విశాఖ డీఆర్ఓపై కమిషనర్ తాంతియా పోలీసులకు ఫిర్యాదు
విశాఖ: డీఆర్ఓ, సమాచార కమిషనర్‌ల మధ్య ప్రోటోకాల్ రగడ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిన టవేరా వాహనం వద్దంటూ ఇన్నోవా కావాలని సమాచార కమిషనర్ తాంతియా పట్టుపట్టారు.
అయితే ఆ స్థాయి తమకు లేదని తెలిపిన డీఆర్ఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది పనితీరుపై తాంతియా మండిపడ్డారు. అంతేకాకుండా తనకు వాహనం కేటాయించలేదనే కారణంగా సమాచార సిబ్బంది సహాయంతో డీఆర్‌వోకు షోకాజ్ జారీ చేశారు.
తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించాడని డీఆర్ఓపై విశాఖ టూటౌన్ పోలీసులకు తాంతియా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడమేకాకుండా 15 రోజుల్లో పూర్తి వివరాలతో తనముందు హాజరు కావాలని డీఆర్ఓ, కలెక్టర్‌లకు తాంతియా ఆదేశాలు జారీ చేశారు.