ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్‌ ఎక్కడ? | MLC Varudu Kalyani Slams Deputy CM Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్‌ ఎక్కడ?

Published Mon, Apr 7 2025 1:01 PM | Last Updated on Mon, Apr 7 2025 5:43 PM

MLC Varudu Kalyani Slams Deputy CM Pawan Kalyan

విశాఖ,సాక్షి: మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ అన్నారు. విశాఖ మధురవాడ స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు.

అనంతరం,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడారు. మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులనీ చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిందితుడుకి ఉరి శిక్ష వేయాలని ఒక మహిళ గా డిమాండ్ చేస్తున్నా.

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళల్ని రక్షించడంలో ప్రభుత్వం కూడా విఫలమైంది. అఘాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. హోంమంత్రి అనిత ఎక్కడున్నారు. రుషికొండ కోసం గంటలు క్యాబినెట్‌లో సమీక్షలు చేస్తారు. ఆడపిల్లల మాన, ప్రాణాల రక్షణ కోసం చర్చించే సమయం లేదా. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడే పర్యటిస్తున్న ఇటువైపు ఎందుకు చూడలేదు.

100రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బాధితురాలికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు.  

నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement