సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదన్న టీఆర్‌ఎస్ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రామగుండం కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శికి ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో లేఖ అందజేశారని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను కేంద్రమంత్రి మాండవీయ విడుదల చేశారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
చదవండి: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment