సాక్షి,హైదరాబాద్ : సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే దేశానికి దిక్సూచి వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy) అన్నారు. కులగణనపై (telangana census survey) తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) లో ప్రత్యేక సమావేశంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్‌ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల వివరాలు అడిగినందుకే బీఆర్‌ఎస్ నేతలు కులగణన సర్వేలో పాల్గొనలేదని అన్నారు.
‘అపోహల సంఘం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తప్పుదోవ పట్టిస్తుంది. ఓ ఫేక్ డేటాను సర్క్యూలేట్ చేసి జనాభా ఎక్కువ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.గత ప్రభుత్వం సర్వే రికార్డులో 33వ పేజీలో జనాభా పై క్లారిటీ ఉంది చెక్ చేసుకోండి. 2014 సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం ఉంటే..ఇప్పుడు 56 శాతం ఉన్నారు. అదే ఓసీలు 2014 సర్వే ప్రకారం 21 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం ఉన్నారు. బీసీ జనాభా పెరిగింది కానీ..తగ్గింది అని ఎలా చెప్తారు.
సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అధికారికమో కాదో హరీష్ రావు, కేటీఆర్ చెప్పాలి. అధికారం అని చెప్తే..దానిపైనే చర్చ చేద్దాం. కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు ,పద్మారావు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారు సర్వేలో పాల్గొనలేదు. భూమి వివరాలు అడిగినందుకే వీరంతా సమాచారం ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు.
సర్వేలో పాల్గొనండి
జనాభా లెక్కించడం బీజేపీకి ఇష్టం లేదు. 2021లో జరగాల్సిన జనగణనను బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ను గత ప్రభుత్వం అధికారిక రిపోర్ట్‌గా ప్రకటించలేదు. 2011 జనాభా లెక్కలు మినహా.. ఏ అధికారిక లెక్కలు లేవు. అపోహలు సృష్టించే డాక్యుమెంట్స్ తెచ్చి సభ్యులు సభను తప్పుదోవ పట్టించుకోకండి. ఇప్పటికైనా సర్వేలో పాల్గొనని వారు వివరాలు ఇవ్వండి.
1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు
ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు. అందుకే కులగణన చేశాం. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా కులగణన కొంత ఆలస్యం అయింది.వివిధ రాష్ట్రాలలో సర్వేలు చేసి..పకడ్బందీగా కులగణన చేశాం.లక్షకు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు. 76 వేల మంది ఉద్యోగులు డేటా ఎంట్రీ చేశారు.
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎస్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే 56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి. కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment