సాక్షి, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంలో చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి
మరోవైపు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలని నార్సింగి కాంగ్రెస్ మండల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, యాదగిరియాదవ్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్ల పనులు ప్రారంభించడానికి వచ్చే ఎమ్మెల్యే ఎవరికి సమాచారం ఇవ్వకుండా రావడంపై మండిపడ్డారు.
గత ఏడాది ప్రారంభించిన నర్సంపల్లి జీపీ భవనం తిరిగి ప్రారంభించడం ఎందుకని ప్రశ్నించారు. శిలాపలకపై ఇన్‌చార్జి మంత్రి పేరు పెట్టకపోవడం ఎంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వరా అని వాపోయారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాజీ ప్రతినిధులను వెంట బెట్టుకోని ప్రారం¿ోత్సవాల చేస్తే చూస్తూ ఉరుకునేదిలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment