BRS MLA Rajaiah Sensational Comments On Kadiyam Srihari - Sakshi
Sakshi News home page

నవ్య ఎపిసోడ్‌.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్‌, కడియంపైన సంచలన ఆరోపణలు

Published Fri, Jul 7 2023 5:16 PM | Last Updated on Fri, Jul 7 2023 6:22 PM

BRS MLA Rajaiah Sensational Comments On kadiyam Srihari - Sakshi

సాక్షి, జనగామ: జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరోక్షంగా  స్పందించారు. ఈ వ్యవహారంలో గోబెల్స్‌ ప్రచారం నమ్మవద్దని రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.  ‘ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నా.. ఆరోపణలను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా. సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తా. నేను ప్రజాజీవితంలో ఉన్నాను‌. ఎమ్మెల్యే రాజన్న అంటే ఓ ప్రజా నాయకుడు’ అని ఆయన పేర్కొన్నారు. 

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపైనా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. పార్టీ నుంచి బహిష్కరించనవారే కడియం వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్‌ చేయాలి.

ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం కుమార్తె ఎస్సీ కాదు.. బీసీ కులానికి చెందుతుంది. సకల జనుల సమ్మెలో భాగంగా నేను రాజీనామా చేశాను.. కానీ, శ్రీహరి మాత్రం అలా చేయలేదు. ఇదే క్రమంలో ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటాను అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘సర్పంచ్‌ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement