ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం
బీఆర్‌ఎస్ పాలకుల మాదిరి గడీల్లో పడుకోలేదు
ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం
వైఎస్సార్‌కు నివాళులర్పించాక మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.
వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్‌ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment