
సాక్షి, వరంగల్ / జనగామా: కోరుకున్న కోర్కెలు తీర్చితే దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చూశాం. అభిమాన తారలకు, నాయకులకు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇవన్ని రోటిన్‌గా అనిపించాయో ఏమో తెలియదు కానీ తాజాగా ఓ కార్యకర్త ఎమ్మెల్యే మీద అభిమానం చాటుకోవడం కోసం మోకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కి.. 101 కొబ్బరికాయలు కొట్టాడు. ఆ వివరాలు.. జనగామా జిల్లా చిల్పూర్ గుట్ట వాసి మూల నాగరాజు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వీరాభిమాని. ఈ నేపథ్యంలో నేడు తన అభిమాన నాయకుడి పెళ్లి రోజు సందర్భంగా చిల్లూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 101 కొబ్బరి కాయలు కొట్టి.. మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి అభిమానం చాటుకున్నాడు నాగరాజు. రాజయ్య పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ‘రాజయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. రాబోయే రోజుల్లో ఆయనను మంత్రిగా చూడాలని దేవుడిని కోరుకున్నాను’ అని తెలిపాడు. ఇక నాగరాజు చిల్పూర్ గుట్ట దేవస్థానంలో మూడు పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగాడు.
Comments
Please login to add a commentAdd a comment