సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 13 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేగానీ కేంద్రం రూపాయి ఇవ్వలేదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్‌ఎంసీ అటానమస్ బాడీ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment