-
తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేశ్? ఫోటో వైరల్!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదే వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. అలా సుజాత.. తన మాటల ప్రవాహంతో ఫేమస్ అయింది. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్ సుజాతగా పేరు సంపాదించుకుంది. మొదట్లో టీవీ ఛానల్లో వార్తలు చదివింది. తర్వాత బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. టీవీ షోలతో బిజీ అయింది. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్‌ను పెళ్లి చేసుకుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. తాజాగా ఆమె సీమంతం జరిగిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో సుజాత.. పర్పుల్ కలర్ సారీలో నిండా నగలు ధరించి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోను గెటప్ శ్రీను భార్య సుజాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ హ్యాపీ ఫర్ యూ.. కంగ్రాచ్యులేషన్స్ అని రాసుకొచ్చింది. అయితే సుజాత.. తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంతవరకు చెప్పనేలేదు. కానీ కొంతకాలంగా ఆమె ఏ వీడియో షేర్ చేసినా జనాలు దాని కింద మీరు ప్రెగ్నెంట్ కదా.. అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడిలా సీమంతం చేసుకున్నట్లుగా ఫోటో బయటకు రావడంతో సుజాత ప్రెగ్నెన్సీ నిజమేనంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: వంద కోట్లకు చేరువలో క్రూ.. అంత స్పెషల్ ఏముందబ్బా? -
రాకింగ్ రాకేశ్‌కు పెద్ద షాకే ఇచ్చింది!
తెలంగాణ యాసతో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది జోర్దార్ సుజాత. వసపిట్టలా మాట్లాడే ఈమె మొదట్లో యాంకర్‌గా చేసినా తర్వాత కమెడియన్‌గా, నటిగానూ సత్తా చాటింది. బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె గతేడాది జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్‌ను పెళ్లాడింది. అప్పటినుంచి తన జీవితంలో సంతోషకర క్షణాలను, బాధను, ఏ విషయాన్నైనా సరే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ మధ్యే వాస్తు బాలేదని తన ఇల్లు ఖాళీ చేసింది. ఈ క్రమంలో సర్ప్రైజ్ అంటూ యూట్యూబ్‌లో వీడియో రిలీజ్ చేసింది. కొత్త ఇల్లు కొన్నట్లు తెలిపింది. భర్తకు తెలియకుండానే ఈ 3BHKను కొనుగోలు చేసినట్లు తెలిపింది. 17వ అంతస్తులో ఓ ఫ్లాట్ కొన్నానంటూ దాన్ని చూపించింది. 'ఇది నేనే కొన్నాను, నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను' అంటూ రాకేశ్‌ను సర్ప్రైజ్ చేసింది. భార్య ఇల్లు కొన్న విషయం తెలిసి షాకయ్యాడు రాకేశ్. నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందంటూ మెచ్చుకున్నాడు. కానీ ఇంతలోనే అసలు విషయం బయటపెట్టింది సుజాత. ఈ ఇల్లు తాను కొనలేదని చెప్పింది. పక్కింటివాళ్లు కొన్నారంటూ ప్రాంక్ చేసింది. ఈ రేంజ్ ట్విస్ట్ ఊహించని రాకేశ్‌కు నోట మాట రాలేదు. ఇలాంటి ప్రాంకులు చేయకని సుతిమెత్తగా వారించాడు. కెమెరా ఆన్‌లో ఉంది కాబట్టి ఏం చేయడం లేదని అసహనానికి లోనయ్యాడు. తనకు ఆల్రెడీ ఇల్లు ఉందని, అయినా సరే ఇలాంటి ఇల్లు కూడా ఎప్పటికైనా కొంటామని చెప్పుకొచ్చారు. చదవండి: నా లైఫ్‌లోకి భార్య వచ్చాకే అదంతా మారింది.. అంతకుముందు.. -
జోర్దర్ సుజాతతో శ్రీలీల పిచ్చ కామెడీ..
-
London Pochamma Bonalu : లండన్ బోనాల్లో జోర్దార్ సుజాత (ఫొటోలు)
-
లండన్ గడ్డపై రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత బోనాల జాతర
వరంగల్‌కు చెందిన ఎన్నారై ఫొరమ్ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్నారై ఫోరమ్ నిర్ణయించుకుంది. యాంకర, నటి తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. ఈ మేరకు ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుంచి రాకింగ్ రాకేశ్, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’అని తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్ శిష్యుల తర్వాత రాకింగ్ రాజేశ్ మిమిక్రీ అంతగా పాపురల్ అయ్యారు. బజర్దస్త్ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘వరంగల్ ఎన్నారై ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్నారై ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
'ఏ యాసతో అవమానాలు పడ్డదో.. ఇప్పుడదే ఆమెను స్టార్‌ను చేసింది'
ఏ యాస మాట్లాడి అవమానపడ్డదో.. ఆ యాసతోనే పాపులర్ అయిన నటి.. జోర్దార్ సుజాత. కయ్యకయ్య అరుస్తూనే కమ్మని పదాలతో.. శనార్తులంటూ వరుస బుల్లితెర అవకాశాలతో పాటు, వెబ్ ప్రపంచంలోకీ అడుగుపెట్టిన ఆమె గురించి కొన్ని వివరాలు..! సుజాత అసలు పేరు శ్రుతి. స్వగ్రామం వరంగల్ జిల్లా.. ఉప్పర్ పల్లి. అమ్మ అంగన్వాడీ టీచర్. నాన్న ప్రైవేట్ టూరిస్ట్ బస్ డ్రైవర్. ముగ్గురు అక్కాచెల్లెళ్లలోకి తనే చిన్నది. ఇద్దరు అక్కలకు ఇంటరైపోయిన వెంటనే పెళ్లి చేశారు. తన వంతు వచ్చేసరికి పోలీసు ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులను ఒప్పించి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగంతోనే ఇంటికి తిరిగి వస్తానని హైదరాబాద్ వచ్చింది. మొదట ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. అయితే తన యాస, తీరు వల్ల అక్కడ ఇమడలేకపోయింది. (ఇది చదవండి: నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్) ఆ తర్వాత టీవీ చానళ్లలో తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి.. అక్కడ ప్రయత్నించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ ‘జోర్దార్ సుజాత’గా మారి మంచి గుర్తింపు పొందింది. అదే.. ఆమెకు బుల్లితెర అవకాశాలనూ తెచ్చిపెట్టింది. ఇక బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడిప్పుడే సినిమాలకు కూడా అడుగుతుండ్రు. సిస్టర్ రోల్స్, ఫ్రెండ్ రోల్స్ చాలానే వస్తున్నయి. ఇంకేదీ ఫైనల్ చేయలేదు. మనమేదైనా చేస్తే టర్నింగ్ పాయింట్ లెక్క ఉండాలేగనీ, ఏదో చేస్నున్నవా అంటే చేస్తున్న అన్నట్లు ఉండొద్దు కదా? – సుజాత పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. తర్వాత తన పేరు మీదనే సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి మరింత పాపులర్ అయింది. ఈ మధ్యనే జబర్దస్త్ కమేడియన్ రాకింగ్ రాకేశ్‌ను ప్రేమ వివాహం చేసుకొని, జీవితంలో మరో అడుగు ముందుకు వేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్‌తో వెబ్ దునియాలోనూ తన జోరు సాగిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్‌లో.. తెలంగాణ యాసలో సుజాత అందంగా తిట్టిన తిట్లు.. సోషల్ మీడియాలో రీల్స్‌గా మారి తెగ వైరల్ అవుతున్నాయి. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి)
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అరుకు లోయలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు
ఎయిడ్స్ రోగులను ఆదరించాలి
విత్తన కొరత లేకుండా చర్యలు
ప్రైవేట్.. దోపిడీ
● నిబంధనలు పాటించని నర్సింగ్‌హోమ్‌లు ● కానరాని ఫీజుల వివరాల పట్టిక ● అవసరం లేకున్నా వివిధ రకాల పరీక్షలు ● రోగుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లు ● నియంత్రించడంలో అధికారులు విఫలం
విత్తనం.. భారం
న్యూస్‌రీల్
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహిళా ఓటర్ల వివరాలు...
సుందరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్‌పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement