బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, మెదక్ : సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు వరాలు కురిపించారు. నర్సాపూర్ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్‌డిపోను నర్సాపూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు బస్‌డిపోకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మెదక్ పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి రూ.కోటి రూపాయల నిధులు ప్రకటిం చారు. అలాగే మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. మెదక్ మండలం ఔరంగాబాద్‌లో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. ‘నేను మెదక్ జిల్లా ముద్దుబిడ్డను.. మీ సొంత బిడ్డను.. సిద్దిపేట ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాను..
బక్కపేదోడు నాతో ఏమైతదని అందరూ అవహేళన చేసిండ్రు.. మీ ఆశీర్వాద బలంతో తెలంగాణ సాధించా.. సీఎంగా రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తున్నా.. సొంత జిల్లా వాసుల అనుమతితో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానా లు, రెండు ఎంపీ స్థానాలను గెలిపించి ఆశీర్వదించాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మ డి మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్, టీడీపీ పిచ్చిపిచ్చి ఆరోపణలను చేస్తూ ప్రజల ను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిం చారు. ఆ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో సైతం విజయం సాధించటం ఖాయమన్నారు.
కాంగ్రెస్ వల్లే ఘనపురం నాశనమైంది..
కాంగ్రెస్, టీడీపీ పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలోని ఘనపురం ప్రాజెక్టు నాశనం కావటానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కూచన్‌పల్లి గ్రామంలోని రైతు కుర్మ దుర్గయ్య ఆత్మహత్య చేసుకోగా మిత్రుడు సుభాష్‌రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు.
అయితే అక్కడ ఘనపురం ప్రాజెక్టు కాల్వలు పూర్తి గా ధ్వంసమై కనిపించాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.100 కోట్లతో ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధి చేయడంతోపాటు చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఏడా ది చివరి వరకు మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందజేస్తామన్నారు.
నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మంజీరాపై ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందేస్తామని ప్రకటించారు. మంజీరా, హల్దీవాగులపై 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో జీఓ తీసుకువస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. రూ.1000 కోట్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు సాగుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఇంటింటికీ నీటి కనెక్షన్లు ఇచ్చి ఆడపడచుల నీటి కష్టాలు తీరుస్తామని తెలిపారు.
హరీశ్‌రావుపై పొగడ్తల వర్షం
ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించరని తెలిపారు. అందోలు నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రులు పనిచేశారని, అయితే చెరువుల తవ్వుకున్నట్లు బిల్లులు ఎత్తుకుని అవినీతికి పాల్పడినట్లు తెలిపారు.
కాగా జిల్లా మంత్రి హరీశ్‌రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. మంత్రి హరీష్‌రావు చురుగ్గా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నట్లు చెప్పారు. బహిరంగసభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు శేరి సుభాశ్‌రెడ్డి, దేవీప్రసాద్, భూమిరెడ్డి, కొలను దామోదర్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment