tatikonda rajaiah
-
కడియం.. దమ్ముంటే రాజీనామా చేయ్: రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొంద రాజయ్య. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే, హింసించే పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన నేతలకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.కాగా, స్టేషన్ ఘనపూర్‌లో శనివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంభించింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన గుండాలను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి అని కూడా చూడకుండా హరీష్ రావును తీసుకెళ్లడం దారుణం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన శాంతియుతంగా జరిగింది.కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేర్చారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో, కోడి గుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచాను.నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ముందు రాజీనామా చేయాలి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. హైకోర్టు బెంచ్, సుప్రీం కోర్టుకు వెళ్తా అనడం సిగ్గుచేటు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని అనేక సార్లు చెప్పిన కడియం.. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్‌కు చేసింది గుండు సున్నా. బీఆర్ఎస్ తెచ్చిన రైతుబంధును రైతుభరోసాగా మార్చారు. రైతుభరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: డీసీపీ ఫిర్యాదు..కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు -
కడియంను వదిలే ప్రసక్తే లేదు.. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య
సాక్షి, వరంగల్: ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు.. ఒకవైపు మాటల తూటాలు మరోవైపు తనదైన శైలిలో స్టెప్పులేసి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈల కొట్టి స్టెప్పులేసిన రాజయ్య.. కేసీఆర్ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి, బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాజయ్యతో పాటు, అక్కడే ఉన్న నేతలు సైతం స్టెప్పులు వేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా మారారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కడియం శ్రీహరిపై రాజయ్య రంకెలేస్తున్నారు. ఈ మేరకు తొడగొట్టి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే.. నమ్మకద్రోహం చేసిన కడియం అంతుచూస్తా.. నిన్ను భూ స్థాపితం చేయడమే నా లక్ష్యం అని అన్నారు. కడియంకు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి రా చూసు కుందాం అని మీసం మెలేసి సవాల్ విసిరారు. చదవండి: కేసీఆర్ కథలకు కాలం చెల్లింది: రేవంత్ కౌంటర్ ‘తెలుగు రాష్ట్రాల్లో అంతా మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. నాకు నేనుగా.. రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నాడు.. కానీ కడియం శ్రీహరి లాంటి భస్మాసురుడు పక్కన చేరాడు జాగ్రత్త. నాకున్న పని కేవలం నున్ని తొక్కుడే. దళిత ద్రోహి.. కల్నాయక్, నమ్మకద్రోహి.. డిక్టేటర్.. గుంటనక్క.. కడియం శ్రీహరి’ అంటూ నిప్పులు చెరిగారు. రాజయ్య మాటల తూటాలు పక్క దేశం పాకిస్థాన్ వరకు వెళ్తున్నాయి. కడియం శ్రీహరిని ఇక్కడ తొక్కితే పాకిస్తాన్లో తేలాలని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు మన గురించి చూస్తున్నాయని, ఇద్దరం పోటిచేసి చేసి తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. -
‘తాటికొండ’కు ఘన్పూర్ బాధ్యతలు
స్టేషన్ ఘన్పూర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి పిలుపురావడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదివారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు చేరుకుని కలిశారు. ఈ సందర్భంగా రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ కడియం శ్రీహరి పోరు పడలేక రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ వరంగల్ ఎంపీ టికెట్‌పై ఆశ పెట్టుకున్న రాజయ్యకు నిరాశే మిగిలింది. ఆ టికెట్‌ను డాక్టర్ సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయితే జనగా మ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దౌత్యంతో కేసీఆర్ నుంచి పిలుపురావడంతో భేటీ అయ్యారు. కాగా, రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని డాక్టర్ రాజ య్య తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ కోరారని చెప్పారు. -
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య !
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ మేరకు రాజయ్య పేరును కేసీఆర్ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం(ఏప్రిల్ 12) భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ సీటు స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారని అలకబూనిన రాజయ్య ఎన్నిలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌కు వెళ్లడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఓకే అన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ.. కడియం -
బీఆర్ఎస్ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్ షూటర్ మంత్రం పనిచేస్తుందా?
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్ ఈసారి హాట్ హాట్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో అంతర్గత కలహాలు అక్కడి అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలా ఈ నియోజకవర్గంకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతలంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు..టీడీపీ మూడు సార్లు.. గులాబీ పార్టీ ఉప ఎన్నికలతో సహా నాలుగుసార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాడికొండ రాజయ్య గులాబీ పార్టీ తరపున విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్లో తొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకే రెండోసారి అధికారం దక్కింది. ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి రగలిపోతున్నారు. రాజయ్య తీరుతో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి నష్టమని గ్రహించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ స్వయంగా రాజయ్యతో మాట్లాడి బుజ్జగించారు. కడియంతో కలిసి పనిచేయమని రాజయ్యకు సూచించారు. పెద్దల ముందు తలాడించినా గాని...ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజయ్య అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొదట్లో కడియం నిర్వహించిన అత్మీయ సమ్మేళనాలకు రాజయ్య హాజరుకాలేదు. ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం బలమైన నేతగా భావిస్తున్నా.. వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందనే భావన అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే ఈ అంశాన్ని విపక్షాలు క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయట.. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థనపేటకు మారింది. సభ నియోజకవర్గం మారడానికి ఘన్పూర్ పార్టీలో అంతర్గత కలహాలే కారణమంటూ ప్రచారం సాగింది. అక్కడి నుంచి వస్తున్న సర్వేలు సైతం గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఒకవైపు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఘన్పూర్ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారంచాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీద ఎటువంటి అవినీతి మరకా లేదు. అయితే రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే కడియంకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే..బీఆర్ఎస్లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కడియం అభ్యర్థిత్వాన్ని బలమైన మాదిగ సామాజిక వర్గం సైతం వ్యతిరేకిస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రబుల్ షూటర్‌గా ఉన్న మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయంలో 2012 ఉప ఎన్నికల్లో సైతం హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుని అప్పట్లో రాజయ్యను గెలిపించడానికి కృష్టిచేశారు. అప్పుడు ఎవరి ఓటమి కోసం పనిచేశారో అదే కడియం శ్రీహరి విజయం కోసం ఇప్పుడు మళ్లీ హరీష్ రావు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వచ్చిన హరిష్ రావు రాజయ్య ఇంటికి వెళ్లి నచ్చ చెప్పారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరి కోసం రాజయ్య మనస్పూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ ఘన్పూర్ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఈ సారి నిజమవుతుందా? లేదా అనే చర్చ కూడా మొదలైంది. -
రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. ఈ సమితిలో 1.60 లక్షల మంది సభ్యులున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్నమైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ హాట్ కామెంట్‌తో వార్తల్లోకెక్కారు. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనో వేదన చెందుతున్నారు. ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు.. లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న అనుచరులు సైతం నవ్వులు చిందించారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు... రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. తాజా కామెంట్లు ఆయన పార్టీ మారరనే సంగతి స్పష్టం చేస్తున్నా.. ఆయన కార్యచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
రాజయ్య... ఇక చాలు.. కేటీఆర్ క్లాస్? ఐదు నిమిషాల్లోనే అంతా సెట్!
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లక్ష్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో తనను కలవాల్సిందిగా ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ సోమవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఆ మేరకు రాజయ్య మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటన లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరస్పర విమర్శలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకొని పోవాలి మీడియాలో వస్తున్న వార్తలను కేటీఆర్ ప్రస్తావిస్తూ ‘రాజన్నా చేసింది చాలు.. ఎక్కువేం మాట్లాడకు.. సీఎంకు చెప్తా.. ఆయనే అన్నీ చూసుకుంటారు. మళ్లీ ఎక్కడా మాట్లాడొద్దు.. ఏమీ చెప్పొద్దు.. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకునిపోవాలి. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు’ అని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను పాల్గొన్న పల్లె నిద్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను పుస్తకరూపంలో కేటీఆర్‌కు రాజయ్య అందజేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే కేటీఆర్‌తో రాజయ్య భేటీ ముగిసినట్లు తెలిసింది. నాకే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది ‘టికెట్ విషయాన్ని అధిష్టానం చూసు కుంటుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తా. కేటీఆర్ నాతో మాట్లాడిన తీరు చూస్తే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. కడియంపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది’ అని రాజయ్య పేర్కొ న్నారు. తనపై స్థానికంగా వస్తున్న ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారని, ఆ ఆరోపణలు నిరాధారమనే విషయం పార్టీ నాయకత్వానికీ తెలుసన్నారు. ఇకపై నా నోటి నుంచి కడియం పేరు ఉండదు కేటీఆర్‌తో భేటీ అనంతరం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో నెలకొన్న సమస్య సద్దుమణిగింది. కేటీఆర్ పిలుపు మేరకు ప్రగతిభవన్‌కు వచ్చి అన్ని విషయాలు వివరించాను. పార్టీ లైన్లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారు. 2018 ఎన్నికల సమ యంలోనూ కడియం శ్రీహరి ఇలాగే వ్యవహ రించారు. నియోజకవర్గాల్లో విభేదాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు కేంద్రంగా పనులు జరగాలని కేసీఆర్ ఆదేశించినా కడియం పట్టించుకోలేదు. ఇతర ఎమ్మెల్సీలు నన్ను అడిగి నిధులు కేటాయిస్తే కడియం మాత్రం గ్రూపులు ప్రోత్సహించేలా వ్యవహరించారు. కడియం శ్రీహరిపై నేను కొత్తగా మోపిన అభియోగాలేమీ లేవు. పాత వాటిని ఉటంకించాను. ఇప్పటికి ఈ వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్నాను. నా నోటి నుంచి ఇకపై కడియం శ్రీహరి పేరు రాదు. కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తా’’ అని అన్నారు. -
నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరోక్షంగా స్పందించారు. ఈ వ్యవహారంలో గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నా.. ఆరోపణలను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా. సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తా. నేను ప్రజాజీవితంలో ఉన్నాను. ఎమ్మెల్యే రాజన్న అంటే ఓ ప్రజా నాయకుడు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపైనా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్కౌంటర్ల సృష్టికర్త. పార్టీ నుంచి బహిష్కరించనవారే కడియం వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్ చేయాలి. ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం కుమార్తె ఎస్సీ కాదు.. బీసీ కులానికి చెందుతుంది. సకల జనుల సమ్మెలో భాగంగా నేను రాజీనామా చేశాను.. కానీ, శ్రీహరి మాత్రం అలా చేయలేదు. ఇదే క్రమంలో ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటాను అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవు’ -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు
సాక్షి, జఫర్‌గఢ్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై నిజానిజాల ఆధారంగా ప్రభుత్వం, పార్టీపరంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొ న్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఓ విలేకరి ప్రస్తావించగా.. శ్రీహరి సమాధానమిస్తూ.. రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు విచారణలో తేలిన అంశాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం కొత్త మలుపు
హనుమకొండ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఫిర్యాదు
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ చినికిచినికి గాలివానగా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేతోపాటు తన భర్త ప్రవీణ్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌లపై బుధవారం సాయంత్రం ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య.. గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.100 బాండ్ పేపర్‌పై అప్పుగా రూ.20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టాలని ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తన భర్తపై కూడా ఆరోపణలు చేసిన నవ్య.. ఆయనతో కలిసే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం కొసమెరుపు. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేశారు.. సర్పంచ్ నవ్య.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ‘జానకీపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న నన్ను ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా వేధిస్తున్నారు. గతంలో నా భర్త ప్రవీణ్ కుమార్ ద్వారా నన్ను బలవంతగా ఒప్పించి, రాజీపడే విధంగా చేసి.. ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. మీడియా ముఖంగా జానకీపురం గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులనుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలను నమ్మి రాజీపపడ్డాం. కానీ నేటికీ ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా రూ.25 లక్షలు మాకే ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే చేయించాడు. నెలరోజుల కింద నా భర్త ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ గ్రామానికి నిధులు ఇస్తామని నన్ను హనుమకొండకు రప్పించి నా దగ్గరికి రెండు అగ్రిమెంటు పేపర్లను తీసుకువచ్చారు. ఒకటి గతంలో ఎమ్మెల్యేపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని, నేను తప్పుగా రాజకీయ లబ్ధి కోసం వాటిని చేసినట్లు ఒప్పుకున్నట్టుగా స్టాంపు పేపరుపైన రాయించుకొచ్చారు. మరో పేపర్‌పై రూ.20 లక్షలు నాకు అప్పుగా ఇచ్చినట్లు, తిరిగి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లు రాసుకొని వచ్చారు. వాటిపై సంతకం పెట్టాలని బలవంతం చేశారు. దీనిని నేను వ్యతిరేకించా. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేసి, సంతకం పెడితేనే గ్రామానికి ఒప్పుకున్న నిధులు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని వేధింపులకు గురి చేస్తున్నారు. మార్చి 8న జరిగిన వేధింపుల ఘటనలో మధ్యవర్తిత్వం వహించిన ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత ఆ రోజు క్షమించమని ప్రాధేయపడితే.. పోనీ, ఎవరి పాపం వారిది అని పేరు బయట పెట్టలేదు. అయినా నా భర్తకు డబ్బు ఆశచూపి ఒప్పంద పత్రంపై సంతకం చేయించడానికి పన్నాగం పన్నారు. నిజాయితీగా ఉండాలనుకున్న నేను సంతకం చేయకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నందున ఎమ్మెల్యే, ఆయన పీఏ, ఎంపీపీ, నా భర్తపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా’అని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భర్తతో కలసి నవ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు, బుధవారం రాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలతో పాటు తనభర్తపైనా నవ్య చేసిన ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ కంటెంట్ లేనందున కేసు నమోదు చేయలేదని, న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్ తెలిపారు. -
బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం!
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూటే సెపరేట్.. ఆయన ఏం చేసినా సంచలనమే. అతని వ్యవహారశైలీ నిత్య వివాదాస్పదం.. గతంలో తీవ్ర ఆరోపణలతో మంత్రి పదవిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఓ మహిళ విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చిలిపిచేష్టలతో చిక్కులో పడుతున్న ఎమ్మెల్యే యవ్వారం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అధికార పార్టీ లో కలకలం రేపుతోంది. పోరాటాల పురిటిగడ్డ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు ఉంటాయి, కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార పార్టీ బిఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తుంది. నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ ప్రజాసేవకు అంకితమైన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య యవ్వారం వివాదాస్పదంగా మారుతుంది. నిత్యం వార్తల్లో వ్యక్తిగా ప్రజల నోళ్ళలో నానుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. వైద్య వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న రాజయ్య మహిళల పట్ల ఆయన చూపే జాలి, ప్రేమ వికటించి అటు పార్టీని ఇటు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుంది. తాజాగా దళిత మహిళా సర్పంచ్ ఎమ్మెల్యే పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ దుమారానికి తెరలేపారు. రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే మంచిది.. లేకుంటే ఆయన సహకార అందించకుండా అణిచివేస్తాడని విమర్శించారు. ఎమ్మెల్యేను కలిసేటప్పుడు మగవాళ్ళు ఉండకూడదని, ఫోటోలు దిగేటప్పుడు అతుక్కుని ఉండాలనే ధోరణితో ఎమ్మెల్యే వ్యవహరిస్తాడని ఆరోపించారు. అలా ఉండకపోవడంతో ఓర్వలేడని తెలిపారు. ధర్మసాగర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసేటప్పుడు దూరంగా ఉంటే అందరి ముందు బొమ్మవా నువ్వు... కష్టపడి రాజకీయాల్లోకి వచ్చావు.. దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా..రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో కులపోళ్ళ ముందు ఇజ్జత్ పోయిందని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తోపాటు మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి, మరో అగ్రవర్ణ నాయకుడు నా బతుకును ఆగం చేయాలని చూశారు.. కానీ ఆగం కాలేదన్నారు. తనను నాశనం చేయాలని చూసిన మహిళను సాటి మహిళగా వారిని నాశనం చేయదలుచుకోలేదని తెలిపారు. తనకు ఎమ్మెల్యే తో పాటు మహిళ ప్రజాప్రతినిధి అగ్రవర్ణ వ్యక్తితో ప్రాణభయం ఉందని తనకు ఏమి జరిగినా ఆ ముగ్గురే బాధ్యులని స్పష్టం చేశారు. వారి నుండి రక్షణ కావాలని కోరుతూ కేసిఆర్ కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి వాళ్ళు ఉంటే ఆరాచకాలు ఉంటాయని, కెసిఆర్ కేటీఆర్ క్రింది స్థాయిలో ఏం జరుగుతుందో చూడండని కోరారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం కేటీఆర్ మీ క్రింద పనిచేసే వారి పనితీరును పరిశీలించండని మహిళా సర్పంచ్ నవ్య విజ్ఞప్తి చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. గ్రూప్ రాజకీయాలే కారణమా? నిప్పులేనిదే పొగ రాదన్నట్లు కొంత వాస్తవమే అయినప్పటికీ విమర్శల వెనుక అంతర్గత విబేదాలు గ్రూప్ రాజకీయాలే అందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా చక్రం తిప్పేందుకు అదృశ్య శక్తులు పావులు కదుపుతున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది పొలిటికల్ హీట్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య గత కొంత కాలంగా పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కప్పుడు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార పార్టీ బిఆర్ఎస్ లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. తుఫాను ముందటి ప్రశాంతతలా సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. అందులో భాగంగా వైరి వర్గం అంతర్గత కుమ్ములాటలు ఈ రకంగా బయట పడుతున్నాయని ప్రచారం సాగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు మహిళల వేదికగా తారస్థాయికి చేరుకుంటుందనే భావన ప్రజల్లో వ్యక్తమౌతుంది. స్వపక్షంలోనే విపక్షం తయారైనట్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి తమ పరువుతోపాటు పార్టీ పరువు తీస్తున్నారనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది. బిఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరిస్తున్న తరుణంలో నేతల మధ్య ఆధిపత్య పోరు, మహిళల పట్ల ఎమ్మెల్యే వైఖరి ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రాజకీయ కోణం దాగిఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టానని స్థానికులు కోరుతున్నారు. గులాబీ దళపతి వేసి చూసే ధోరణి అవలంబించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసేలా రాజయ్య వ్యవహారం మహిళా సర్పంచ్ నవ్య చేసిన విమర్శలు ఆరోపణకు ఆజ్యం పోసేలా రాజయ్య వ్యవహారం ఉంటుంది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్య అనతి కాలంలోనే తీవ్ర ఆరోపణలతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజయ్య మాటలు వ్యవహారశైలి స్త్రీ లోలుడిలా అర్థం వచ్చేలా ఉంటాయి. నియోజకవర్గంలో బర్డ్‌డే సందర్భంగా మహిళ పట్ల వ్యవహరించిన తీరు అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పిల్లలు పుట్టడానికి తన పుణ్యమేనని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటపుట్టించాయి. తాజాగా మహిళా సర్పంచ్ ని పట్టుకుని అతుక్కుని ఫోటోలు దిగాలని, రాజకీయాల్లో ఎంజాయ్ చేయాలని సూచించడం, అందుకు అనుగుణంగా ఓ మహిళా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అనుచరురాలు ఎమ్మెల్యేకు సహకరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడం ఎమ్మెల్యే వైఖరిని తేటతెల్లం చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాత్రం రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అలాంటి విమర్శలు ఆరోపణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిదొంగలు శిఖండి పాత్ర పోషిస్తు తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని, కుట్రలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్ళి తిప్పికొడుతానని రాజయ్య స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరవర్గం మహిళలు సైతం సర్పంచ్ నవ్య తీరును తప్పుపడుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మహిళా విషయంలో వర్గపోరుపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్లో వర్గ పోరు
వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఇద్దరూ దళిత నేతలే. కాని వారిద్దరికి అసలు పడదు. మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. తప్పు చేయలేదు.. తలవంచను అని ఒకరంటే, సీఎం కేసిఆర్‌కు వీరవిధేయుడిని తానేనంటు మరో నాయకుడు అంటున్నారు. ఓరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏమిటా కథ? ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలు సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కామనే. కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. గతం నుంచీ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార బిఆర్ఎస్లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు. లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికి తలవంచను.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివందనం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల కేసిఆర్‌కు రాజయ్య పాదాభివందనం చేయడంతో.. తప్పు చేసిన వాళ్ళే తలవంచి పాదాభివందనం చేస్తారంటూ చేసిన కామెంట్స్.. రాజయ్యను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రాజయ్య సైతం తానేమి తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే... గెలుపు నాదేనని స్పష్టం చేశారు. కేసిఆర్ నిర్ణయాలకి.. ఆయనకు వీరవిధేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మింగుడుపడటం లేదు. టార్గెట్ స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ అన్నట్లుగా కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సార్కే టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగగానే వ్యాఖ్యానిస్తున్నారు. కడియం రాజకీయ వైఖరి, ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు.. అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది. రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుకూలతలను అధిష్ఠానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇద్దరి రాజకీయ పరిస్థితి తయారైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. వీరివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గ కేడర్ కోరుతోంది. -
Dalit Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: పేద దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు, స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్ కుమార్ ఉండటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనతో పాటుగా ఘన్పూర్ ఎంపీపీ భర్త, కొందరు ప్రజాప్రతినిధులున్నారు. మండలంలో పేదవారిని కాదని, ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులనే ఎంపిక చేశారని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షపార్టీల నాయకులు, యువకులు సోమవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) -
ఎమ్మెల్యే పెళ్లిరోజు.. 101 కొబ్బరికాయలు కొట్టిన కార్యకర్త
సాక్షి, వరంగల్ / జనగామా: కోరుకున్న కోర్కెలు తీర్చితే దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చూశాం. అభిమాన తారలకు, నాయకులకు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇవన్ని రోటిన్‌గా అనిపించాయో ఏమో తెలియదు కానీ తాజాగా ఓ కార్యకర్త ఎమ్మెల్యే మీద అభిమానం చాటుకోవడం కోసం మోకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కి.. 101 కొబ్బరికాయలు కొట్టాడు. ఆ వివరాలు.. జనగామా జిల్లా చిల్పూర్ గుట్ట వాసి మూల నాగరాజు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వీరాభిమాని. ఈ నేపథ్యంలో నేడు తన అభిమాన నాయకుడి పెళ్లి రోజు సందర్భంగా చిల్లూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 101 కొబ్బరి కాయలు కొట్టి.. మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి అభిమానం చాటుకున్నాడు నాగరాజు. రాజయ్య పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ‘రాజయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. రాబోయే రోజుల్లో ఆయనను మంత్రిగా చూడాలని దేవుడిని కోరుకున్నాను’ అని తెలిపాడు. ఇక నాగరాజు చిల్పూర్ గుట్ట దేవస్థానంలో మూడు పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగాడు. -
హరీశ్‌రావు సీఎం కావాలంటూ పూజలు
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం( అలంపూర్): తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా హరీశ్‌రావు కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ ఆలయం ముందు హరీశ్‌రావు అభిమానులు 1116 టెంకాయలు కొట్టారు. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ఆధ్వర్యంలో కొంతమంది ఆ గ్రామస్తులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి కావాలని, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావాలని అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కు సమర్పించారు. అమ్మవారి రాజగోపురం ముందు టెంకాయలు కొట్టి హరిశ్ సీఎం కావాలని నినదించారు. -
నువ్వానేనా.. కడియం వర్సెస్ రాజయ్య!
సాక్షి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలను తీసుకెళ్లే విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాగుతున్న ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి.రాజయ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పోటీపోటీగా తేదీలను ఖరారు చేసి, పోస్టర్లు, ఫ్లెక్సీలను విడుదల చేయడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కాళేశ్వరం బాట పట్టించే క్రమంలో వేర్వేరు తేదీలను ఖరారు చేయడం వివాదస్పదమవుతోంది. ఆది నుంచి ప్రత్యర్థులే.. ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రెండు గ్రూపుల ప్రతినిధులుగా ఉన్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మొదటి నుంచి ప్రత్యర్థులే. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, కడియం శ్రీహరి ప్రత్యర్ధులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఇరువురు నేతలు, వారి అనుచరుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణమే నడిచేది. 2014 ఎన్నిక ల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు. ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగిన రోజుల్లో కడియం శ్రీహరి అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆరు నెలల తర్వాత వివిధ కారణాలతో రాజయ్యను తొలగించగా.. అదే పదవిని సీఎం కేసీ ఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టారు. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నా.. ఈ ఇద్ద రి మధ్య విభేదాలకు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎంగా కొనసాగినన్నిరోజులు కడియం శ్రీహరి నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలకు ముందు కడి యం వర్గీయులు టీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన సభతో కార్యక్రమాలను నిర్వహించారు. ఆ ఆవేదన సభలు కూడా ఇరువర్గాల మధ్య విభేదా లను మరింతగా పెంచాయి. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. రాజయ్యనే రుగా వెళ్లి తనకు సహకరించాలని కడియం శ్రీహరిని కలి సి వేడుకున్నారు కూడా. అయితే, ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేయగా రాజయ్య విజయం సాధించారు. ఎన్నికల సమయం నుంచి రెండు వర్గాల మధ్య అంతా బాగానే ఉన్నట్లుగా అనిపించినా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలతో పొరపొచ్చాలు వెలుగుచూశాయి. టిక్కెట్లు కేటాయించిన విధానం ద్వారా రాజయ్య పూర్తిగా కడియం శ్రీహరి అనుచరులకు చోటు కల్పించలేదన్న వాదన బలపడింది. ఆ తర్వాత నుంచి మళ్లీ గ్రూపుల పోరు యథాతధమైంది. మరోసారి బహిర్గతం ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు. ఇలా ఇద్దరి నేతల మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య అంతరాన్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. ముందుగా కడియం శ్రీహరి ఈనెల 4న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కాళేశ్వరం సందర్శన యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అంతకుముందే అంటే 1వ తేదీనే కాళేశ్వరం సందర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకే నియోజకవర్గం నుంచి రాజయ్య, శ్రీహరి వేర్వేరు తేదీల్లో కాళేశ్వరం యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. -
మా ఊరికి ఏం చేశావ్?
రఘునాథపల్లి(స్టేషన్‌ఘన్‌పూర్): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎన్నికల ప్రచారంలో అడ్డంకులు తప్పడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో శనివారం పలువురు యువకులు తమ గ్రామానికి ఏం చేశావంటూ వాదనకు దిగారు. సీసీ రోడ్లు లేవు.. తాగునీటి సరఫరా లేదు.. ఐదేళ్లుగా సీసీ రోడ్లు లేవు.. తాగు నీటి సరఫరా లేదు.. ఐదేళ్లుగా తండాను ఎలాంటి అభివృద్ధి చేయలేదు? ఓట్లు ఎలా వేస్తాం? అంటూ ప్రశ్నించారు. జాఫర్‌గూడెం నుంచి అశ్వరావుపల్లికి బీటీ రోడ్డు ఎందుకు వేయలేదని గ్రామస్తులు ప్రశ్నించారు. అశ్వరావుపల్లికి బీటీ రోడ్డు మంజూరైందని, ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమవుతాయని రాజయ్య చెప్పారు. మంగళిబండతండాలో కొత్తగూడెం నుంచి వాటర్ ట్యాంకు వరకు సీసీ రోడ్డు, మురుగుకాల్వలు నిర్మించాలని, మిషన్‌భగీరథ నీళ్లు రావడం లేదని రాజయ్య దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని ఆయన నచ్చజెప్పారు. అంబేడ్కర్‌ను మరిచారు.. ఆశీర్వాదం పేరుతో మండలంలో తొలి ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముందుగా రఘునాథపల్లి మండలకేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఎస్బీఐ నుంచి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం మీదుగా ర్యాలీ వెళ్లినా అక్కడ నివాళులర్పించకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. రాజయ్యతో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయించాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మండల పార్టీ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. రాజయ్య రహదారి లోని పలు షాపులకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కానీ అంబేడ్కర్, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించకుండానే వెళ్లడం గమనార్హం. -
ఘన్పూర్ నీది కాదు.. మనది!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాజయ్య ఇప్పుడు కూడా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నాది అంటున్నారు. ఆ మాట మాట్లాడొద్దు. ఇది నీ నియోజక వర్గం కాదు. ఇది మన నియోజక వర్గం. మీకు 52 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. నేను పోటీ చేసినప్పుడు 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను’ అని టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ అసమ్మతి నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు గురువారం సమన్వయ కమిటీ సమావేశం అయింది. వరంగల్‌లోని ఓ హోటల్లో కడియం, టి.రాజయ్య, ఉమ్మడి వరం గల్ జిల్లా పరిశీలకులు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండా ప్రకాష్, సీతారాంనాయక్, పసునూ రి దయాకర్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎదుటివారిని చులకన చేసి మాట్లాడొద్దని, ఎక్కడ ఎవరి వల్ల పని అవుతుందో, వారితో ఆ పని చేసుకుంటేనే ఫలితం వస్తుందని రాజయ్యను ఉద్దేశించి అన్నారు. రాజయ్య కు కూడా తమ్మునిగా భావించి సలహా ఇస్తున్నానంటూ.. నీ వెంట ఉన్నవాళ్లు, నువ్వు గెలువాలని కోరుకుంటున్న వాళ్లు, పక్కన ఉన్నవాళ్లని అవమాన పర్చే విధంగా వెకిలిగా నవ్వొద్దని సూచించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్క నియోజకవర్గంలో ఫలితాలు తారుమారు అయినా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అని గుర్తు పెట్టుకుని పనిచేయాలని ఆయన కార్యకర్తలను హితబోధ చేశారు. -
జీవితాంతం టీఆర్ఎస్లోనే ఉంటా
గిట్టనివాళ్లే అసత్య ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : బతికినంత కాలం టీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ను వీడుతున్నట్లు కొందరు గిట్టనివాళ్లు అసత్యప్రచారం చేస్తున్నారని తీవ్రపదజాలంతో ధ్వజమెత్తారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఇలాగే మొరుగుతాయని ఎద్దేవా చేశారు. మండలకేంద్రంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యూరు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధనకు బతికినంత కాలం పనిచేస్తానని పునురుద్ఘాటించారు. త్వరలో గ్రామ పంచాయతీలకు 14వ ఫైనాన్స్ నిధులు వస్తున్నాయని, రూ.25 కోట్లతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరా రు. పార్టీ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, పీఏసీఎస్ చైర్మన్ గట్టు రమేష్, పార్టీ మండలాధ్యక్షుడు అక్కినపెల్లి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు బంగ్లా శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
తెలంగాణ కోసం పదవి వదులుకున్నా.. : రాజయ్య
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం కోసం వైద్యులు ముందుండి పోరాడారు... స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి దంత వైద్యుల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి వచ్చిన దంత వైద్యులు, వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యాయని... ఇది వైద్యులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. -
పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....
సర్కారు దవాఖానాల ప్రక్షాళన నరకకూపాలుగా ఉన్న సర్కారు దవాఖానాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని మేకవనంపల్లిలో నిర్మించిన మేథడిస్టు చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ అభివృద్ధి చర్యల్లో భాగంగా జిల్లా ఆస్పత్రికి రూ.25 కోట్ల చొప్పున, ఇతర ఆస్పత్రులు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలోని ఆస్పత్రులలో నిద్రిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దళిత, గిరిజన పక్షపాతి అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో దళితులు, రూ.25వేల కోట్లతో బీసీలు, రూ.15వేల కోట్లతో గిరిజనులు, రూ.15వేల కోట్లతో మైనార్టీల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేయనున్న పలు పథకాల గురించి వివరించారు. పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా.... పశువుల కాపరియైన తాను పసిపాపల వైద్యుడ్ని అయ్యానని ఆయన చిన్నప్పటి స్మృతులను రాజయ్య గుర్తుచేసుకున్నారు. పట్టుదల, అత్మవిశ్వాసం, క్రమశిక్షణలతో ఎదైనా సాధించవచ్చన్నారు. పొరుగు వారిని నిండు మనసుతో ప్రేమించాలని ఆయన కోరారు. మోమిన్‌పేటలో 30పడకల ఆస్పత్రికి హామీ మోమిన్‌పేట మండల కేంద్రంలో ఉన్న ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నందున రోగులకు వైద్యం పూర్తి స్థాయి లో అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖితారెడ్డిలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన 30పడకల ఆస్పత్రి మంజూరుకు హామీ ఇచ్చారు. అందుకు రూ.1.20కోట్లు ఆవసరమవుతాయని, వెంటనే మంజూరు చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు చర్చిలో మినీ క్రిస్ట్మస్ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మార్కెటు కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ సభ్యులు భాస్కర్, రాములమ్మ, చర్చి నిర్మాణ కర్త సంజీవరావు,పాస్టరు పద్మాకర్, నాయకులు సంగారెడ్డి, లక్ష్మయ్య, నరేందర్‌రెడ్డి, మహంత్‌స్వామి, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, ఆనందం, ప్రతాప్‌రెడ్డి, చెన్న తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ
కూసుమంచి: ఉప ముఖ్యమంత్రి, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ ఇక్కడ ఆగారు. ఆస్పత్రిలోకి డిప్యూటీ సీఎం ఒక్కసారిగా రావడంతో సిబ్బంది హడలెత్తిపోయారు. ఉరుకులు, పరుగులు పెట్టారు. రాజయ్య నేరుగా మెడికల్ ఆఫీసర్ గదిలోకి వెళ్లి ఓపీ రిజస్టర్లు, ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ శంకర్‌కుమార్ ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నిల్వ ఉంచిన కుక్కకాటు, పాముకాటు మందులను తెప్పించి పరిశీలించారు. ఈ మందులను ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ల్యాబ్ రూమ్‌ను పరిశీలించారు. ఇదే ఆస్పత్రి ఆవరణలో ఉన్న హోమియో ఆస్పత్రిని కూడా సందర్శించారు. ఆస్పత్రికి కొత్త భవనం కావాలని వైద్యాధికారి నర్సింహరాజు కోరడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం వచ్చిన సమయంలో కొందరు పేషంట్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఉమా మహేష్ అనే బాలుడిని ఆయన స్వయంగా పరీక్షించి, మందులు రాసి ఇచ్చారు. నువ్వు కూడా నాలా డాక్టర్ కావాలంటూ ఆ బాలుడిని దీవించారు. ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలను పలుకరిస్తూ పింఛన్ వస్తోందా అని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ స్థాయిని పెంచాలి నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలోని పీహెచ్సీ స్థాయిని పెంచాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి సరిత, బారి వీరభద్రం, మాదాసు ఉపేందర్, రంజాన్ తదితరులు డిప్యూటీ సీఎం రాజయ్యను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. నాయకులు కూడా ఆస్పత్రుల అభివృద్ధికి సహకరించాలని రాజయ్య సూచించారు. ఆస్పత్రి నిర్వహణ సరిగా లేదని, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని కూసుమంచికి చెందిన బారి వీరభద్రం ఫిర్యాదు చేయగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిని సహించేది లేదన్నారు. ఆస్పత్రి తెరవకపోతే తనకు ఎవరైనా నేరుగా ఫోన్ చేయొచ్చని సూచించారు.