కిరణ్ ఫోటోలు చించేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం | Tatikonda Rajaiah Tear off Kiran Kumar Reddy Photos | Sakshi
Sakshi News home page

కిరణ్ ఫోటోలు చించేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Published Tue, Jul 15 2014 3:54 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

కిరణ్ ఫోటోలు చించేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం - Sakshi

కిరణ్ ఫోటోలు చించేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చించివేశారు.

మహబూబ్‌నగర్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చించివేశారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో కంటపడడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. కిరణ్ ఫోటోలను స్వయంగా చించివేశారు.

అంతకుముందు జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మహబూబ్నగర్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి రోగి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులను మందుల కోసం బయటకు పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement