విశాఖపట్నం, సాక్షి: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి కారణమని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ చెప్తోంది. ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంతవరకు దొరకలేదు. ఏపీలో రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయి. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగింది. కనీసం హోంమంత్రి బాధితురాళ్లను పరామర్శించటం లేదు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. కానీ, హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేశారు. పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే.. పవన్ భరోసా ఎందకివ్వలేదు? పంతం నానాజీ అనుచరుల వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. మరి ఆ బాధితులకు పవన్ ఎందుకు భరోసా ఇవ్వ లేదు?’’అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment