
పండుగలా పనులు జరుగుతుంటే..అభాండాలు వేస్తారా:హరీష్
పండుగలా జరుగుతున్న పనులపై అనవసర అభండాలు, విషయం చిమ్మే ప్రయత్నాలు చేయరాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హితవు పలికారు.
హైదరాబాద్ సిటీ: పండుగలా జరుగుతున్న పనులపై అనవసర అభండాలు, విషయం చిమ్మే ప్రయత్నాలు చేయరాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హితవు పలికారు. చెరువుల పునరుధ్ధరనకు ఉద్దేశించిన మిషన్ కాకతీయను మిషన్ గులాబీ అంటూ విమర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిపై హరీష్‌రావు మండిపడ్డారు.
విష ప్రచారం చేయడంలో కిషన్‌రెడ్డిని మించిన వారు మరొకరు లేరని ఎద్దేవా చేశారు. ప్రజలు, నేతలతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ కార్యకర్తలు స్వఛ్చదంగా ముందుకు వచ్చి చెరువుల పనుల్లో పాల్గొని అభినందిస్తుంటే కిషన్‌రెడ్డికి అవేవీ కనబడకపోవడం ఏంటని ప్రశ్నించారు.