సాక్షి, మెదక్: ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు సీరియస్ అయ్యారు. వీరంతా ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని తిడుతున్నారని విమర్శించారు. ఎవరు తెలంగాణకు వచ్చినా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి హరీష్ రావు శనివారం మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్‌ను తిడుతున్నారు. మొన్న రాహుల్ వచ్చినా, ఈరోజు మోదీ వచ్చినా తిట్టుడే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారు. మోదీ ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టింది. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతీ పథకం పేరును మార్చి కాపీ కొట్టారు. మేము మంచిగా పనిచేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు. కేసీఆర్ గొప్పతనం, పనితీరు వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి.
తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అంటున్నారు. మీరు డబ్బులు ఇవ్వలేదు. మాకు రావాల్సిన నిధులు ఆపారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే.. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి. నీతి ఆయోగ్ చెప్పినా నిధులు ఇవ్వలేదు. బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని 21వేల కోట్లు ఆపింది మీరే. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మాపై బురదజల్లడం తప్ప మీరు చేసేందేమీ లేదు. ఏమన్నా అంటే ఈడీని ఉపయోగిస్తారు. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు. కానీ.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్ కొత్త నాటకాలు మొదలెట్టారు: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment