
రాజయ్యను అభినందిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు.
ఈ సమితిలో 1.60 లక్షల మంది సభ్యులున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్నమైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment