం కేసీఆర్ తెలంగాణను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పడగొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు తెలంగాణలో నేరుగా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ పోటీ చేసినా టీడీపీకి డిపాజిట్లు దక్కవని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రుజువైంది. అందుకే చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. మహాకూటమి నేతల వ్యక్తిగత స్వార్థం కోసమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ సామాన్య జనం మహాకూటమి ఏర్పాటును చీదరించుకుంటున్నారు. కేసీఆర్ పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లి తెలంగాణ తెచ్చారు. తెలంగాణపై కేసీఆర్ చిత్తశుద్ది ఇది. మహాకూటమి నేతలు మాత్రం పరాయి పాలనకు మొగ్గు చూపుతున్నారు’అని హరీశ్ విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులతో కోదండరాం జట్టు... తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం లక్ష్యమేమిటో అర్థం కావడంలేదని హరీశ్‌రావు అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం మాతో కలసి ఉద్యమించిన కోదండరాం ఇప్పుడు సీట్ల కోసం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడం కాదా? తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మీరే జేఏసీ నుంచి సస్పెండ్ చేశారు. జేఏసీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మీ మొహం మీదే ప్రకటించి కాంగ్రెస్ వెళ్లిపోయింది. అలాంటి పార్టీలతో కలసి పని చేస్తారా? కోదండరాం ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతారా? మీ నిర్ణయంలో ఏ ఉద్యమ స్ఫూర్తి ఉందో చెప్పాలి’అని ప్రశ్నించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తులపై తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న 12 అంశాలను మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చే విషయంలో స్పష్టత ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంతకాలు చేస్తారా?’అని హరీశ్ ప్రశ్నించారు. ఉత్తమ్‌కు మంత్రి హరీశ్ రాసిన బహిరంగ లేఖలోని 12 అంశాలు... 1 తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి వరకు అన్ని రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వైఖరిని మార్చుకున్నారా? టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించి తెలంగాణ అంశాలపై స్పష్టత ఇచ్చారా? 2 సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్పక్షాన నిలబడి తెలంగాణకు వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు. ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, పైన చెప్పిన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తానని చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా? ఈ విషయాల్లో చంద్రబాబు బహిరంగంగా వైఖరి చెప్పగలరా? కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకుంటరా? 3 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను గుంజుకున్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని వ్యతిరేకించి రాష్ట్ర బంద్ చేపట్టారు. ఏడు మండలాలను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు దీనికి సిద్ధమా? చంద్రబాబును ఒప్పించి ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలకపడానికి కాంగ్రెస్ ఏమైనా అంగీకారం కుదుర్చుకుందా? 4 150 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలంలోని రామాలయం సహా తెలంగాణలోని లక్ష ఎకరాలు మునిగిపోతోంది. దీని ప్రభావం ఎంతో ఇంకా అంచనా వేయలేదు. నష్టం జరగకుండా డిజైన్ మార్చాలని అందరూ కోరుతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. పోలవరం డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? పోలవరంపై మీ పార్టీ వైఖరి, చంద్రబాబు వైఖరి ఏమిటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలి. 5 మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మేలు చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలకు 30 లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ఆయన వైఖరి చెప్పకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా? 6 కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెన్‌గంగ, రామప్ప–పాఖాల ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వాటిని ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా? 7 పోలవరం నిర్మించి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణా నీటిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు రావాలి. తెలంగాణకు వచ్చే నీటి కేటాయింపులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు నష్టపోతున్నాయి. ఈ కేటాయింపులపై అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా? 8 తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టింది. గోదావరి, కృష్ణా నీళ్లను వినియోగించడం తప్పని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి ఇబ్బందులు సృష్టించే చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారు. భగీరథపై ఫిర్యాదు విషయంలో చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? 9 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5 వేల కోట్ల విలువైన 460 మెగావాట్ల సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్కున్నది. దీనివల్ల మొదట్లో తెలంగాణ రాష్ట్రం కరెంటు కోతలు అనుభవించింది. ఏడాది అంతా కరెంటు ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టును కోల్పోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ కోటి రూపాయలు నష్టపోతున్నది. సీలేరు ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారా? ప్లాంట్ తీసుకున్నందుకు నష్టపరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారా? 10 విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్రకు చెందిన 1,200 మందిని రిలీవ్ చేస్తే ఏపీ ప్రభుత్వం వారిని జాయిన్ చేసుకోవడంలేదు. కోర్టులో కేసులు వేశారు. ఆంధ్ర ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులు ఉపసంహరించుకుంటారా? 11 నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కోసం ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. ఆ ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉండదని చంద్రబాబు అంగీకరించారా? కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారా? 12 హైకోర్టు విభజన, ఇతర ప్రభుత్వరంగ సంస్థల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. వాటి విభజన విషయంలో చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? -
సర్దుకుపోదాం...
సాక్షి, మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చి అందరినీ ఏకతాటి మీదికి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌కు రానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్దతపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలోని అసంతృప్త నేతలతోనూ మాట్లాడి బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి రాకతోనైనా నియోజకవర్గంలోని అసంతృప్తి నేతలు దారిలోకి వస్తారని మదన్‌రెడ్డి వర్గీయులు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకోకముందు నుంచి మదన్‌రెడ్డిపై పలువురు టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన ఉంది. దీనికితోడు మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నేత మురళీయాదవ్‌కు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. మదన్‌రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ దక్కటంతో మురళీయాదవ్లో అసంతృప్తి మరింత పెరిగింది. పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగా పోటీచేయాలని మురళీ భావించారు. అయితే మంత్రి బుజ్జగించటంలో వెనకడుగు వేశారు. పార్టీ మారనప్పటికీ మదన్‌రెడ్డితో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని, నియోజకవర్గంలో నాయకులను రెచ్చగొడుతున్నారని మదన్‌రెడ్డి వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయాన్ని మదన్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బుధవారం నర్సాపూర్‌కు రానున్న మంత్రి హరీష్‌రావు అసంతృప్తి నేత మురళీయాదవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు తెలిసింది. బుధవారం జరిగే సమావేశంలో మదన్‌రెడ్డి, మురళీయాదవ్‌లు కలిసిపోయారన్న భావన కార్యకర్తల్లోకి బలంగా వెళ్లేలా వారితోనే చెప్పించనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదని.. ఇటీవల మృతిచెందిన టీఆర్ఎస్ నేత కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితో కూడా మంత్రి సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీపీఐ నేతగా ఉన్న కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు మదన్‌రెడ్డి విజయానికి ఆయన కృషి చేశారు. కిషన్‌రెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తామని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దురదృష్టవశాత్తు ఇటీవలే ఆయన మృతి చెందిన విషయం తెలిసిందె. టీఆర్ఎస్ అధిష్టానం తీరుపై కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితోపాటు ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సుహాసినిరెడ్డితో సమావేశం కానున్నారు. బుధవారం నర్సాపూర్‌లో అందుబాటులో ఉండాలని, పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఆమెను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం జరిగే సమావేశంలో ఆయనను కూడా బుజ్జగించనున్నారు. హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, కొల్చారం మండల నాయకురాలు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ముదిరాజ్‌లు నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ యాదాగౌడ్ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని నాయకులు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉండటం నష్టం కలిగిస్తుందని భావిస్తున్న మంత్రి హరీశ్‌రావు వారితో మాట్లాడి ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అసంతృప్తి నేతలంతా ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసేలా మంత్రి చూడనున్నారు. ఆయన చర్యలతోనైనా టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు సమసిపోతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. -
టీఆర్ఎస్ హుస్నాబాద్ సభ పేరు ఇదే
సాక్షి, హైదరాబద్ : తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్.. మరింత దూకుడు పెంచింది. ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తున్న కేసీఆర్.. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మరో బహిరంగ సభ ఏర్పాటు సిద్ధమయ్యారు. ఈ సభకు ‘ప్రజా ఆశీర్వాద సభ’గా నామకరణం చేసినట్లు హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. మంత్రుల వెంట పలువురు ప్రజాప్రతినిధులున్నారు. సభ విజయవంతం చేసేందుకు మండలాల వారిగా ఇంఛార్జీలను నియమించారు. హుస్నాబాద్ ఇంఛార్జ్‌గా ఎంపీ వినోద్, సతీష్ బాబు, సుధాకర్ రెడ్డిలను, కోహెడకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగులు, సైదాపూర్‌కు మంత్రి ఈటలను, భీమదేవరపల్లికి పుట్ట మధు, ఎల్కతుర్తికి విద్యాసాగర్‌రావులను ఇంఛార్జీలుగా నియమించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయా మండలాల ఇంఛార్జ్‌లు కార్యకర్తతో భేటీకానున్నారు. -
దేవరకొండ ఆదర్శంగా నిలుస్తుంది
కొండమల్లేపల్లి(దేవరకొండ) : రానున్న రోజుల్లో రిజర్వాయర్ల నిర్మాణాలతో రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి వద్ద పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న దొంతినేని సంపతమ్మ కల్యాణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయితే 1లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రసుతం డిండి ప్రాజెక్టు నుంచి సాగు నీరందిస్తున్నామన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద పిల్లలకు సహయ సహకారాలు అందించాలని సూ చించారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించేలా చూస్తానని çహామీ ఇచ్చారు. అనంతరం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సకాలంలో వానలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉం డేందుకు గాను కల్వకుర్తి నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. అంతకు ముందు మంత్రి హరీశ్‌రావుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎ మ్మెల్సీ భానుప్రసాద్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నోముల న ర్సింహ్మయ్య, రవీందర్రావు, ఉజ్జిని యాదగిరి రావు, బాబూ రావు ,శ్రీనివాసరావు, శ్రీకాంత్‌రావు, రవీందర్రావు, జగన్మోహన్రావు, ప్రభాకర్‌రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వరరా వు, నరేం దర్రావు, వెంకటేశ్వరరావు, రామేశ్వరరావు, నరేందర్‌రావు, రాంచందర్‌నాయక్, మా ర్కెట్ చైర్మన్ బాలనర్సింహ, ఎంపీపీ శ్రీని వాస్‌యాదవ్, జెడ్పీటీసీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ దేవేందర్, జనార్దన్‌రావు, కృష్ణ కిశోర్‌రావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కోతలు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్‌కోసం రైతులు ధర్నాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా రైతుబంధు, రైతు బీమా పథకాలు తెచ్చామన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్‌కు పాలసీ ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయాలలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అది చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని హరీశ్ విమర్శించారు.