సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికలపై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేరువేరు కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖయమని జోస్యం చెప్పారు. బీజేపీ పరువు పోకుడదనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కారణంగా బీజేపీ కుట్ర చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయం. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా గెలిచే అవకాశం లేదు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. బీజేపీ కుట్రలకు కేసీఆర్ సహకరిస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేరు వేరు కాదు.. రెండు ఒక్కటే. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పే కేసీఆర్.. బీజేపీ పాలసీలకు మద్దతు తెలుపుతారు. జమిలీ ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని 2018లోనే కేసీఆర్ లేఖ రాశారు.
బీజేపీ విధానాలకు వ్యతిరేకమని చెప్పే కేసీఆర్ జమిలీ ఎన్నికలపై తన స్టాండ్ ఏంటో చెప్పాలి. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. జమిలీ ఎన్నికలు పెద్ద డ్రామా. బీజేపీలోని ‘బీ’.. టీఆర్‌ఎస్‌లోని ‘ఆర్‌ఎస్’ను కలిపితేనే ‘బీఆర్‌ఎస్’ అవుతోంది. అధ్యక్ష తరహా ఎన్నికల కుట్రలో భాగమే జమిలి ఎన్నికలు. రాష్ట్రాల అధికారాలు గుంజుకోవడానికే జమిలి ఎన్నికలు. జమిలీ ఎన్నికలు జరిగితే సౌత్ ఇండియాకి తీవ్ర ప్రమాదం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు వస్తే ఎలా..!
Comments
Please login to add a commentAdd a comment