సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున కొద్దీ పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారుతోంది. ప్రధాని మోదీ నిజామాబాద్ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత డీకే అరుణ.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, డీకే అరుణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వాస్తవాలు మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారు. ప్రధాని మోదీపై ఇస్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు.
తెలంగాణకు ఈ 9 ఏళ్లలో కేంద్రం రూ.9 లక్షల కోట్ల నిధులిచ్చింది. తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్. గెలిచినోళ్లను కాపాడుకోలేని కాంగ్రెస్.. ప్రజలకేమి గ్యారంటీ ఇస్తోంది?. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండాలన్న హరీష్ రావు
Comments
Please login to add a commentAdd a comment