
గుంటూరు, సాక్షి: చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 5 నెలల్లోనే మహిళలపై వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయని మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘హోమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వవన్ కల్యాణే చెబుతున్నారు. మేం కూడా మొదట్నుంచీ అనిత తీరును ఎండగడుతూనే ఉన్నాం. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ అనిత రాజీనామా చేయాలి. అనితతో పాటు చంద్రబాబు సైతం సీఎంగా రాజీనామా చేయాలి’’ అన్నారు.
‘పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమనాలి’
హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇప్పటికైనా హోం మంత్రిని మార్చాలి. వైఎస్ జగన్‌ను తిట్టడానికే అనితకు హోం మంత్రి పదవి ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సోమవారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.
‘‘హోంమంత్రి అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి అక్రమాలపై పశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ తీరు మార్చుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలైమంది. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమని చెప్పాలి’’ అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment