
జమ్మికుంట మండలం మడిపల్లిలో మాట్లాడుతున్న ఈటల
ఇల్లందకుంట / వీణవంక (హుజూరాబాద్): కొడుకు(కేటీఆర్)ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఉన్నవారికి దళితబంధు ఇవ్వబోమని అంటున్నారంటా.. మిస్టర్ సీఎం.. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు.
చదవండి: బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
తెలంగాణ డబ్బులకు ఓనర్లు ప్రజలే.. అడ్డగోలుగా మాట్లాడితే ప్రళయం సృష్టిస్తం.. జాగ్రత్త’అని హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఖర్చు చేసిన డబ్బులు కేసీఆర్ కుటుంబం కూలీకి పోయి సంపాందించినవా అని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీణవంక మండలంలోని మల్లన్నపల్లిలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొర్ల మందల మీద పిచ్చి కుక్కలు, తోడేళ్లు దాడి చేసినట్లు.. తాను ఏ పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే.
Comments
Please login to add a commentAdd a comment