took
-
అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని...
తలమడుగు/తాంసి ఆదిలాబాద్ జిల్లా: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం, తాను అప్పు తీసుకున్న వారికి సమాధానం చెప్పలేక ఓ వ్యక్తి మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించి . అందులో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, తలమడుగు ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రాకేశ్ తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన తన మేనమామ వద్ద పెరిగాడు. రాకేశ్‌కు ఆదిలాబాద్‌కు చెందిన లావణ్యతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కూతురు ప్రశస్త్య ఉంది. మొదట్లో ఆటో నడిపేవాడు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో మృతుడి మేనమామ–అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సాయి, స్పందన ఉన్నారు. వారు రాకేశ్ సంరక్షణలోనే ఉన్నారు. ఇద్దరూ ఉన్నతవిద్య అభ్యసించగా, సాయి బెంగ ళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్పందన ఇటీవల నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. రాకేందర్‌కు రూ.60 లక్షలు అప్పుగా..ఆదిలాబాద్‌లోని విద్యానగర్ కాలనీలో 21 మంది సభ్యులతో కలిసి రాకేందర్ ఆర్కే సొసైటీని ప్రారంభించాడు. లావణ్య సైతం ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. అందులో కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అయితే ఆ సొసైటీ దివాలా తీసింది. అదే విధంగా రాకేందర్‌కు రూ.60లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాకేశ్–లావణ్య దంపతులు సూసైడ్ నోట్ రాశారు. బాకీ ఉన్న డబ్బుల వివరాలు కూడా అందులో పేర్కొన్నారు. రాకేందర్ తీసుకున్న ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివరించారు. దీంతో ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, బయట తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా రాకేశ్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.సొంత చేనుకు వచ్చిన... శనివారం ఉదయం తలమడుగు మండలం ఉండం శివారులో ఉన్న తన సొంత చేనులో రాకేశ్(35), ఆయన భార్య లావణ్య, మరదలు స్పందన(19) పురుగు మందు తాగారు. ఆ తర్వాత లావణ్య జిల్లా కేంద్రంలో ఉండే తన బాబాయికి ఫోన్ ద్వారా సమాచారం ఇచి్చంది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాకేశ్, స్పందన చనిపోయారు. కొనఊపిరితో ఉన్న లావణ్యను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కూతురుకు తాగించేందుకు మందు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. -
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. ఈ సమితిలో 1.60 లక్షల మంది సభ్యులున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్నమైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: చెప్పు తీసుకొని పాము పరార్
-
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
– విద్యుదాఘాతంతో యువకుడి మృతి – అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ – తుంగతుర్తి మండల పరిధిలో ఘటన తుంగతుర్తి : అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్న యువకుడిని యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి. తుంగతుర్తి మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు.. మండలంలోని పస్తాల గ్రామానికి చెందిన తాడమల్ల ఏసుబాబు లలితల దంపతుల కుమారుడు అశోక్(20) నూతనంగా వేసిన విద్యుత్ స్తంభాలను ఎత్తి విద్యుత్ లైన్లు లాగడానికి కూలీగా వెళ్తున్నాడు. బుధవారం తిరుమలగిరి మండలం జలాల్ పురం సబ్ స్టేషన్ నుంచి తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి లూస్‌లైన్ స్తంభాలు ఎత్తివిద్యుత్ లైన్లు లాగడానికి వెళ్లాడు. స్తంభాలు నాటే క్రమంలో సబ్ స్టేషన్లో ఎల్సీ తీసుకుని లైన్లు లాగుతున్నారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతోఅశోక్ స్తంభంపైనే విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. గ్రామస్తుల ఆందోళన విద్యుత్ పనులు చేస్తుండగానే జలాల్ పురం సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరా జరిగి అశోక్ మృతిచెందాడని లైన్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, విద్యుత్ కాంట్రాక్టర్ తెలిపారు. యువకుడు మృతి చెందిన విషయం విద్యుత్ అధికారులకు తెలిసినాlరాకపోవడంతో ఆగ్రహించిన పస్తాల, గొట్టిపర్తి గ్రామస్తులు ధర్నాకు దిగారు. విద్యుత్ అధికారులు వచ్చి తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని స్తంభం మీది నుంచి కిందకు తీయమని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చెరుకుని అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహంచారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తమకు సరైన న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మిన్నంటిన ఆర్తనాదాలు చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లి తండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబంలో తన కుమారుడు కూలి పనులపై సంపాదించిన డబ్బుతోనే కుటుంబం గడుస్తుంది. ఆ కుటుంబాన్ని విద్యుత్‌శాఖ అధికారులు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గుడిపాటి నర్సయ్య, అన్నెపర్తి జ్ఞానసుందర్, తొడుసు లింగయ్య, కడారి వీరస్వామి, వెంకట్‌రెడ్డి, డిమాండ్ చేశారు. -
వైద్యం వికటించి బాలింత మృతి
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ఖమ్మం వైద్య విభాగం : చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన సంఘటన శనివారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. నిర్లక్ష్యపు వైద్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి... నాహబ్రాహ్మణ కాలనీకి చెందిన జంపాల స్రవంతి (27)కి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో బంధువులు మయూరిసెంటర్ బ్రిడ్జి పక్కన ఉన్న వాసిరెడ్డి నిర్మల ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని తెలపడంతో బంధువులు అంగీకరించారు. రాత్రి ఆపరేషన్ నిర్వహించగా ఆ మహిళకు మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే చికిత్స పొందుతున్న æబాలింత మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆమె బంధువులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహం వద్ద రోధిస్తూ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యుల వాదన మాత్రం మరోలా ఉంది. ఓవర్ బ్లీడింగ్ మూలంగానే బాలింత మృతి చెందిందని తెలిపారు. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని ప్రకటించారు. -
ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోండి
చీరాల రూరల్, న్యూస్‌లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి.జనార్దన్ అన్నారు. మంగళవారం ఆయన చీరాల వచ్చిన సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాలలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన 2008 నుంచి 2013 ఆగస్టు చివరి వరకు జిల్లాలో 83,170 కేసులు నమోదు కాగా అందుకోసం రూ. 235.25 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలానే జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో మూడు ప్రభుత్వ వైద్యశాలలు, ఆరు ప్రైవేటు వైద్యశాలలు పని చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో ఆరోగ్యశ్రీ కింద రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక సదుపాయాలున్న రెండు గదులను నిర్మించామన్నారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 938 రకాల కేసులు చూస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా నెట్వర్క్ టీం లీడర్ కిరణ్‌కుమార్, స్థానిక ఆరోగ్యమిత్ర మురళి ఉన్నారు. -
క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ