![Prayers In Alampur For Harish Rao To Become a CM - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/4/222.jpg.webp?itok=lVyQOaUy)
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం( అలంపూర్): తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా హరీశ్‌రావు కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ ఆలయం ముందు హరీశ్‌రావు అభిమానులు 1116 టెంకాయలు కొట్టారు. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ఆధ్వర్యంలో కొంతమంది ఆ గ్రామస్తులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి కావాలని, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావాలని అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కు సమర్పించారు. అమ్మవారి రాజగోపురం ముందు టెంకాయలు కొట్టి హరిశ్ సీఎం కావాలని నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment