కేసీఆర్‌ను కలిసిన రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి పిలుపురావడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదివారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు చేరుకుని కలిశారు. ఈ సందర్భంగా రాజయ్యకు బీఆర్‌ఎస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ కడియం శ్రీహరి పోరు పడలేక రాజయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ వరంగల్ ఎంపీ టికెట్‌పై ఆశ పెట్టుకున్న రాజయ్యకు నిరాశే మిగిలింది. ఆ టికెట్‌ను డాక్టర్ సుధీర్‌కుమార్‌కు కేటాయించారు.
అయితే జనగా మ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దౌత్యంతో కేసీఆర్ నుంచి పిలుపురావడంతో భేటీ అయ్యారు. కాగా, రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని డాక్టర్ రాజ య్య తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ కోరారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment