protocol controversy
-
Independence Day 2024: ఐదో వరుసలో రాహుల్
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ముందు వరుసలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మండిపడింది. ‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్ షా, జేపీ నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది. -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
ప్రొటోకాల్ వివాదం.. టీఆర్ఎస్ వాదనను ఖండించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రామగుండం కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శికి ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో లేఖ అందజేశారని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను కేంద్రమంత్రి మాండవీయ విడుదల చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు -
అవమానంతో టీడీపీ మహిళా మేయర్ కంటతడి
-
టీడీపీ మహిళా మేయర్‌కు అవమానం
సాక్షి, రాజమండ్రి : వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేదు. దీనిపై మేయర్ రజనీ శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి అధికారులు అవమానించాంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనను పిలవకపోయినా బాధపడేదానిని కాదని, కానీ ఇలా పిలిచి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంపై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యక్రమం ప్రారంభం కాకముందే సభా వేదిక నుంచి మేయర్ వెళ్లిపోయారు. అయితే కార్యక్రమం నుంచి మేయర్ వెళ్లిపోవడం అక్కడకు వచ్చిన పార్టీ నేతల్లోను ఒకింత ఆలోచనను కలిగించింది. అవసరం తీరాక అందరినీ వదిలించకోవడం, గిట్టని వారిని అవమానించడం పార్టీలో మామూలే కదా, అయినా మేయర్ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ, చిన్న స్థాయి నేతల పరిస్థితి ఏంటో అని అనుకుంటున్నారు. -
మంత్రుల మధ్య ప్రొటోకాల్ రగడ
శ్రీకాకుళం : జిల్లాలో సోమవారం ఉదయం అంబేడ్కర్ ఆడిటోరియంలో జరగనున్న ‘ప్రధానమంత్రి – చంద్రన్న బీమా’ పథకానికి సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రంలో ప్రొటోకాల్ సమస్య తలెత్తింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పితాని సత్యనారాయణ, ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు, రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారని అధికారులు ఆహ్వాన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు అ యినప్పుడు కళా వెంకటరావు పేరు తర్వాత ఆయన పేరును ముద్రించడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, మంత్రి అనుయాయులు తప్పుబడుతున్నారు. ఇన్చార్జి మంత్రి జి ల్లాకు వచ్చి ఉంటే అంతగా సమస్య తలెత్తేది కాదు. ఆయనే కార్యక్రమాన్ని నడిపించేవా రు. అయితే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమవుతుండడంతో పితాని ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో అటు తర్వాత పేరును ముద్రిం చిన కళా వెంకటరావు కార్యక్రమాన్ని నడిపించాల్సి ఉండగా ఆదివారం రాత్రి వరకు మంత్రి కళా పర్యటనకు సంబంధించి ఎ లాంటి సమాచారం జిల్లా అధికారులకు గా నీ, పౌరసంబంధాల అధికారులకు గానీ అందలేదు. దీంతో ఆయన సైతం కార్యక్రమంలో పాల్గొనరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారా, లేదా అన్నది సందేహంగానే ఉంది. పలువురు కార్యకర్తలు, మంత్రి అనుయాయులు ప్రోటోకాల్‌ను పాటించని కార్యక్రమంలో పాల్గొనవద్దని అచ్చెన్నపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆయన అధికారులపై గుర్రుగానే ఉన్నట్లు భోగట్టా. సోమవారం ఉదయం 10 గంటలకు నరసన్నపేటలో జరిగే ఓ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొంటున్నట్లు పౌరసంబంధాల అధికారులకు సమాచారం వచ్చింది. ఈ లెక్కన ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు తక్కువేనని కొందరు అంటుండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని, అయితే అధికారుల తప్పిదాన్ని ప్రశ్నిస్తారని, ఇకముందు ఇలా జరి గితే రాష్ట్ర స్థాయిలో ప్రొటోకాల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి నుంచి ప్రోటోకాల్‌కు సంబంధించి విడుదలైన ఉత్తర్వుల్లో కేబినెట్ మంత్రి ప్రోటోకాల్ మంత్రిగా ఉంటారని పేర్కొన్నారే తప్ప ఏ ఒక్కరి పే రునూ సూచించలేదని నిర్వాహక అధికారులు చెబుతున్నారు. ఇద్దరూ కేబినెట్ మంత్రులు కావడంతో ఇలా ముద్రించామని వారంటున్నారు. అయితే ఈ ప్రోటోకాల్ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. -
మధ్య నుంచే వెనుదిరిగిన కేటీఆర్
ప్రొటోకాల్ వివాదమే కారణమా? సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ నూతన భవన ప్రారంభంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కామారెడ్డికి బయలుదేరిన మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు మధ్యలోంచే వెనుదిరిగారు. ప్రొటోకాల్ వివా దం కారణంగానే మంత్రి పర్యటన అర్ధంతరంగా రద్దు అయిందని భావిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన కార్యాలయ భవనం ప్రారంభంతోపాటు మిషన్ భగీరథ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డికి రావాల్సి ఉంది. ఈ మేరకు ఉదయం మంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలియడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు నేత లంతా పట్టణ శివారు ప్రాంతానికి చేరారు. అయితే, మెదక్ జిల్లాలోని తూప్రాన్ వరకు వచ్చిన ఆయన వెనుదిరిగి వెళ్లారని తెలియడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యా రు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయా కార్యక్రమాలను నిర్వహించారు. మున్సిపల్ కార్యా లయ ప్రారంభోత్సవం విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాల్లో మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేరును నిబంధనలకు విరుద్ధంగా కింద రాయించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు, మున్సిపల్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. అయినా వీటన్నింటినీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్ కామారెడ్డి పర్యటనకు బయలుదేరి వచ్చారు. సీఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ప్రొటోకాల్ వివాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతోనే మంత్రి వెనుదిరిగి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. -
విశాఖ డీఆర్ఓపై కమిషనర్ తాంతియా పోలీసులకు ఫిర్యాదు
విశాఖ: డీఆర్ఓ, సమాచార కమిషనర్ల మధ్య ప్రోటోకాల్ రగడ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిన టవేరా వాహనం వద్దంటూ ఇన్నోవా కావాలని సమాచార కమిషనర్ తాంతియా పట్టుపట్టారు. అయితే ఆ స్థాయి తమకు లేదని తెలిపిన డీఆర్ఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది పనితీరుపై తాంతియా మండిపడ్డారు. అంతేకాకుండా తనకు వాహనం కేటాయించలేదనే కారణంగా సమాచార సిబ్బంది సహాయంతో డీఆర్వోకు షోకాజ్ జారీ చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించాడని డీఆర్ఓపై విశాఖ టూటౌన్ పోలీసులకు తాంతియా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడమేకాకుండా 15 రోజుల్లో పూర్తి వివరాలతో తనముందు హాజరు కావాలని డీఆర్ఓ, కలెక్టర్లకు తాంతియా ఆదేశాలు జారీ చేశారు.