ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకే మూసీ ప్రస్తావన తెస్తున్నారు
కేటీఆర్, హరీశ్‌ల సంగతి తేలుస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
చెరువులు, కుంటలను కబ్జా చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
చార్మినార్ వద్ద సద్భావన కార్యక్రమంలో ప్రసంగం
చార్మినార్ (హైదరాబాద్): ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడం కోసమే మూసీ ప్రస్తావన తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టంచేశారు. మూసీ నదిలో దుర్భర జీవనం గడుపుతున్న నిరుపేదలను కాపాడుతూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులను చేపట్టామన్నారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కమిటీ అధ్యక్షుడు, బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆధ్వర్యంలో శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన సద్భావన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.
చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, జీవో 111ను ఉల్లంఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు. అనుమతులున్న వారిని హైడ్రా ఏమీ చేయదన్నారు. మూసీ వద్దకు రావాలని సవాల్ విసిరిన వారి కోసమే తాను మూసీ (చార్మినార్) వద్దకే వచ్చానని.. ఇక మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు వస్తానని బీఆర్‌ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కబ్జాదారులను అరికట్టడానికి హైడ్రా అంకుశం తరహాలో పని చేస్తుందన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే అన్ని వర్గాల పేదలకు అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు భావించినందునే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారన్నారు.
కొంతమంది సన్నాసులు కుటుంబ పాలన అంటున్నారని.. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ముందుండడమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. కేసీఆర్ కుబుంబపాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. వారి కుటుంబం దోపిడీ మాత్రమే చేసిందని ఎద్దేవాచేశారు.
అడ్డం వస్తే.. బుల్డోజర్ సిద్ధంగా ఉంది...
తాము పేదలను ఆదుకుంటుంటే బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అడ్డం వస్తే తొలగించడానికి ఒక బుల్డోజర్ సిద్ధంగా ఉంచానన్నారు. ‘దొంగ నాటకాలాడుతున్న బావామరు దుల డ్రామాలన్నీ చూస్తున్నా.. చెప్పులు మోసేటో ళ్లూ మాట్లాడుతున్నారు.. మీ సంగతి నాకు తెలియదా.. మీలాగ దొంగతనాలు చేయలేదు.. చేతులు కట్టుకుని నా ముందు నిలబడిన రోజులు మర్చిపోయారా’ అంటూ వ్యాఖ్యానించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే... కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లను వారే స్వయంగా కూలగొట్టుకుని పేదల వద్దకు రావాలని.. మీవి అక్రమ కట్టడాలు కావా? అని పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నార న్నారు. అనంతరం రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కలిసి మాజీ మంత్రి జె.గీతారెడ్డికి సద్భావనా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదా రులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment