సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | CM KCR Tour Place Observation Minister Harish Rao In Medak | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Published Sun, May 6 2018 11:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

CM KCR Tour Place Observation Minister Harish Rao In Medak - Sakshi

బహిరంగసభ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ మున్సిపాలిటీ : మెదక్‌ జిల్లా నూతన సమీకృత కలెక్టరెట్, ఎస్పీ భవనాలకు శంకుస్థాపన చేసేందుకు ఈనెల 9న సీఎం కేసీఆర్‌ మెదక్‌జిల్లాకు రానున్న సందర్భంగా మంత్రి హరీశ్‌రావు,  శనివారం మెదక్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. శుక్రవారం రాత్రి సీఎం పర్యటనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మెదక్‌లోనే బస చేశారు. శనివారం ఉదయం æహవేళిఘణాపూర్‌ మండలం ఔరంగాబాద్‌ శివారులోకి చేరుకొని సమీకృత కలెక్టరెట్, ఎస్పీ భవనాలు నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు.

బహిరంగసభకు భారీ ఎత్తున జనాలు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం కేసీఆర్‌ పర్యటనను జయప్రదం చేయాలన్నారు.

ఆయన వెంట డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, జేసి నగేశ్, ఆర్డీఓ మెంచు నగేశ్, ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య ఆర్‌అండ్‌బీ ఈఈ చంద్రయ్య, మైనింగ్‌ ఏడీ జయరాజ్, డీపీఓ హనోక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనాథ్, అడిషనల్‌ ఎస్పీ నాగరాజు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య,  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళియాదవ్, మున్సిపల్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్‌ రాగి అశోక్, కౌన్సిలర్లు అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement