సాక్షి,హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఖూనీ చేశారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ముగిసిన అనతంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ సత్య దూరమైనవేననన్నారు.
‘ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని చెప్పి మాకు మాట్లాడే అవకాశమెందుకు ఇవ్వలేదు. మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పీవీ నరసింహారావు చనిపోతే కాంగ్రెస్ పెద్దలు కనీసం నివాళులర్పించలేదు. గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు. మాజీ సీంఎ అంజయ్యనూ కాంగ్రెస్ పార్టీ అవమానించింది’ అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
‘అమరులకు ప్రతి సారి నివాళులు అర్పించిన తర్వాతే కేసిఆర్ పనులు మొదలు పెడతారు. సచివాలయం ముందు అమరుల స్థూపం బీఆర్‌ఎస్ కట్టింది. జై తెలంగణ అంటే కాల్చేస్తా అని గన్ను పట్టుకుని వచ్చింది రేవంత్‌రెడ్డి. యాది రెడ్డి శవాన్ని కనీసం రేవంత్‌రెడ్డి చూడలేదు. అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి. కేసులే లేవని అసెంబ్లీలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment