సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.
రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment