
గతేడాది కేశవ చంద్రా రమావత్ (కేసీఆర్) మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్. ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవితం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేశ్. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సుజాతను పెళ్లాడిన రాకేశ్..
అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే యాంకర్ జోర్దార్ సుజాతను ఆయన పెళ్లాడారు. 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. జోర్దార్ సుజాత టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్‌తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి.
పెళ్లి రోజు శుభాకాంక్షలు..
అయితే తాజాగా ఈ టాలీవుడ్ బుల్లితెర జంట తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు రాకింగ్ రాకేశ్. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారి పెళ్లి ఫోటోను పంచుకున్నారు.
ట్విటర్‌లో రాకింగ్ రాకేశ్ రాస్తూ..'పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం.. ప్రేమగా మొదలై.. బంధంగా ముడిపడి.. బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో ఈ జంటకు కుమర్తె జన్మించిన సంగతి తెలిసిందే.
పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం❤️
ప్రేమగా మొదలై బంధంగా ముడిపడి బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు శుభాకాంక్షలు మీ అందరి ఆశీస్సులతో🙏🌹 pic.twitter.com/Lfs9N1kWZz— RockingRakesh (@RockingrakeshJB) February 24, 2025
Comments
Please login to add a commentAdd a comment